రక్షణ మంత్రిత్వ శాఖ
సీఎస్‌డీల నుండి ఏఎఫ్‌డి-ఐ వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆన్‌లైన్ పోర్టల్‌ను రక్షణమంత్రి శ్రీరాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.
Posted On:
08 JAN 2021 1:10PM by PIB Hyderabad
రక్షణమంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఈ రోజు https://afd.csdindia.gov.in/ ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఎగైనెస్ట్ ఫర్మ్ డిమాండ్ వస్తువులను సిఎస్‌డి క్యాంటీన్స్ నుండి కొనుగోలు చేసేందుకు ఈ ఆన్‌లైన్ పోర్టల్ ఉపయోగపడుతుంది. సుమారు 45 లక్షలమంది సీఎస్‌డి లబ్దిదారులైన సాయుధ దళాలు మరియు రిటైర్డ్ వ్యక్తులకు సేవలందించేందుకు ఈ ఆన్‌లైన్ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఈ పోర్టల్ ద్వారా ఏఎఫ్‌డి-ఐ వస్తువులు (కార్లు, మోటార్ సైకిళ్ళు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు మొదలైనవి) వారి ఇంటినుండే కొనుగోలు చేసుకునే సౌలభ్యం ఏర్పడుతుంది.
ఈ పోర్టల్ ప్రారంభాన్ని రక్షణమంత్రి ప్రశంసించారు. జవాన్లు మరియు సాయుధ దళాల అధికారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం యొక్క నిబద్ధతను ఇది తెలియజేస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తిచేసిన బృందాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియాకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఈ కార్యక్రమం న్యూ ఢిల్లీలో జరిగింది. పోర్టల్ ట్రయల్ రన్ సందర్భంగా https://afd.csdindia.gov.in/ వెబ్‌పోర్టల్‌లో కార్లు / మోటార్‌సైకిళ్ల బుక్‌చేసుకున్నవారికి వాటిని అందించే కార్యక్రమం ముంబై, న్యూఢిల్లీ, అహ్మదాబాద్ మరియు జైపూర్ నుండి ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇప్పుడు ఈ పోర్టల్ అధికారికంగా ప్రారంభించబడింది. తద్వారా లబ్దిదారులకు ఇకపై వేగంగా మరియు సులభతరమైన సేవలు అందుతాయి.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ భదౌరియా, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
********
(Release ID: 1687123)
Visitor Counter : 249