మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఐఐటీల్లో ప్రవేశాలకు 12వ తరగతిలో కనీసం 75 శాతం మార్కుల అర్హత ఉండాలన్న నిబంధన ఈ ఏడాదికి సడలింపు: కేంద్ర విద్యాశాఖ మంత్రి

ఈ ఏడాది జులై 3న జేఈఈ (అడ్వాన్స్‌డ్‌)-2021 నిర్వహణ

Posted On: 07 JAN 2021 6:59PM by PIB Hyderabad

ఐఐటీల్లో ప్రవేశాలకు 12వ తరగతిలో కనీసం 75 శాతం మార్కులు తెచ్చుకుని ఉండాలన్న అర్హత ప్రమాణాన్ని ఈ ఏడాదికి సడలించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. "జేఈఈ (అడ్వాన్స్‌డ్‌)-2021"ని కంప్యూటర్‌ ఆధారిత పరీక్షగా ఈ ఏడాది జులై 3న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది జేఈఈ (అడ్వాన్స్‌డ్‌)ను ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిర్వహిస్తుంది.

***
 


(Release ID: 1687016) Visitor Counter : 174