హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన లడాఖ్‌కు చెందిన 10మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం
భాష, సంస్కృతి, లడాఖ్ భూభాగం, దాని అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం గురించి ఆందోళనను వ్యక్తం చేసిన ప్రతినిధులు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో లడాఖ్ అభివృద్ధి, లడాఖ్ ప్రాంత సంస్కృతి, భూభాగ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెప్పిన అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ సమస్యలకు తగిన పరిష్కారాన్ని కనుగొనేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం
కమిటీలో నేడు హోం మంత్రిని కలిసిన ప్రతినిధి బృంద సభ్యులతో పాటుగా లడాఖ్ నుంచి ఎన్నికైన ప్రతినిధులు, ఎల్ ఎహెచ్‌డిసి కౌన్సిల్ సభ్యులు, భారత ప్రభుత్వం, లడాఖ్ పరిపాలనాశాఖకు ప్రాతినిధ్యం వహించే ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు
Posted On:
06 JAN 2021 7:21PM by PIB Hyderabad
లడాఖ్‌కు చెందిన పదిమంది సభ్యులతో కూడిన ప్రతినిధి లబృందం బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసింది. లడాఖ్ వ్యూహాత్మక ప్రాముఖ్యత, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో తమ భాష, సంస్కృతి, లడాఖ్ భూభాగం, ఆ ప్రాంత అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యం, ఉపాధి పరిరక్షణ, లడాఖ్ ప్రాంత జన సంఖ్యలో మార్పు గురించి అందరు ప్రతినిధులూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఎల్ ఎహెచ్ డిసి ఎన్నికల ముందు దీనికి సంబంధించి నిరసన ప్రదర్శనను కూడా నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం లడాఖ్ అభివృద్ధికి, లడాఖ్ సంస్కృతి, భూపరిరక్షణ కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. లడాఖ్‌కు కేంద్ర పాలిత ప్రాంత హోదాను ఇవ్వడం ద్వారా మోడీ ప్రభుత్వం దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న లడాఖ్ ప్రాంత ప్రజల డిమాండ్లను నెరవేర్చేందుకు తమ నిబద్ధతను చాటుకుంది.
లడాఖ్ భాష, సంస్కృతి, లడాఖ్ భూభాగ పరిరక్షణకు సంబంధించిన సమస్యలకు తగిన పరిష్కారాన్ని కనుగొనేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని నియమించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో బుధవారం సమావేశం జరిగింది. కమిటీలో బుధవారం హోంమంత్రిని కలిసిన బృంద సభ్యులు కూడా ఉంటారు. వీరు లడాఖ్ నుంచి ఎన్నికైన ప్రతినిధులు, ఎల్ ఎహెచ్‌డిసి కౌన్సిల్ సభ్యులు, భారత ప్రభుత్వం, లడాఖ్ పరిపాలన శాఖ ప్రాతినిధ్యం వహించే ఎక్స్-అఫిషియో సభ్యులు ఉన్నారు.
బృందం వ్యక్తం చేసిన ఆందోళనలను కమిటీ సభ్యులు పరిగణనలోకి తీసుకుని, వాటి వేగవంతమైన పరిష్కారాన్ని కనుగొనే యత్నం చేస్తారు. అలాగే, తుది నిర్ణయం తీసుకునే సమయంలో ఈ కమిటీ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
***
(Release ID: 1686674)
Visitor Counter : 229