సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఐటీబీపీతో ఖాదీ మరియు గ్రామీణ‌ పరిశ్రమల కమిషన్ అవగాహన ఒప్పందం

- కేవీఐసీ ఖాదీ డ్యూరీలను ఉపయోగించ‌నున్న‌ పారామిలిటరీ ద‌ళాలు

Posted On: 06 JAN 2021 3:35PM by PIB Hyderabad

కేంద్ర హోం శాఖ శ్రీ అమిత్ షా సూచ‌న మేర‌కు పారామిలిటరీ బ‌ల‌గాల‌లో అతిపెద్ద స్వదేశీ డ్రైవ్ స‌రికొత్త పుంత‌లు తెక్కేలా ఈ రోజు ఒక ముంద‌గుడు ప‌డింది. కేంద్ర బలగాలకు ఖాదీ కాటన్ డ్యూరీలను సరఫరా చేసేందుకు గాను హోం మంత్రి సూచ‌న మేర‌కు ఈ ఒప్పందం కుదిరింది. ఖాదీ మరియు గ్రామీణ‌ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) ప్రతి ఏడాది 1.72 లక్షల మేర కాటన్ డ్యూరీలను సరఫరా చేయడానికి గాను ఐటీబీపీతో ఒక అగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కేవీఐసీ ఛైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, అదనపు కార్యదర్శి (హోం) శ్రీ వివేక్ భరద్వాజ్, సీఏపీఎఫ్ఎస్ ఇతర అధికారుల సమక్షంలో కేవీఐసీ డిప్యూటీ సీఈఓ, ఐటీబీ‌పీ డీఐజీలు ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఒక సంవ‌త్స‌ర‌పు కాలావ‌ధితో ఈ ఒప్పందంపై సంతాకాలు జ‌రిగాయి. ఒప్పందం చేసుకున్న 1.72 లక్షల డ్యూరీల మొత్తం విలువ రూ .8.74 కోట్లు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిన “ఆత్మనిర్భర్ భారత్ అభియాన్” కు మద్దతుగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని కేంద్ర హోం మంత్రి పారామిలిటరీ దళాలకు చేసిన‌ సూచనల నేపథ్యంలో ఈ ఒప్పందం జరిగింది. కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ చర్యను స్వాగతించారు. ఈ స్పెసిఫికేషన్ల ప్రకారం, కేవీఐసీ 1.98మీ పొడవు మరియు 1.07మీ వెడల్పు గల నీలం-రంగు డ్యూరీలను అందించ‌నుంది. కాటన్ డ్యూరీలను ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు పంజాబ్‌లోని ఖాదీ చేతి వృత్తులవారు ఉత్పత్తి చేయనున్నారు. ఇదే క్ర‌మంలో రానున్న రోజుల్లో.. ఖాదీ త‌యారీ‌ దుప్పట్లు, బెడ్ షీట్లు, దిండు కవర్లు, తేనే, ఊర‌గాయ‌లు, అప్ప‌డాలు మరియు సౌందర్య సాధనాల్ని కూడా కేవీఐసీ నుంచి స‌మీక‌రించ‌నున్నారు. కేవీఐసీ ఛైర్మన్ ఈ చ‌ర్య‌ను ‘చారిత్రాత్మక’మైంది అని పేర్కొన్నారు. ఇది మన దళాలు స్వదేశీ ఉత్పత్తుల వాడేలా ప్రోత్సహించడమే కాకుండా, ఖాదీ చేతి వృత్తుల వారికి పెద్ద ఎత్తున అదనపు ఉపాధిని కల్పిస్తుంది అని పేర్కొన్నారు. "మా జవాన్లకు మేటి నాణ్యమైన ఉత్పత్తులను అందించడం మరియు సరుకు సకాలంలో పంపిణీ చేయడం కేవీఐసీ ప్రధాన ప్రాధాన్య‌త" అని అన్నారు. సీఏపీఎఫ్‌ల నుండి కొనుగోలు ఆర్డర్లు.. దేశ జవాన్లకు వారి స్వంత మార్గాల్లో సేవ చేయ‌డం ఖాదీ చేతివృత్తులవారికి గర్వించదగిన విషయం” అని సక్సేనా అన్నారు. ఐటీబీపీ అందించిన నమూనాల ప్రకారం కేవీఐసీ కాటన్ డ్యూరీలను అభివృద్ధి చేసింది. దీనిని ఏజెన్సీ ఆమోదించింది. కేవీఐసీ సంస్థ తయారు చేసిన కాట‌న్‌ డ్యూరీలను శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన విభాగం గుర్తించిన వస్త్ర మంత్రిత్వ శాఖకు చెందిన ‌యూనిట్ అయిన నార్తర్న్ ఇండియా టెక్స్‌టైల్ రీసెర్చ్ అసోసియేషన్ (నిట్రా) ధ్రువీకరించింది. అంతకు ముందు, గత ఏడాది జూలై 31న, కచ్చి ఘని ఆవ నూనెను సరఫరాకు గాను
కేవీఐసీ సంస్థ ఐటీబీపీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్ర‌కారం సంస్థ దీనిని విజయవంతంగా సరఫరా చేసింది. అన్ని పారా మిలటరీ దళాల తరపున నిబంధనల సేకరణకు గాను హోం మంత్రిత్వ శౄఖ ఐటీబీపీనీ త‌మ నోడ‌ల్ ఎజేన్సిగా నియ‌మించింది. 

***


(Release ID: 1686670) Visitor Counter : 208