ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జమ్మూ కాశ్మీర్, ఈశాన్య భారతంలో ప్రతిపాదిత, కొనసాగుతున్న రహదారులు వంతెన ప్రాజెక్టుల పురోగతి గురించి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌కు వివరించిన బీఆర్ఓ డీజీ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి
Posted On:
05 JAN 2021 5:55PM by PIB Hyderabad
సరిహద్దుల్లో రహదారుల నిర్మాణ సంస్థ (బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్- బీఆర్ఓ) కొత్త డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి.. ఈ రోజు ఈశాన్య ప్రాంతపు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధాని మంత్రి
కార్యాలయం, సిబ్బంది, ప్రజా మనోవేదనలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షపు శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో సమావేశమయ్యారు. జమ్మూ కాశ్మీర్ మరియు ఈశాన్యపు రాష్ట్రాల్లో కొనసాగుతున్న, మరియు ప్రతిపాదిత రహదారులు, వంతెన ప్రాజెక్టులను గురించి వివరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ గడిచిన అయిదు నుండి ఆరు సంవత్సరాల కాలంలో జమ్మూ మరియు కాశ్మీర్ రహదారి, వివిధ వంతెన నిర్మాణాలలో అపూర్వమైన పురోగతిని సాధించిందని అన్నారు. ఉదంపూర్-కథువా-దోడ లోక్‌సభ నియోజకవర్గంలోనే డజనుకు పైగా బీఆర్ఓ వంతెనలు అందుబాటులోకి వచ్చాయని జనరల్ చౌదరి తెలిపారు. వాటిలో ముఖ్యమైనవి బసోహ్లి వద్ద అటల్ సేథు మరియు ఉధంపూర్ వద్ద దేవికా వంతెన తదిరమైనవి ఉన్నాయని వివరించారు. జమ్మూ & కాశ్మీర్‌లో ప్రతిపాదిత ఛథేర్‌గాలా వద్ద సొరంగం.. కతువా జిల్లాను డోడెన్‌రౌట్ జిల్లాతో అనుసంధానం చేస్తుంది. భదెర్వా మరియు దోడాను తాకడానికి ఛథేర్‌గాలా మీదుగా బసోహ్లి-భాని మీదుగా కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించిన సంగతి తెలిపారు. ఇది రెండు సుదూర ప్రాంతాల మధ్య అన్ని రకాలైన వాతావరణ ప్రత్యామ్నాయ రహదారి కనెక్టివిటీని అందించేలా ఈ ప్రాజెక్టు చారిత్రాత్మకమైన మైలురాయి అవుతంది. ఈ ప్రాజెక్టుతో పంజాబ్ సరిహద్దులోని దోడా నుండి లఖన్‌పూర్ వరకు ప్రయాణ సమయం నాలుగు గంటల మేర తగ్గనుంది. ఇది 6.8 కిలోమీటర్ల పొడవైన సొరంగం కానుంది. దీని కోసం సాధ్యాసాధ్య సర్వేను ఇప్పటికే బీఆర్ఓ నిర్వహించింది. ఈ అమలు పనులు ప్రారంభమైన తరువాత సొరంగం పూర్తి కావడానికి సుమారు 4 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. దీని నిర్మాణ వ్యయం సుమారు రూ.3,000 కోట్లు. ఇది ఒక విప్లవాత్మక ఆట మారకం కానుంది. ఇది ఆదాయాన్ని మాత్రమే కాకుండా, ఉద్యోగ కల్పనను కూడా చేకూర్చుతుంది. అంతేకాకుండా, అన్ని రకాల వాతావారణ పరిస్థితులను తట్టుకొని నిలువుగత రోడ్ కనెక్టివిటీ వ్యాపార సౌలభ్యాన్ని తెస్తుంది. ప్రయాణపు సమయాన్ని తగ్గిస్తుంది. బని మరియు భదర్వా వంటి ప్రదేశాలు మన జాతీయ ఖ్యాతిగల పర్యాటక కేంద్రాలుగా అవతరించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కూడా అందిస్తుంది. మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఛథేర్‌గాలా వద్ద సొరంగం కోసం డిమాండ్ చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందని అయితే గత ప్రభుత్వాలు వేర్వేరు ప్రాధాన్యతలను కలిగి ఉన్న కారణంగా ఈ నిర్మాణపు ప్రాజెక్టును చేపట్టలేదని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో బీఆర్ఓ జమ్మూ కాశ్మీర్‌లోని వివిధ కొండ ప్రాంతాలు మరియు కష్టతర భూభాగాల్లో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులలో భాగంగా చేపడుతున్న రోడ్లు మరియు వంతెనల నిర్మాణం సంబంధిత పనులను గురించి కూడా చర్చకు వచ్చాయి. దీనికి తోడు ఈ సమీక్ష సమావేశంలో ఈశాన్య రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలలో బీఆర్ఓ సంస్థ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులలోని పురుగతి గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈశాన్యపు రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (ఎన్ఈసీ) నిధులు సమకూర్చి మిజోరాంలో చేపట్టిన నాలుగు రహదారి ప్రాజెక్టుల గురించి,
మణిపూర్‌లోని రెండు ప్రాజెక్టుల గురించి సమాచారాన్ని కేంద్ర మంత్రి సింగ్ అడిగి తెలుసుకున్నారు.
<><><>
(Release ID: 1686396)
Visitor Counter : 122