రక్షణ మంత్రిత్వ శాఖ
గణతంత్ర దినోత్సవం క్యాంప్ -2021ను ప్రారంభించిన ఎన్‌సీసీ డీజీ లెఫ్టినెంట్ జనరల్ తరుణ్ కుమార్ ఐచ్
Posted On:
04 JAN 2021 6:29PM by PIB Hyderabad
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) డైరెక్టర్ జనరల్ (డీజీ) లెఫ్టినెంట్ జనరల్ తరుణ్ కుమార్ ఐచ్ ఈ రోజు ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఎన్‌సీసీ రిపబ్లిక్ డే క్యాంప్ (ఆర్‌డీసీ)- 2021ను అధికారికంగా ప్రారంభించారు. ‘సర్వ్ ధరం పూజ’తో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలైంది. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి క్యాడెట్లు ఇందులో పాల్గొంటున్నారు. దాదాపుగా 17 రాష్ట్ర డైరెక్టరేట్ల నుంచి 500 మంది సహాయక సిబ్బంది, 380 మంది బాలిక క్యాడెట్లతో సహా సుమారు 1,000 మంది క్యాడెట్లు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈ క్యాంప్
2021 జనవరి 28న ప్రధాన మంత్రి పాల్గొఏ ర్యాలీతో పరిసమాప్తం అవుతుంది. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ ఐచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ క్యాడెట్లు మంచి గుణం, పరిపక్వత, నిస్వార్థ సేవ వంటి అత్యున్నతమైన లక్షణాలను.. అలాగే క్రమశిక్షణ, ప్రవర్తన యొక్క అత్యున్నత ప్రమాణాలను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ క్యాంప్ సందర్భంగా కులం, మతం, ప్రాంతం, భాష అడ్డంకులను దాటి సహచరులతో జట్టు కడుతూ ముందుకు సాగేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ దిశగానే తమ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. క్యాడెట్ల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, వారి విలువ వ్యవస్థలను మరింత పటిష్టం చేయడం, దేశం యొక్క గొప్ప సంస్కృతి మరియు సంప్రదాయాలకు బహిర్గతం చేయడం ఈ శిబిరం యొక్క లక్ష్యం అని అన్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఐచ్ కూడా క్యాడెట్లకు మార్గ నిర్ధేశనం చేస్తూ హృదయపూర్వకంగా పాల్గొనమని మరియు నెల రోజుల శిబిరంలో ప్రతి కార్యకలాపాల నుండి గరిష్ట ప్రయోజనాలను పొందాలని సూచించారు. అదే సమయంలో సరైన కోవిడ్-19 ప్రోటోకాల్‌ను అనుసరించాలనీ కోరారు.
***
(Release ID: 1686136)
Visitor Counter : 112