రాష్ట్రప‌తి స‌చివాల‌యం

సాంకేతిక పురోగతిని తరచుగా ‘అంతరాయాలు’ గా పేర్కొంటారు; అయితే, ఈ ఏడాది, అదే పెద్ద అంతరాయాన్ని అధిగమించడానికి మనకు విశేషంగా సహాయపడింది : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

దృశ్య మాధ్యమం ద్వారా 2020 - డిజిటల్ ఇండియా అవార్డులను ప్రదానం చేసిన - భారత రాష్ట్రపతి

Posted On: 30 DEC 2020 1:11PM by PIB Hyderabad

కరోనా వైరస్ సామాజిక సంబంధాలు, ఆర్థిక కార్యకలాపాలు, ఆరోగ్య సంరక్షణ, విద్యతో పాటు, జీవితంలోని అనేక ఇతర అంశాల పరంగా ప్రపంచాన్ని మార్చివేసింది.  అయినప్పటికీ, జీవితాలు ఇంకా స్థంభించలేదు - సమాచారం,  కమ్యూనికేషన్ టెక్నాలజీ కి అనేక ధన్యవాదాలు.  సాంకేతిక పురోగతిని తరచుగా ‘అంతరాయాలు’ గా పేర్కొంటారు;  అయితే, ఈ ఏడాది, అదే పెద్ద అంతరాయాన్ని అధిగమించడానికి మనకు విశేషంగా సహాయపడిందని, భారత రాష్ట్రపతి, శ్రీ రాంనాథ్ కోవింద్, పేర్కొన్నారు.  ఈ రోజు (2020 డిసెంబర్, 30వ తేదీన) 2020 - డిజిటల్ ఇండియా అవార్డులను దృశ్య మాధ్యమం ద్వారా ప్రదానం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

చైతన్యం-పరిమితుల యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి భారతదేశం సిద్ధంగా ఉండటంతో పాటు, వివిధ రంగాలలో ముందుకు సాగడానికి సంక్షోభాన్ని అవకాశంగా ఉపయోగించుకుందని రాష్ట్రపతి పేర్కొన్నారు.  ఇటీవలి సంవత్సరాలలో డిజిటల్ మౌలిక సదుపాయాలు బలోపేతం కావడంతో ఇది సాధ్యమైంది.  చాలా సంస్థలు ఆన్ ‌లైన్‌ లో పాఠాలు బోధించడంతో, విరామం లేకుండా, విద్య కొనసాగిందని, ఆయన చెప్పారు.  న్యాయవ్యవస్థ నుండి టెలిమెడిసిన్ వరకు, అనేక రంగాలు దృశ్య మాధ్యమానికి మారాయి.  పౌరులకు అనేక రకాల సేవలను అందించడానికీ, ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పడానికి, ప్రభుత్వానికి కూడా, సమాచార సాంకేతికత,  అత్యంత కీలకమైన సాధనాల్లో ఒకటిగా పరిణమించింది. 

క్రియాశీల డిజిటల్ కార్యకలాపాల జోక్యం కారణంగా, లాక్ డౌన్ సమయంలోనూ, ఆ తరువాత ముఖ్యమైన ప్రభుత్వ సేవల కార్యాచరణ కొనసాగింపును నిర్ధారించగలిగామని,  రాష్ట్రపతి పేర్కొన్నారు.   మహమ్మారి కారణంగా ఎదురైన సవాళ్లను అధిగమించడానికి దేశానికి సహాయం చేయడంలో మన డిజిటల్ యోధుల పాత్ర ప్రశంసనీయమని ఆయన అభినందించారు.  ఆరోగ్య సేతు, ఈ-ఆఫీస్, వీడియో కాన్ఫరెన్సు సేవలు వంటి ప్లాట్ ‌ఫారమ్‌లను చురుకుగా అమలు చేయడం, బలమైన ఐ.సి.టి. మౌలిక సదుపాయాల మద్దతుతో దేశానికి మహమ్మారి కష్టాలను తగ్గించడానికి సహాయపడింది.

ప్రతి పౌరుడి భద్రత, ప్రయోజనం కోసం కాగితం తో పని లేకుండా, ఒకరికొకరు ముట్టుకోవలసిన అవసరం లేకుండా ప్రభుత్వ కార్యాలయాల పనితీరు కోసం వినూత్న పరిష్కారాలను అన్వేషించాలని రాష్ట్రపతి కోరారు. పరిపాలనా ప్రక్రియలను మరింత పర్యావరణ అనుకూలంగా మార్చడంలో కూడా ఇది సహాయపడుతుందని ఆయన అన్నారు. మన దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఆర్థిక సమగ్రత మరియు సామాజిక పరివర్తనకు సహాయపడటానికి సాంకేతిక పరిజ్ఞానం మరియు ఐ.సి/టి ఆధారిత వినూత్న పరిష్కారాలను మనం ప్రభావితం చేయాలని ఆయన అన్నారు. మన జనాభాలో ఎక్కువ సంఖ్య లో  ప్రజలు ఇప్పటికీ డిజిటల్ పరికరాలు మరియు సేవల ప్రయోజనాలను పొందలేకపోతున్నారు.  సమర్థవంతమైన ఆవిష్కరణల ద్వారా వారికి డిజిటల్ ప్రాప్యతను విస్తరించడం ద్వారా అలాంటి వారి సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది.  ఇది మన డిజిటల్ విప్లవాన్ని మరింత సమ్మిళితం చేస్తుంది.  అందువల్ల, ప్రభుత్వం యొక్క డిజిటల్ ఇండియా చొరవతో,  డిజిటల్ విభజనను తగ్గించే ప్రయత్నాన్ని కొనసాగించాలి.

ప్రాచుర్యంలో ఉన్న ఒక ప్రసిద్ధ సామెతను రాష్ట్రపతి ఉటంకిస్తూ, "సమాచారం అంటే శక్తి"  అని పేర్కొన్నారు.  ఎక్కువ మంది వ్యక్తులతో, ఎక్కువ సమాచారాన్ని పంచుకోవడం అంటే, సమాజంలో పారదర్శకతను పెంచడంతో పాటు, పౌరులకు, పౌర సమాజానికి శక్తినిస్తుంది. ఈ గొప్ప ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం వివిధ రకాల డేటా సెట్లు మరియు డేటా వనరులను ప్రజలకు అందుబాటులో ఉంచడం ప్రారంభించింది. సమాచార పౌరసత్వానికి ఇది చాలా అవసరం, ఇది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం.  జాతీయ డేటా షేరింగ్ అండ్ యాక్సెసిబిలిటీ విధానం కూడా భాగస్వామ్య తరహా పాలన నమూనాను ఊహించింది.  ఈ విధానంలో పౌరులు ప్రభుత్వ అధికారుల నుండి వ్యూహాత్మకం కాని సమాచారాన్ని పొందగలరు. తద్వారా, వివిధ సంస్కరణ ప్రక్రియలలో, ప్రజలు, ప్రభుత్వంతో భాగస్వాములు అవుతారు.

డిజిటల్-పరిపాలనలో ఆదర్శప్రాయమైన కార్యక్రమాలు / అభ్యాసాలను గుర్తించి, గౌరవించడం కోసం, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఈ డిజిటల్ ఇండియా అవార్డులను ప్రదానం చేస్తోంది.  2020 సంవత్సరానికి గాను, 6వ డిజిటల్ ఇండియా అవార్డులను ఆరు విభాగాలలో ప్రదానం చేశారు.  అవి - మహమ్మారిలో ఆవిష్కరణ; డిజిటల్ పాలనలో నైపుణ్యం - కేంద్ర మంత్రిత్వ శాఖ / విభాగం;  డిజిటల్ పాలనలో నైపుణ్యం - రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల స్థాయి ;  డిజిటల్ పాలనలో నైపుణ్యం - జిల్లా స్థాయి ;  ఓపెన్ డేటా ఛాంపియన్;  ఆదర్శవంతమైన ఉత్పత్తి.

రాష్ట్రపతి ప్రసంగం వీక్షించడానికి దయచేసి ఇక్కడ నొక్కండి

*****



(Release ID: 1684959) Visitor Counter : 216