ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మంచి, ప్రతిరూప పద్ధతులపై 7 వ ఎన్.హెచ్.ఎమ్. జాతీయ సదస్సును వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన - డాక్టర్ హర్ష్ వర్ధన్

ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో ఆవిష్కరణ అనేది ఒక ముఖ్యమైన సహాయకారి. కోవిడ్-19 కోసం చేపట్టిన చర్యలు, వివిధ కార్యక్రమాలతో వ్యవహరించే కొత్త మార్గాలను ప్రారంభించడానికి, ఆవిష్కరణలను రూపొందించడానికీ ప్రోత్సహించాయి : డాక్టర్ హర్ష వర్ధన్

"ఆరోగ్య సంరక్షణ సేవలు అందజేయడంలో, ఆవిష్కరణల కోసం క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలను ప్రోత్సహించి, సమగ్రపరచడం ముఖ్యం"

Posted On: 28 DEC 2020 5:05PM by PIB Hyderabad

మంచి, ప్రతిరూప పద్దతులపై 7వ జాతీయ సదస్సును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఈ రోజు, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు.  ఎ.బి-హెచ్.‌డబ్ల్యు.సి. లలో టి.బి. సేవలకు కార్యాచరణ మార్గదర్శకాలతో పాటు నూతన ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ (హెచ్.‌ఎం.ఐ.ఎస్) ను,  కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న రోగులను గుర్తించడం, సాధారణ నిఘాపై కార్యాచరణ మార్గదర్శకాలు-2020 ని కూడా డాక్టర్ హర్ష వర్ధన్ ప్రారంభించారు.

భారతదేశంలో ప్రజా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో మంచి, ప్రతిరూప పద్ధతులు, ఆవిష్కరణలపై, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఒక జాతీయ సదస్సును నిర్వహించింది.  ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థలో వివిధ ఉత్తమ పద్ధతులు, ఆవిష్కరణలను గుర్తించడం, ప్రదర్శించడం, నమోదు చేయడం కోసం, మొట్ట మొదటి సదస్సు, 2013 లో శ్రీనగర్‌లో నిర్వహించగా, చివరి సదస్సు, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగింది.

ఈ కార్యక్రమం పట్ల డాక్టర్ హర్ష వర్ధన్, తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మహమ్మారి పరిస్థితుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరినీ అభినందించారు.  ఆయన మాట్లాడుతూ, “భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నూతన శిఖరాలకు తీసుకువెళ్ళే వినూత్న కేంద్రీకృత వ్యూహాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.  2020 సంవత్సరంలో, జాతీయ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల పోర్టల్ ‌లో, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 210 కొత్త కార్యక్రమాలను అప్‌లోడ్ చేశాయి.  ఈ ఆవిష్కరణల యొక్క అంతిమ లక్ష్యం ఒకవైపు ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపరచడం, మరోవైపు ప్రజారోగ్య వ్యవస్థలను స్థిరమైన పద్ధతిలో బలోపేతం చేయడం.” అని పేర్కొన్నారు.  ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ ‌లోని ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు, క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలను కలుపుకొని సమగ్రపరచవలసిన అవసరాన్నీ,   ప్రజల ఆరోగ్య పంపిణీ వ్యవస్థలతో పనిచేయడానికి సంవత్సరాల అనుభవం, నైపుణ్యం నుండి వెలువడే సామూహిక జ్ఞానం నుండి ప్రయోజనం పొందాలని, ఆయన నొక్కి చెప్పారు.   ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో, పోలియో నిర్మూలన ప్రచారానికి నాయకత్వం వహించిన తన అనుభవాలను, డాక్టర్ హర్ష వర్ధన్ పంచుకున్నారు. అదేవిధంగా, ఆరోగ్య కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం గురించి కూడా ఆయన గుర్తు చేశారు.

మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆలోచనలు,  ఆవిష్కరణల పాత్ర గురించి, డాక్టర్ వర్ధన్ నొక్కి చెబుతూ,  "ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో ఆవిష్కరణ అనేది  చాలా ముఖ్యమైన సహాకారి.   కోవిడ్-19 కోసం చేపట్టిన చర్యలు, వివిధ కార్యక్రమాలతో వ్యవహరించే కొత్త మార్గాలను ప్రారంభించడానికి, ఆవిష్కరణలను రూపొందించడానికీ ప్రోత్సహించాయి.   పి.పి.ఈ. కిట్లు, వెంటిలేటర్లు, మాస్కులు, వ్యాక్సిన్లు మొదలైన వాటి తయారీ రంగంలో, ఈ మహమ్మారి, మనకు స్వావలంబన కలిగించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఈ-సంజీవని డిజిటల్ ప్లాట్ ‌ఫామ్ ‌లో ఒక మిలియన్లకు పైగా టెలి-కన్సల్టేషన్లు జరిగాయి.  ఇది సమన్వయ ప్రయత్నాల ద్వారా ఉద్భవించిన వినూత్న విధానం యొక్క ఫలితం.” అని పేర్కొన్నారు.

ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో డిజిటల్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత గురించి డాక్టర్ హర్ష వర్ధన్ పునరుద్ఘాటిస్తూ, "సమర్థవంతమైన, ప్రాప్యత, కలుపుకొని, సరసమైన, సమయానుసారంగా మరియు సురక్షితమైన పద్ధతిలో సార్వజనిక ఆరోగ్య సదుపాయాల అందుబాటుకు మద్దతు ఇచ్చే జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, డిజిటల్ పరివర్తన, మనకు, సహాయపడింది. నూతన ఆరోగ్య సంరక్షణ సమాచార వ్యవస్థ (హెచ్.‌ఎం.ఐ.ఎస్) - విస్తృతమైన డేటాతో పాటు, సమాచారం, మౌలిక సదుపాయాల సేవలను అందించడం ద్వారా ఎటువంటి అవరోధాలు లేని ఆన్‌లైన్ ప్లాట్ ‌ఫామ్‌ను అందిస్తుంది.  ఓపెన్, ఇంటర్ ఆపరేబుల్, స్టాండర్డ్స్-బేస్డ్ డిజిటల్ సిస్టమ్స్‌ను సక్రమంగా పెంచుతుంది. మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడంలో, మెరుగైన నిర్ణయ మద్దతు వ్యవస్థతో పాటు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రజారోగ్య సంరక్షణ సంస్కరణల్లో మెరుగుదలని సులభతరం చేయడానికి, సరైన సమాచార మార్పిడి సహాయపడింది.  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల ఈ-సంజీవని డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోసం ఓపెన్ డేటా ఛాంపియన్ కేటగిరీ కింద చాలా ప్రతిష్టాత్మక డిజిటల్ ఇండియా అవార్డు-2020 ను గెలుచుకుంది.” అని వివరించారు. 

టి.బి. సేవలకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసిన అనంతరం, కేంద్ర మంత్రి మాట్లాడుతూ,  "టి.బి. నియంత్రణ కోసం భారత ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాలు టి.బి. నోటిఫికేషన్లలో అపూర్వమైన పెరుగుదలతో పాటు, విశ్లేషణలు, కట్టుబడి, చికిత్స ఫలితాలలో మెరుగుదలకు దారితీశాయి. తప్పిపోయిన కేసుల సంఖ్య 2019 లో 2.9 లక్షలకు తగ్గింది, కాగా, 2017 లో నమోదైన ఈ కేసుల సంఖ్య  10 లక్షలకు పైగా ఉంది.  ఎస్.డి.జి. లక్ష్యమైన 2030 కంటే ఐదేళ్ల ముందుగా, అంటే,  2025 నాటికే, టి.బి. రహిత భారతదేశాన్ని సాధించాలని, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు, ఒక ధైర్యంతో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించారు.  ఈ లక్ష్యాన్ని సాధించడానికి, టి.బి.ని ప్రారంభ దశ లోని నిర్ధారించడం కలిసి పనిచేయాలి.  తగిన రోగి సహాయక వ్యవస్థలను నిర్ధారించడంతో పాటు టి.బి. రోగులందరికీ మొదటి దశలోనే తగిన చికిత్స అందించాలి.  సమాజంలో టి.బి. వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.” అని విజ్ఞప్తి చేశారు.

చివరగా, డాక్టర్ హర్ష వర్ధన్, తమ ప్రసంగాన్ని ముగిస్తూ,  "కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ సంప్రదింపులు నిర్వహించే ఈ మంచి అభ్యాసంతో పాటు,  దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆరోగ్య కార్యక్రమాలను మెరుగుపరచడానికి కొత్త వినూత్న విధానాలను అనుసరించే సంస్కృతిని ప్రోత్సహించడం,  ఈ సందర్భంలో అభ్యాసాలను, పరస్పరం సుసంపన్నమైన అనుభవాలను పంచుకోవడం  కొనసాగిస్తుందని నేను ఆశిస్తున్నాను." అని పేర్కొన్నారు. 

ఈ సదస్సులో - కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, శ్రీ రాజేష్ భూషణ్;  ఏ.ఎస్. & ఎమ్.డి. (ఎన్.హెచ్.ఎం) శ్రీమతి వందన గుర్నానీ;  డిజి (గణాంకాలు), శ్రీమతి రత్న అంజన్ జెనా;  ఎమ్.ఓ.హెచెఫ్.డబ్ల్యూ., ఏ.ఎస్.(పాలసీ), శ్రీ వికాస్ షీల్ తో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.   ఈ కార్యక్రమానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డబ్ల్యూ.ఆర్, డాక్టర్ రోడ్రికో ఆఫ్రిన్ కూడా హాజరయ్యారు. 

 

 

*****



(Release ID: 1684291) Visitor Counter : 184