రైల్వే మంత్రిత్వ శాఖ
డీఎఫ్‌సీలో చివరి మైలు అనుసంధానత ఉండేలా నిర్ధారించుకోవాలిః శ్రీ పియూష్ గోయల్
- రాబోయే డీఎఫ్‌సీ పురోగతిని సమీక్షించిన కేంద్ర రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్
Posted On:
28 DEC 2020 7:52PM by PIB Hyderabad
దేశంలో డీఎఫ్‌సీ సమస్యల పరిష్కార పురోగతిని వేగవంతం చేస్తున్నందున.. డీఎఫ్‌సీలు చివరి మైలు అనుసంధానతను కలిగి ఉండడం నిర్ధారించుకోనేలా సన్నద్ధం కావాలని కేంద్ర రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఇక్కడ సూచించారు. రాబోయే డీఎఎఫ్‌సీల యొక్క పురోగతి సమీక్షిస్తూ కేంద్ర మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ సూచన చేశారు. డీఎఫ్‌సీలకు సంబంధించిన మిగతా భూ సేకరణ కూడా త్వరగా పూర్తయ్యేలా చూసేందుకు అధికారులు వాటాదారులతో నిరంతరం నిమగ్నమై ఉంటూ, సమన్వయం చేయడం కొనసాగించాలని ఆయన అధికారులను కోరారు. రోజువారీ సమర్థవంతమైన పర్యవేక్షణ మరియు ప్రాజెక్ట్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి ప్రాజెక్ట్‌కు రైల్వే శాఖ ఒక సీనియర్ అధికారి నేతృత్వంలో పూర్తిగా అంకితమైన నిర్వహణ బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఈడీఎఫ్‌సీ) లోని 351 కిలోమీటర్ల పొడవైన ‘న్యూ భావ్‌పూర్- న్యూ ఖుర్జా విభాగం’ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ రేపు ప్రారంభించనున్న విషయం ఇక్కడ గమనార్హమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రయాగ్‌రాజ్ వద్ద ఈడీఎఫ్‌సీ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌ను (ఓసీసీ) కూడా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని ఆయన అన్నారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెస్ట్రన్ డీఎఫ్‌సీ (1504 రూట్ కి.మీ.) మరియు తూర్పు డీఎఫ్‌సీ (సోన్నగర్-డంకుని పీపీపీ విభాగంతో సహా 1856రూట్ కి.మీ.) నిర్మిస్తోంది.
***
(Release ID: 1684290)
Visitor Counter : 136