రక్షణ మంత్రిత్వ శాఖ
దక్షిణ కొరియా పర్యటనలో భారత సైన్యాధిపతి
నాడు పోస్టు చేయడమైనది:
28 DEC 2020 7:51AM by PIB Hyderabad
భారత సైన్యాధిపతి, జనరల్ ఎం.ఎం.నరవణె, దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు పర్యటన సాగుతుంది. ఆ దేశ సీనియర్ సైన్యాధికారులు, పాలకులతో ఈ మూడు రోజుల్లో జనరల్ నరవణె సమావేశమవుతారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని "నేషనల్ సిమెట్రీ అండ్ వార్ మెమోరియల్"లో అమర సైనికులకు అంజలి జనరల్ నరవణె ఘటిస్తారు. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి, సైన్యాధిపతి, ఛైర్మన్ ఆఫ్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, రక్షణ సేకరణల కార్యక్రమ పరిపాలన మంత్రితో సమావేశాలు పర్యటన షెడ్యూల్‌లో ఉన్నాయి. రెండు దేశాల రక్షణ బంధాలను పెంచే అవకాశాలపై భారత సైన్యాధిపతి చర్చిస్తారు.
గ్యాంగ్‌వాన్ ప్రావిన్స్‌లోని ఇన్జే కంట్రీలో ఉన్న కొరియా సైనిక శిక్షణ కేంద్రాన్ని, డేజియోన్‌లోని అధునిక రక్షణ అభివృద్ధి కేంద్రాన్ని కూడా జనరల్ నరవణె సందర్శిస్తారు.
***
(రిలీజ్ ఐడి: 1684086)
సందర్శకుల సూచీ సంఖ్య : : 129