Posted On:
26 DEC 2020 5:59PM by PIB Hyderabad
బ్రిటన్ లో కరోనా వైరస్ కొత్త రూపం ధరించి వ్యాపిస్తున్నదన్న వార్తల మధ్య జాతీయ టాస్క్ ఫోర్స్ సమావేశమై వ్యాధి నిర్థారణ పరీక్షలు, చికిత్స, నిఘా విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించింది. భారతీయ వైద్య పరిశోధనామండలి ( ఐసి ఎంఆర్) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ సహాధ్యక్షత వహించారు. ఆరోగ్య మంత్ర్రిత్వశాఖ కార్యదర్శి , ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర బలరామ్ భార్గవ, ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రణదీప్ గులేరియా, ఘ్రగ్ కంట్రోలర్ జనరల్, వ్యాధి నియంత్రణ జాతీయ కేంద్రం ( ఎన్ సి డిసి) డైరెక్టర్, ఆరోగ్యమంత్రిత్వశాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
తాజాగా బ్రిటన్ లో వెలుగు చూస్తున్న సార్స్-కోవిడ్ -2 విషయంలో వ్యాధి నిర్థారణ పరీక్షల నిర్వహణ, చికిత్స, నిఘా వ్యూహాలలో చేయాల్సిన మార్పులను ప్రధానంగా ఈ సమావేశం చర్చించింది. ఈ వైరస్ మానవదేహంలో ప్రవేశించే విషయంలో ఉన్న తేడాలను గమనించి అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సిన తీరును సమీక్షించారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో చికిత్సకు అనుసరిస్తున్న విధివిధానాలను టాస్క్ ఫోర్స్ వివరంగా చర్చించింది. ఈ కొత్త వైరస్ వేగంగా విస్తరించే స్వభావంతో ఉండటం వల్ల వ్యాధి సోకిన వారిని వెంటనే గుర్తించటం, దాన్ని నియంత్రించటానికి, వ్యాప్తిని నిరోధించటానికి చేపట్టాల్సిన చర్యలు చాలా కీలకం కాబోతున్నవి.
ఇప్పుడున్న చికిత్సావిధి విధానాలలో మార్చాల్సిన అవసరమేమీ లేదని టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇప్పటికే ఐసిఎంఆర్ పరీక్షా విధానం మీద ఒక నిర్ణయానికి రావటం వలన ప్రస్తుత వ్యూహాన్నే కొనసాగించవచ్చునని కూడా తేల్చారు. ఇప్పుడున్న నిఘా విధానాలకు తోడుగా మరింత సమర్థంగా పరీక్షలు జరపాలని టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేసింది. మరీ ముఖ్యంగా బ్రితన్ నుంచి వచ్చే ప్రయాణీకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన వైరస్ గురించి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చిందని, ఈ విషయంలో ఇతర దేశాల స్పందన కూడా పరిశీలించిందని టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. పరిస్థితిని సానుకూలంగా అంచనావేస్తూ అనుసరించాలసిన వ్యూహాన్ని ఖరారు చేసినట్టు చెప్పింది.
ఈ వ్యూహంలోని ముఖ్యాంశాలు:
ఎ. అన్ని ప్రవేశ స్థలాల్లో ( భారతదేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలో)
* డిసెంబర్ 21 నుంచి 23 వరకు బ్రిటన్ నుంచి వచ్చిన అందరు ప్రయాణీకులను విమానాశ్రయంలోనే పరీక్షించారు.
* ఆర్ టి-పిసిఆర్ పరీక్షల ఫలితాలు అందిన తరువాతనే నెగటివ్ ప్రయాణీకులను విమానాశ్రయం వదిలి వెళ్ళటానికి అనుమతించారు.
* పాజిటివ్ గా నిర్థారణ అయిన ప్రయాణీకులను సంస్థాగతంగా ఐసొలేషన్ లో ఉంచి వారి శాంపిల్స్ ను హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపారు
* అప్పుడు వచ్చిన ఫలితాల ఆధారంగానే ఇప్పుడున్న నిర్వహణా ప్రమాణాలకు అనుగుణంగా వారిని ఐసొలేషన్ నుంచి బైటికి పంపుతున్నారు.
* పాజిటివ్ గా నిర్థారణ అయినవారికి సంపర్కంలోకి వచ్చిన వారందరినీ ఆచూకీపట్టి తెచ్చి క్వారంటైన్ కేంద్రాలలో ఉంచి ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు జరుపుతున్నారు.
బి. సామూహిక నిఘా
* బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ గత 28 రోజులలో బ్రిటన్ నుమ్చి వచ్చిన ప్రయాణీకుల మొత్తం జాబితాను ఆయా రాష్ట్రాలకు అందజేసింది.
* నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు బ్రిటన్ నుంచి వచ్చిన అందరు ప్రయాణీకుల ఆచూకీ కనిపెట్టటానికి రాష్ట్రాల, జిల్లాల నిఘా బృందాలు పని చేస్తున్నాయి.
* ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం వీరందరికీ పరీక్షలు జరపటం కొనసాగుతోంది. అన్ని పాజిటివ్ కేసులనూ తప్పనిసరి ఐసొలేషన్ లో ఉంచుతున్నారు.
* పాజిటివ్ కేసుల శాంపిల్స్ అన్నిటినీ డబ్ల్యు జి ఎస్ కు పంపుతున్నారు.
* ఈ పాజిటివ్ కేసుల సంపర్కంలొకి వచ్చినవారి ఆచూకీ కనిపెట్టటానికి మరింత గట్టి చర్యలు తీసుకుంటూ వారిని కూడా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
* 14 రోజుల తరువాత రెండూ శాంపిల్స్ తీసి రెండింటిలోనూ నెగటివ్ అవ్చ్చిన తరువాతనే ఆ పాజిటివ్ కేసులను డిశ్చార్జ్ చేస్తున్నారు.
సి. నిఘా తీరుతెన్నులు
* అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 5% పాజిటివ్ కేసులను డబ్ల్యు జి ఎస్ లో పరీక్షలకోసం పంపుతారు.
* న్యూ ఢిల్లీలోని ఎన్ సి డి సి సారధ్యంలో జీనోమ్ పరమైన నిఘా కన్సార్షియం ఏర్పాటు చేశారు. ఇది దేశంలో ఈ కొత్త వైరస్ వ్యాప్తి మీద నిఘా పెడుతుంది. పైగామ్, బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన వారినుంచి సేకరించిన 50 కి పైగా శాంపిల్స్ ను ప్రస్తుతం ప్రత్యేకంగా నిర్దేశించిన ప్రయోగ శాలల్లో జన్యుపరమైన మార్పుల పరంగా పరీక్షిస్తున్నారు. ఇతర ప్రయోగశాలల సమూహంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ( ఢిల్లీ), సి ఎస్ ఐ ఆర్ – ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటెగ్రేటివ్ బయాలజీ ( ఢిల్లీ), సిఎస్ ఐ ఆర్ – సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మోలిక్యులార్ బయాలజీ ( హైదరాబాద్), డిబిటి- ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లఐఫ్ సైన్సెస్ ( భువనేశ్వర్), నేషనల్ సెంటర్ ఫర్ బయోమెడికల్ జీనోమిక్స్ ( కల్యాణి); నేషనల్ సెంటర్ ఫర్ బయొలాజికల్ సైన్సెస్ ( బెంగళూరు), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (బెంగళూరు), ఐసిఎంఆర్- నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (పూణె) ఉన్నాయి.
బ్రిటన్ లో బైటపడ్ద ఈ కొత్త వైరస్ కి సంబంధించి జీనోమిక్ నిఘాను మరింత పెంచాలని నిర్ణయించారు. అయితే, అన్ని రకాల వైరస్ ల తరహాలోనే ఇది మ్యుటేషన్ కు గురవటం కొనసాగుతూనే ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అభిప్రాయపడింది. అయినప్పటికీ, భౌతిక దూరం పాటించటం, మాస్క్ ధరించటం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవటం, అందుబాటులోకి రాగానే సరైన వాక్సిన్ తీసుకోవటం ద్వారా దీనిని అరికట్టవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమైంది.
***