జల శక్తి మంత్రిత్వ శాఖ
తాగునీటి నాణ్యతను పరీక్షించడానికి పోర్టబుల్ పరికరాలను అభివృద్ధి చేయడానికి వినూత్న పోటీని ప్రకటించిన జాతీయ జల్ జీవన్ మిషన్
Posted On:
25 DEC 2020 2:05PM by PIB Hyderabad
తాగునీటి నాణ్యతను పరీక్షించడానికి పోర్టబుల్ పరికరాలను అభివృద్ధి చేయడానికి వినూత్న పోటీని నిర్వహిస్తున్నట్టు జాతీయ జల్ జీవన్ మిషన్ ప్రకటించింది. పరిశ్రమల ప్రోత్సాహ మరియు అంతర్గత వాణిజ్య మంత్రిత్వ శాఖతో కలసి జల్ జీవన్ మిషన్ ఈ పోటీని నిర్వహించనున్నది. తాగునీటి నాణ్యతను ఖచ్చితంగా ఇళ్లతో తో సహా ఎక్కడైనా పరీక్షించడానికి పరికరాలను తక్కువ ఖర్చుతో సులువుగా ఉపయోగించడానికి వీలుగా వినూత్నంగా రూపకల్పన చేయాలన్న లక్ష్యంతో ఈ పోటీని నిర్వహించాలని నిర్ణయించారు.
కేంద్రప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ లో తాగునీటి నాణ్యత ప్రధాన అంశంగా ఉంది. నీటి నాణ్యతను వివిధ ప్రాంతాలు, దశలలో నిర్వహించి నీరు కలుషితం కాకుండా చూడడానికి అవసరమైన చర్యలను రూపొందించడానికి ఈ పోటీని నిర్వహించనున్నారు,
2020 డిసెంబర్ 23వ తేదీన జల్ జీవన్ మిషన్ ప్రారంభం అయ్యింది. ఈ పథకం కింద ఇంతవరకు 2.90 గృహాలకు కొళాయి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. దీనితో గ్రామీణ ప్రాంతాలలో కొళాయి కనెక్షన్లు ఉన్న గృహాల సంఖ్య 3.23 కోట్ల (17%) నుంచి 6.13 కోట్లకు (32%) చేరింది. ఇంతేకాకుండా దేశంలో 20 జిల్లాలు, 425 బ్లాకులు, 34 వేల గ్రామ పంచాయతీలు, గ్రామీణ ప్రాంతాలలో 64 వేల గ్రామాలు కొళాయి కనెక్షన్లను కలిగి వున్నాయి.
కొళాయి ద్వారా సరఫరా అవుతున్ననీటి నాణ్యతను పరీక్షించడానికి అవకాశం లేకపోవడంతో ప్రజలు నీరు తాగడానికి సందేహిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో కూడా ప్రజలు అదనంగా ఖర్చు చేసి నీటి శుద్ధి పరికరాలను ఏర్పాటు చేసుకోవలసి వస్తున్నది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నీటి నాణ్యత పరికరాల ఉత్పత్తి కోసం పోటీని నిర్వహించాలని నిర్ణయించారు. తక్కువ ఖర్చుతో వినూత్నంగా ఎక్కడికి అయినా తీసుకొని వెళ్లే పరికరాల తయారీ ఈ పోటీ ముఖ్య లక్ష్యంగా ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాలలో భూగర్భ (80%) ఉపరితల (20%) జల వనరుల నుంచి తారునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే, భూగర్భ జల వనరులు తగ్గడంతో ఉపరితల జల వనరుల వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాలలో భూగర్భ, ఉపరితల జల వనరుల నాణ్యతను ప్రాంతాలవారీగా పరీక్షించి తాగు నీటిని సరఫరా చేయవలసి వుంది. నీటి సరఫరాపై 2019లో రూపొందించిన మార్గదర్శకాల్లో నీటి నాణ్యత ప్రమాణాలను నిర్ణయించారు. బి ఐ ఎస్ ఐ ఎస్ 2019 BIS IS 10500: 2012 మరియు ఆ తరువాత చేసిన సవరణల ప్రకారం నీటి నాణ్యత వుండవలసి ఉంటుంది.
2024 నాటికి ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇల్లు కొళాయి కనెక్షన్ కలిగి ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్రాల భాగస్వామ్యంతో నిరంతరం దీర్ఘ కాలంపాటు తాగు నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ అమలు జరుగుతున్నది.
లక్ష్య సాధనకు ఉపకరించే వినూత్న పరికరాలను అభివృద్ధి చేసి ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని జల్ జీవన్ మిషన్ కోరింది. పోటీకి సంబంధించి పూర్తి వివరాలు ఆన్ లైన్ లో నమోదుకు http://bit.ly/37JpBHv దర్శించ వచ్చును.
***
(Release ID: 1683617)
Visitor Counter : 247