రైల్వే మంత్రిత్వ శాఖ

ప్రయాణీకులు సులభంగా టిక్కెట్లు ఖరారు చేసుకునేలా ఐఆర్‌సీటీసీ ఈ-టిక్కెటింగ్‌ వెబ్‌సైట్‌ సమగ్రంగా ఉండాలి: శ్రీ పీయూష్‌ గోయల్‌

మెరుగైన లక్షణాలు, సరళీకృత ఆకృతితోపాటు ఇ-టిక్కెటింగ్‌ వెబ్‌సైట్‌లో వినియోగదారుల సౌలభ్యం పెంచడానికి రైల్వేలు కృషి చేస్తున్నాయి

Posted On: 25 DEC 2020 1:40PM by PIB Hyderabad

ఐఆర్‌సీటీసీ ఈ-టిక్కెటింగ్‌ వ్యవస్థ ఆధునీకరణ పనులపై రైల్వే శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ సమీక్షించారు. ఉత్తమ రైలు ప్రయాణం కోసం ప్రయాణీకులకు సమగ్ర సౌలభ్యాన్ని అందించేలా ఈ-టిక్కెటింగ్‌ వెబ్‌సైట్‌ ఉండాలని సూచించారు.

    ప్రజల రైలు ప్రయాణ అవసరాలు తీర్చేలా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ ఖరారు చేసుకునే అవకాశాన్ని రైల్వేలకు చెందిన ఐఆర్‌సీటీసీ అందిస్తోంది.

    టిక్కెట్ల బుకింగ్‌, ప్రయాణ సౌకర్యాల విషయంలో ప్రజా అనుభవాలను మెరుగుపరిచే అంశానికి 2014 నుంచి ప్రాధాన్యత పెరిగింది. రైలు ప్రయాణం చేయాలనుకునేవారు మొదట ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ వైపే చూసేలా చేయాలన్న రైల్వే శాఖ మంత్రి, వారి అనుభవం స్నేహపూర్వకంగా, సౌకర్యవంతంగా ఉండాలని చెప్పారు. 'డిజిటల్‌ ఇండియా'లో భాగంగా, ఎంతోమంది ప్రజలు రైలు టిక్కెట్ల కోసం రిజర్వేషన్‌ కేంద్రాలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటున్నారని, అందువల్ల ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించే ప్రయత్నాలను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

    వెబ్‌సైట్‌ పనితీరు మెరుగుదల కోసం సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని రైల్వే అధికారులు శ్రీ గోయల్‌కు వెల్లడించారు.

 

****


(Release ID: 1683600)