ప్రధాన మంత్రి కార్యాలయం

పిఎమ్- కిసాన్ లో భాగం గా తదుపరి కిస్తీ ని ఈ నెల 25 న విడుదల చేయనున్న ప్రధాన మంత్రి

Posted On: 23 DEC 2020 3:05PM by PIB Hyderabad

‘‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’’ (పిఎమ్- కిసాన్) లో భాగం గా అందించే ఆర్థిక ప్రయోజనం తాలూకు తదుపరి కిస్తీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 వ సంవత్సరం డిసెంబర్ 25 వ తేదీ న మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేయనున్నారు.  ప్రధాన మంత్రి ఒక బటన్ ను నొక్కడం ద్వారా, 18 వేల కోట్ల రూపాయలకు పైగా డబ్బు 9 కోట్ల కు పైగా లబ్ధిదారు రైతు కుటుంబాలకు బదిలీ కావడానికి మార్గాన్ని సుగమం చేయనున్నారు. 

ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి 6 వేరువేరు రాష్ట్రాలకు చెందిన రైతులతో కూడా మాట్లాడనున్నారు.  ఆ రైతులు పిఎమ్- కిసాన్ తో వారికి ఉన్న అనుభవాలను గురించి, అలాగే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర వివిధ కార్యక్రమాలను గురించి వెల్లడించనున్నారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి కూడా పాల్గొంటారు.

పిఎమ్ కిసాన్ ను గురించి

పిఎమ్- కిసాన్ పథకం లో భాగం గా అర్హత కలిగిన లబ్ధిదారు రైతులకు ప్రతి ఒక్క సంవత్సరం 6 వేల రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని అందించడం జరుగుతోంది.  ఈ డబ్బు ను- 4 నెలలకు ఒక సారి చొప్పున మూడు సమాన కిస్తీల లో, ఒక్కొక్క కిస్తీ లో 2 వేల రూపాయల వంతున- చెల్లిస్తున్నారు. ఈ డబ్బు ను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా బదిలీ చేయడం జరుగుతున్నది. 


 

***


(Release ID: 1683009) Visitor Counter : 233