యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఫిట్ నెస్ కు ప్రాధాన్యతనివ్వాలనీ, యుక్తమైన, ఆరోగ్యకరమైన దేశాన్ని ప్రోత్సహించడానికి ఫిట్‌నెస్ వీడియోలను ఒకరికొకరు పంచుకోవాలనీ, భారతీయులను కోరిన - కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు
Posted On:
22 DEC 2020 6:42PM by PIB Hyderabad
భారతదేశాన్ని మంచి ఉత్తేజకర, శక్తివంతమైన దేశంగా మార్చాలన్న, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన శంఖారావాన్ని బలోపేతం చేయడానికి, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల మంత్రి శ్రీ కిరెన్ రిజిజు డిసెంబర్, 22వ తేదీన, తన ఫిట్ నెస్ వీడియోను సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. అలాగే, తమ తమ ఫిట్ నెస్ వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా భారతీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.
" నూతన ఫిట్ నెస్ తో కూడిన భారతదేశాన్ని ( #NewIndiaFitIndia ) రూపొందించడానికి మిలియన్ల మంది భారతీయులు మన ప్రధానమంత్రి మోదీ గారి మార్గాన్ని ( PM @NarendraModi ) అనుసరిస్తున్నారు. మనం ఈ ఫిట్ నెస్ ఉద్యమాన్ని ( #FitIndiaMovement ) బలోపేతం చేయవచ్చు. మీ ఫిట్ నెస్ వీడియోలను నాతో పంచుకోండి. అందరం కలిసి భారతదేశాన్ని ఉత్తేజకరమైన, ఆరోగ్యకరమైన, పఠిష్టమైన దేశంగా తీర్చిదిద్దుదాం. ప్రతీ రోజు అర్ధ గంట ఫిట్ నెస్ కోసం వినియోగిద్దాము "(ఫిట్ నెస్-కా-డోస్ ఆధా ఘంటా రోజ్) pic.twitter.com/p056OEq8NY "
— కిరణ్ రిజిజు (@KirenRijiju) December 22, 2020
ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "నూతన ఫిట్ నెస్ తో కూడిన భారతదేశాన్ని ( #NewIndiaFitIndia ) రూపొందించడానికి మిలియన్ల మంది భారతీయులు మన ప్రధానమంత్రి మోదీ గారి మార్గాన్ని ( PM @NarendraModi ) అనుసరిస్తున్నారు. మనం ఈ ఫిట్ నెస్ ఉద్యమాన్ని ( #FitIndiaMovement ) బలోపేతం చేయవచ్చు. మీ ఫిట్ నెస్ వీడియోలను నాతో పంచుకోండి. అందరం కలిసి భారతదేశాన్ని ఉత్తేజకరమైన, ఆరోగ్యకరమైన, పఠిష్టమైన దేశంగా తీర్చిదిద్దుదాం. ప్రతీ రోజు అర్ధ గంట ఫిట్ నెస్ కోసం వినియోగిద్దాము "(ఫిట్ నెస్-కా-డోస్ ఆధా ఘంటా రోజ్) " అని పేర్కొన్నారు.
"ప్రతీ రోజు అర్ధ గంట ఫిట్ నెస్ కోసం వినియోగిద్దాం" (ఫిట్ నెస్ కా డోస్ ఆధా ఘంటా రోజ్) అనే ప్రచారాన్ని ఈ ఏడాది ప్రారంభంలో ప్రధానమంత్రి ప్రారంభించారు. అప్పటి నుండి ఇది ఒక దేశవ్యాప్త ఉద్యమంగా కొనసాగుతోంది. "ఫిట్ నెస్-కా-డోస్-ఆధా ఘంటా రోజ్" ప్రచారం ద్వారా శారీరక శ్రమను ప్రోత్సహించడంలో భారతదేశం తీసుకున్న ప్రయత్నాన్ని డబ్ల్యూ.హెచ్.ఓ. ప్రశంసించింది." అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) ఇటీవల ఒక ట్వీట్ లో ప్రశంసించింది.
*******
(Release ID: 1682867)
Visitor Counter : 123