నౌకారవాణా మంత్రిత్వ శాఖ

సరుకు రవాణా మరియు ప్రయాణపు సేవల కోసం కొత్త మార్గాలను గుర్తిస్తున్న కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గపు మంత్రిత్వ శాఖ

Posted On: 21 DEC 2020 12:07PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాల్లో ఒకటైన సాగరమాల కార్యక్రమం క్రింద కేంద్ర ప్రభుత్వం ప్రయాణ సౌకర్యం మరియు సరుకు రవాణా మార్గాల అభివృద్ధి చేయడానికి కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మరియు  జలమార్గపు మంత్రిత్వ శాఖ నిరంతరంగా కృషి చేస్తున్నది. దేశానికి  7,500 కి.మీ.  గల తీరప్రాంతంలోని అనువైన పోర్టులను అభివృద్ధిపరచి వాటిని సరుకు మరియు ప్రజా రవాణాకు వినియోగించుకోవడానికి కేంద్రం సంకల్పించింది.  హజారియా, ఓఖా, సోమ్నాథ్ దేవాలయం, డిఐయు, పిఐపిఏవిఏవి, దహేజ్, మంబై లేదా జెఎన్పిటి, జాంనగర్, కొచ్చి, ఘోఘా, గోవా, ముంద్రా  మరియు మన్డ్వి వంటి దేశీయ మరియు 6 అంతర్జాతీయ జలమార్గాల్ని  మంత్రిత్వశాఖ గుర్తించింది. వీటితోపాటు బంగ్లాదేశ్లోని చట్టోగ్రాం, తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్ల్, మడగాస్కర్ మరియు శ్రీలంకలోని జాఫ్నాలను భారత ప్రధాన తీరప్రాంతంలోని పోర్టు పట్టణాలతో కలిపి దేశీయ మరియు అంతర్జాతీయ జలమార్గపు సేవలను ప్రారంభించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగాను సాగరమాల అభివృద్ధి కంపెనీ లిమిటెడ్(ఎస్డిసిఎల్) ఈ కార్యక్రమం క్రింద దేశవ్యాప్తంగా  రో-రో, రో-పాక్స్ మరియు ప్రజా రవాణా సేవలకు ఆయా మార్గాల్లో అవసరమైన సహకారాన్ని అందజేస్తుంది.
 ఈ కార్యక్రమం క్రింద కేంద్ర మంత్రిత్వ శాఖ హజారియా మరియు ఘోఘా మధ్యన రోపాక్స్ మరియు ప్రజారవాణా సేవలను ఇటీవల విజయవంతంగా ప్రారంభించి అమలుపరుస్తున్నది. ఇందువలన ఘోఘా మరియు హజారియాల మధ్యన గల ప్370 కి.మీ దూరాన్ని 90 కి.మీ మరియు 10 నుండి 12 గంటలు గల ప్రయాణపు సమయాన్ని5గంటలకు తగ్గించింది. ఈ జల మార్గం వినియోగం వలన రోజుకు సుమారు 9000 లీ. ఇంధనం ఆదా అవుతుంది. ఈ విజయం కలిగించిన ఉత్సాహంతో కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గపు మంత్రిత్వ శాఖ దేశ తీరప్రాంతం వెంట ఇటువంటి మరిన్ని సేవలను సుస్థిరంగా అందించడానికి ప్రయత్నం చేస్తుంది. దీనివలన
1.  జలమార్గాన్ని అభివృద్ధిచేయడం వలన రోజువారీ ప్రయాణీకులకు, పర్యాటకులకు మరియు సరుకు రవాణాతోపాటు రైలు మరియు రోడ్డు మార్గాలతోనే కాక పర్యావరణహితమైన మరో ప్రయాణమార్గాన్ని అందించినట్లవుతుంది.
2. పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.
3. సముద్ర  తీరప్రాంతాలవారికి ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుంది.
4. ప్రయాణీకుల మరియు సరుకు రవాణాదారులకు కూడా డబ్బు మరియు సమయం ఎంతో ఆదా అవుతుంది.
5. రైలు మరియు రోడ్డు మార్గాలపైన ఒత్తిడి తగ్గుతుంది.

ఈ ప్రయత్నానికి అనుగుణంగా అవసరమైన అన్ని సహాయ సహకారాలను  అభివృద్ధి కంపెనీ లిమిటెడ్ అందిస్తుంది. అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్లను అనుమతించి వారికి ప్రభుత్వం వైపునుండి అవసరమైన అనుమతులు తదితరాలను సమకూర్చుతుంది.

***


(Release ID: 1682375) Visitor Counter : 189