కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

'పండిత్‌ దీన్‌దయాల్ టెలికాం స్కిల్ ఎక్సలెన్స్' అవార్డులను అందజేసిన కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్, స‌హాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే


Posted On: 19 DEC 2020 1:27PM by PIB Hyderabad

కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్, స‌హాయ మంత్రి శ్రీ సంజయ్ శామ్‌రావు ధోత్రే 18.12.2020న ఎలక్ట్రానిక్స్ నికేతన్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో 'పండిత్‌ దీన్‌దయాల్ టెలికాం స్కిల్ ఎక్సలెన్స్' అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవార్డు గ్రహీతలకు వరుసగా రూ.50,000, రూ.30,000 నగదు పురస్కారాలు అంద‌జేశారు.

న్యూఢిల్లీ సీజీఓ కాంప్లెక్స్‌లోని ఎలక్ట్రానిక్స్ నికేతన్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ సభ్యులు, ఏఎస్ (టీ), మ‌రియు డీఓటీకి చెందిన ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో ఈ అవార్డుల‌ను ప్ర‌దానం చేశారు. టెలికాంలో నైపుణ్యం పర్యావరణ వ్యవస్థను ప్రేరేపించడానికి, టెలికాం స్కిల్లింగ్, టెలికాం సర్వీసెస్, టెలికాం తయారీ, టెలికాం అప్లికేష‌న్ల‌ను అమలు చేయడంలో టెలికాం అనువర్తనాల అనుబంధ‌ రంగాలలో ప్రత్యేక కృషి చేసినందుకు గాను మేటి టెలికాం నైపుణ్యం ఉన్నవారికి బహుమతులు ఇవ్వడానికి 2017లో పండిత్‌ దీన్‌దయాల్ ఉపాధ్యాయ టెలికాం స్కిల్ ఎక్సలెన్స్ అవార్డుల పథకాన్ని టెలికాం శాఖ‌ ప్రారంభించింది. వ్యవసాయం, వాణిజ్యం, ఆరోగ్యం, విద్య మొదలైన వివిధ రంగాలకు రంగాల్లో టెలికాం ఆధారిత‌ పరిష్కారాల విష‌య‌మై కృషి చేసిన వారికి ఈ అవార్డుల‌ను అందిజేస్తారు.

పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ శ‌త‌జ‌యంతి జ్ఞాపకార్థం పండిత్‌ దీన్‌దయాల్ ఉపాధ్యాయ పేరు మీద ఈ అవార్డుల‌ను ఏర్పాటు చేశారు. 2018 సంవత్సరంలో మొదటిసారిగా నామినేషన్లు పిలిచారు. అవార్డు గ్రహీతలను 08.09.2020న టెలికాం విభాగం ప్రకటించింది. లోతైన సముద్ర కమ్యూనికేషన్, కేరళ తీరం వెంబడి పనిచేయడం, మత్స్యకారులలో కమ్యూనికేషన్ సులభతరం చేయడం మరియు వాతావరణ హెచ్చరికల జారీ కోసం 'సి మొబైల్' బ్రాండ్ కింద ఖర్చుతో కూడుకున్న అనుకూలీకరించిన సాంకేతిక పరిష్కారాన్ని అభివృద్ధి చేయడంలో చేసిన కృషికి గాను బెంగుళూరుకు చెందిన‌ శ్రీనివాస్ కరణం మొదటి బహుమతికి ఎంపికయ్యారు. ఈ సేవ మత్స్యకారులకు జీఎస్ఎమ్ కవరేజ్ ప్రాంతానికి దూరంగా ఉన్నప్పుడు వన్-వన్ వాయిస్ కాల్స్, గ్రూప్ కాల్స్, ఎస్ఎంఎస్, లొకేషన్ సర్వీసెస్ మరియు అత్యవసర సేవలను కలిగి ఉండటానికి వీలు కల్పిస్తుంది. కేరళ తీరం వెంబడి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో తిరువనంతపురం నుండి కాలికట్ వరకు ఈ సేవ అందుబాటులో ఉంది. దాదాపు 900 మోటారు బోట్లలో పరికరాలను ఏర్పాటు చేశారు. కేరళ తీరం వెంబడి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో తిరువనంతపురం నుండి కాలికట్ వరకు ఈ సేవ అందుబాటులో ఉంది, దాదాపు 900 మోటారు బోట్లలో పరికరాలను ఏర్పాటు చేశారు. రైలు-జంతువుల తాకిడిని నివారించడానికి పెద్ద ఎత్తున సెన్సార్ నెట్‌వర్క్ మరియు పరికరాల అభివృద్ధి, విస్తరణపై వినూత్న పరిష్కారానికి కృషి చేసినందుకు గాను న్యూఢిల్లీకి చెందిన‌ ప్రొఫెసర్ సుబ్రాత్ కార్ చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు ల‌భించింది. ఇది సహజ కదలికలు / జంతువుల ప్రవర్తనతో జోక్యం చేసుకోకుండా పనిచేస్తుంది, తద్వారా వన్యప్రాణుల సంరక్షణలో ఇది సహాయపడుతుంది. రైలు-ఏనుగులు ఢీకొని ఏనుగు మరణాలను నివారించడానికి వీలుగా దీనిని పైలట్ దశలో గ‌ల వ్యవస్థను ఉత్తరాఖండ్లోని రాజాజీ నేషనల్ పార్క్ లో ఏర్పాటు చేశారు. మత్స్యకారుల ప్రయోజనం కోసం మరియు వన్యప్రాణుల సంరక్షణలో తమ వినూత్న ఆలోచనలతో టెలికాం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడంలో అవార్డు గ్రహీతలు ఇద్దరూ చేసిన కృషిని మంత్రులు ఇద్దరూ ఇక్క‌డ ప్రశంసించారు.

కేరళ తీరం వెంబడి కొత్త టెక్నాల‌జీ విజయవంతంగా పనిచేస్తున్నందున ఇక్క‌డ ఎక్కువ మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కర్ణాటక, తమిళనాడు, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల తీరప్రాంతాల్లో ఈ వ్యవస్థను అమలు చేయవచ్చని కేంద్ర మంత్రి శ్రీ క‌ర‌ణంతో జ‌రిపిన సంభాష‌ణ‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రొఫెసర్ కార్తో సంభాషించేటప్పుడు, ఇతర కారిడార్లలో అడవి ఏనుగులు, ఇతర జంతువులు తరచూ రైల్వే ట్రాక్‌లను దాటుతాయ‌ని ఈ ప్ర‌య‌త్నంలో భాగంగా మరియు వేగవంతమైన రైళ్లతో ఢీకొనడం వల్ల అవి ప్రాణాలు కోల్పోతాయ‌న్నారు. ఈ సంద‌ర్భంగా

కేంద్ర టెలికాం శాఖ స‌హాయ మంత్రి ఫ్రొఫెస‌ర్ కార్‌తో మాట్లాడుతూ అనేక రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఏనుగుల మందల పంట దాడులను గుర్తించడానికి రైతుల ప్రయోజనాల కోసం త‌న‌ ఆలోచనను విస్తరించాలని పిలుపునిచ్చారు. కేంద్ర టెలికాం శాఖ‌ ఇటీవల 2019 సంవత్సరానికి అవార్డులకు నామినేషన్లను ఆహ్వానించింది, చివరి తేదీ 23.2.2021. వివరాలు DoT వెబ్‌సైట్ www.dot.gov.in లో లభిస్తాయి.

*****


(Release ID: 1681991) Visitor Counter : 239