యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

స్వ‌చ్ఛ‌మైన క్రీడ‌ల‌ పట్ల తన నిబద్ధతను మ‌రింత బ‌ల‌ప‌రిచిన భార‌తదేశం

- 'వాడా' శాస్త్రీయ పరిశోధనల‌కు మిలియన్ డాలర్ల మేర‌ స‌హాయం

Posted On: 17 DEC 2020 2:37PM by PIB Hyderabad

 

ప్రపంచ వ్యాప్తంగా స్వ‌చ్ఛ‌మైన క్రీడా (క్లీన్ స్పోర్ట్) వాతావరణాన్ని నిర్ధారించడానికి భార‌తదేశం మ‌రో ముంద‌డుగు వేసింది. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) శాస్త్రీయ పరిశోధన బడ్జెట్ కోసం మిలియన్ డాలర్ల మొత్తాన్ని అందించేందుకు భారత్ ముందుకు వ‌చ్చింది. ఇది వాడా యాంటీ డోపింగ్ పరీక్ష మరియు గుర్తింపు పద్ధతుల‌లో వినూత్న విధానాల అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. వాడా యొక్క స్వతంత్ర దర్యాప్తు, ఇంటెలిజెన్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి కూడా ఈ సొమ్ము ఉపయోగించబడుతుంది. చైనా, సౌదీ అరేబియా, ఈజిప్టుతో సహా ఇతర ప్రపంచ ప్రభుత్వాలు చేసిన విరాళాలతో పోలిస్తే భారతదేశం యొక్క  మిలియన్ డాలర్ల సహకారం అత్యధికం. అన్ని సభ్య దేశాల మొత్తం సహకారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 10 మిలియన్ డాలర్ల కార్పస్‌ను రూపొందించడానికి సమాన మొత్తంతో సరిపోతుంది.ఈ కార్పస్‌ను ఏర్పాటు చేయాల‌నే నిర్ణయం 2019లో పోలాండ్‌లోని కటోవిస్‌లో జరిగిన వాడా ఐదవ ప్రపంచ సమావేశంలో జ‌రిగిన‌ డోపింగ్ ఇన్ స్పోర్ట్‌లో మీట్‌లో తీసుకోవ‌డం జ‌రిగింది. ఈ సహకారం భారతదేశం వాడా యొక్క ప్రధాన బడ్జెట్‌కు చేసిన వార్షిక సహకారం కంటే ఎక్కువ. ఈ సహకారం గురించి వాడా అధ్యక్షుడు విటోల్డ్ బంకాకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి శ్రీ కిరెణ్‌ రిజిజుకు లేఖ రాస్తూ "శాస్త్రీయ ప‌రిశోధ‌న & అభివృద్ధి మరియు (ఐ & ఐ) కోసం వాడాకు భారత ప్రభుత్వం మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయానికి ప్ర‌తిన చేస్తున్నట్లుగా తెలియ‌జేయ‌డానికి సంతోషంగా ఉంది అని అన్నారు. భారత్ నుండి అందిస్తున్న ఈ సహకారం 10 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి తోడ్ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాను” అని అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 8న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాడా అధ్యక్షుడితో జ‌రిపిన‌ సమావేశంలో స్వ‌చ్ఛ‌మైన క్రీడ‌ల ఆవశ్యకత మరియు ప్రపంచవ్యాప్తంగా డోపింగ్ నిరోధక కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి గాను భారత ప్రభుత్వ నిబద్ధత గురించి శ్రీ రిజిజు నొక్కి చెప్పారు. శాస్త్రీయ నైపుణ్యం మరియు వనరుల రూపంలో వాడాకు భారతదేశం మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సభ్య దేశాల సహకారాన్ని ప్రశంసించిన వాడా అధ్యక్షుడు విటోల్డ్ బంకా ఒక పత్రికా ప్రకటనలో.. “ఇది వాడాకు మరియు స్వ‌చ్ఛ‌మై క్రీడ‌ల‌కు భారీ ప్రోత్సాహం. ఈ విధంగా క్రీడల రక్షణకు సహకరించినందుకు చైనా, ఈజిప్ట్, భార‌త్‌, సౌదీ అరేబియా ప్రభుత్వానికి ఏజెన్సీ కృతజ్ఞతలు తెలుపుతోంది. ఈ త‌ర‌హా ఉదార‌త క్రీడ‌ల్లో స్వ‌చ్ఛ‌త విష‌య‌మై ఆయా దేశాల నిబద్ధతగాను చూడవచ్చు, శాస్త్రీయ పరిశోధనలను పెంచే విధంగా మంచికి ఉపయోగపడతాయి. అలాగే వాడా యొక్క స్వతంత్ర (ఐ & ఐ) విభాగం యొక్క ప‌నికి ఇది దోహ‌దం చేస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో ఈ రెండు ప్రాంతాలు గణనీయమైన విజయాల‌ను సాధించాయి. అదనపు వనరులు డోపింగ్-రహిత క్రీడల‌ కోసం వాడా యొక్క మిషన్‌కు ఎంతో దోహదం చేస్తాయి.” అని అన్నారు.
                         

*****


(Release ID: 1681591)