ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

ఆర్థిక వ్య‌వ‌హారాల‌పై ఏర్పాటైన మంత్రివ‌ర్గ సంఘం (సిసిఇఎ)

ఆరు రాష్ట్రాల‌లో అంత‌ర్ రాష్ట్ర ప్ర‌సారం, పంపిణీ వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌టిష్టం చేసేందుకు ఈశాన్య ప్రాంత విద్యుత్తు వ్య‌వ‌స్థ మెరుగుద‌ల ప‌థకం తాలూకు స‌వ‌రించిన వ్యయ అంచ‌నా కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 16 DEC 2020 3:35PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంత విద్యుత్తు వ్యవ‌స్థ మెరుగుద‌ల ప‌థ‌కం (ఎన్ఇఆర్‌పిఎస్ఐపి) తాలూకు స‌వ‌రించిన వ్యయ అంచ‌నా కు (ఆర్‌సిఇ) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర ‌మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన ఆర్థిక వ్య‌వ‌హారాల మంత్రివ‌ర్గ సంఘం ఆమోదాన్ని తెలిపింది.  దీని సవరించిన వ్యయం అంచ‌నా 6,700 కోట్ల రూపాయ‌లు గా ఉంది.  ఇది అంత‌ర్ రాష్ట్ర ప్ర‌సారం, పంపిణీ వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేయ‌డం ద్వారా ఈశాన్య ప్రాంత ఆర్థిక అభివృద్ధి కి పూచీ పడే దిశ‌ లో ఒక ప్ర‌ధాన‌మైన చ‌ర్య కాగ‌ల‌దు.
ఈ ప‌థ‌కాన్ని ఆరు ల‌బ్ధిదారు రాష్ట్రాలు.. అస‌మ్, మణిపుర్, మేఘాలయ, మిజోర‌మ్‌, నాగాలాండ్‌, త్రిపుర.. ల‌ సహకారంతో విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఆధీనం లోని ప్ర‌భుత్వ రంగ సంస్థ (పిఎస్ యు) అయిన ప‌వ‌ర్ గ్రిడ్ (POWERGRID) ద్వారా అమ‌లులోకి తీసుకురావడం జ‌రుగుతుంది.  ఈ ప‌థ‌కాన్ని వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ క‌ల్లా ప‌ని చేయించ‌డం ప్రారంభించాల‌నేది ల‌క్ష్యం గా ఉంది.  ఈ ప్రాజెక్టు కార్య‌క‌లాపాలు మొద‌లైన త‌రువాత, ఆయా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యుటిలిటీస్ దీని యాజ‌మాన్యాన్ని స్వీక‌రించడం జరుగుతుంది; అవే ఈ ప్రాజెక్టు ను నిర్వ‌హిస్తాయి.  

ఈశాన్య ప్రాంత సంపూర్ణ ఆర్థికాభివృద్ధి, ఆ ప్రాంతం లో అంత‌ర్ రాష్ట్ర ప్ర‌సారం, పంపిణీ సంబంధిత మౌలిక స‌దుపాయాల వ్య‌వ‌స్థ‌ ను బ‌లోపేతం చేయ‌డానికి ప్ర‌భుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ఈ ప్రాజెక్టు తాలూకు ప్ర‌ధాన ఉద్దేశ్యం గా ఉంది.  

ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డం వ‌ల్ల ఒక విశ్వ‌స‌నీయ‌మైన ప‌వ‌ర్ గ్రిడ్ ను ఉనికి లోకి తీసుకురావ‌డ‌మే కాకుండా త్వ‌ర‌లో ఏర్పాటు కాబోయే లోడ్ సెంట‌ర్స్ తో ఈశాన్య ప్రాంత రాష్ట్రాల సంధానం మెరుగుప‌డనుంది.  ఈ ప్రకారం గా ఈశాన్య ప్రాంతం లోని అన్ని వ‌ర్గాల‌కు చెందిన వినియోగ‌దారుల‌కు గ్రిడ్ తో ముడిప‌డిన విద్యుత్తు తాలూకు ప్ర‌యోజ‌నాలను అందించవచ్చు.

ఈ ప‌థ‌కం ఈ రాష్ట్రాల‌ లో త‌ల‌స‌రి విద్యుత్తు వినియోగాన్ని కూడా పెంచగలదు.  అంతేకాకుండా, ఈశాన్య ప్రాంత సంపూర్ణ ఆర్థిక అభివృద్ధి కి కూడా తోడ్ప‌డుతుంది.  

ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేసే ఏజెన్సీ లు నిర్మాణ కార్య‌క‌లాపాల‌ లో స్థానికుల‌ను చెప్పుకోద‌గ్గ సంఖ్యలో నియ‌మించుకొంటాయి.  దీంతో ఈశాన్య ప్రాంతం లో నైపుణ్యం ఉన్న కార్మికుల‌కు, నైపుణ్యం లేని కార్మికుల‌కు ఉద్యోగావకాశాలు అందివ‌స్తాయి.

దీనికి తోడు ఈ ప‌థ‌కం రూపుదిద్దుకొన్న త‌రువాత కొత్త‌గా ఏర్పాట‌య్యే ఆస్తుల నిర్వ‌హ‌ణ‌కు అద‌నంగా మాన‌వ వ‌న‌రులు అవ‌స‌రం అవుతాయి.  ఇది ఈశాన్య ప్రాంత రాష్ట్రాల‌ లో మ‌రిన్ని ఉద్యోగ అవ‌కాశాల‌కు పెద్ద ఎత్తున ఆస్కారం క‌ల్పించ‌నుంది.  
 
పూర్వ‌రంగం:

ఈ ప‌థ‌కాన్ని విద్యుత్తు మంత్రిత్వ శాఖ కు చెందిన ఒక కేంద్రీయ రంగ ప్ర‌ణాళికా ప‌థ‌కం గా 2014 వ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ లో తొలుత ఆమోదం తెల‌ప‌డం జ‌రిగింది.  దీనిని వ‌ర‌ల్డ్ బ్యాంకు ఆర్థిక స‌హాయం తో పాటు భార‌త ప్ర‌భుత్వ విద్యుత్తు మంత్రిత్వ శాఖ తాలూకు బ‌డ్జెట్ సహాయం కూడా కలిపి, 50:50 శాతం  చొప్పున భరించే విధం గా (50 శాతం ప్రపంచ బ్యాంకు: 50 శాతం భారత ప్రభుత్వం) మొదలుపెట్టడం జరిగింది.  అయితే దీనిలో సామర్థ్య నిర్మాణం ప్రాతిపదిక న అయ్యే 89 కోట్ల రూపాయల ఖర్చు ను మాత్రం పూర్తి గా భారత ప్రభుత్వమే భరించనుంది.


***(Release ID: 1681170) Visitor Counter : 253