మంత్రిమండలి
విద్యుత్తు రంగం లో పరస్పర హితం ముడిపడి ఉన్న రంగాల లో సమాచారం ఆదాన ప్రదానానికి భారతదేశానికి, యుఎస్ఎ కు మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
16 DEC 2020 3:31PM by PIB Hyderabad
విద్యుత్తు రంగం లో భారతదేశం, యుఎస్ఎ ల పరస్పర హితం ముడిపడిన అంశాలలో సమాచారాన్ని, అనుభవాలను ఒక పక్షానికి మరొక పక్షం అందించుకోవడం కోసం భారతదేశానికి చెందిన కేంద్రీయ విద్యుత్తు నియంత్రణ సంఘాని కి (సిఇఆర్‌సి), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) కు చెందిన ఫెడరల్ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్ కు (ఎఫ్ఇఆర్ సి) మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలన్న సిఇఆర్ సి ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ఎమ్ఒయు టోకు ప్రభావవంతమైన విద్యుత్తు బజారు ను తీర్చిదిద్దడానికి, గ్రిడ్ విశ్వసనీయత ను పెంపొందించడానికి గాను ఒక నియంత్రణ పూర్వకమైన, విధానపరమైన ఫ్రేమ్ వర్క్ కు మెరుగులు దిద్దడంలో తోడ్పడనుంది.
ఎమ్ఒయు లో భాగం గా చేపట్టే కార్యకలాపాల లో, ఈ కింద ప్రస్తావించిన అంశాలు భాగం గా ఉంటాయి:
• శక్తి సంబంధిత అంశాలను గుర్తించడం, ఉభయ పక్షాల హితం తో కూడిన రంగాల లో సమాచారాన్ని, నియంత్రణ పరమైన అభ్యాసాలను ఇచ్చి పుచ్చుకోవడానికి వీలు గా అంశాలను రూపొందించి, తత్సంబంధిత కార్యక్రమాలను ఒక పట్టిక గా తయారు చేయడం;
• ఒక దేశానికి చెందిన సదుపాయాలలో జరిగే కార్యకలాపాలలో రెండో దేశానికి చెందిన కమిషనర్లు, లేదా సిబ్బంది పాల్గొనేందుకు వారి సందర్శనలకు ఏర్పాట్లు చేయడం;
• చర్చాసభలలోను, సందర్శనలలోను, ఆదాన ప్రదానాలలోను పాలుపంచుకోవడం;
• ఇరు పక్షాలకు ప్రయోజనం దక్కే కార్యక్రమాలను రూపొందించడం, భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి గాను ఈ తరహా కార్యక్రమాల ను అనువైన ప్రాంతాలలో నిర్వహించడం;
• ఆచరణసాధ్యమైనప్పుడు, పరస్పర హితం ముడిపడివుంటే గనక శక్తి సంబంధిత అంశాలపై వక్తలను, ఇతర సిబ్బంది ని (నిర్వహణ లేదా సాంకేతిక సిబ్బంది ని) పంపడం.
***
(Release ID: 1681161)
Visitor Counter : 237
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam