పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా ప్రధాని మార్చారని స్వచ్ఛత పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో వ్యాఖ్యానించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
14 DEC 2020 2:06PM by PIB Hyderabad
పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా ప్రధాని మార్చారని, దేశవ్యాప్తంగా ప్రజలు ఇందులో భాగస్వాములయ్యారని కేంద్ర చమురు, సహజవాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. చమురు పరిశ్రమలో "స్వచ్ఛ పఖ్వాడా" పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశుభ్రత ఉద్యమంలో చమురు పరిశ్రమ కూడా పాల్గొంటోందని, ప్రోత్సాహాన్ని అందిస్తోందని మంత్రి అన్నారు. దీనిని మరింత తీవ్రతరం చేయాలని, ఈ విధానానికి అంకితమవ్వాలని సూచించారు.
"2022లో 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతావని ఆవిర్భవించనున్న సందర్భంలో, స్వచ్ఛ భారత్ కలను మనం తప్పకుండా నిజం చేయాలి. ప్రైవేటు రంగ చమురు, సహజవాయు సంస్థలు 'స్వచ్ఛ భారత్ అభియాన్'లో విస్తృతంగా పాల్గొనాలి. పర్యాటక ప్రదేశాల్లో అత్యాధునిక మరుగుదొడ్డను ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయాలి" అని తెలిపిన శ్రీ ప్రధాన్, "స్వచ్ఛ పఖ్వాడా","స్వచ్ఛత హి సేవ" అవార్డులను చమురు, సహజవాయు ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రదానం చేశారు.
వ్యర్థ జల నిర్వహణ, ఒక్కసారే వినియోగించే ప్లాస్టిక్ నిర్మూలన సహా పరిశుభ్రత అంశాల్లో అవగాహన కల్పించడంలో చేసిన కృషిపై, అవార్డు గ్రహీత సంస్థలను అభినందించారు.
అవార్డు గ్రహీతలు: స్వచ్ఛ పఖ్వాడా
మొదటి పురస్కారం-ఐఓసీఎల్, రెండో పురస్కారం-బీపీసీఎల్, మూడో పురస్కారం-ఓఎన్‌జీసీ, ప్రత్యేక పురస్కారం-హెచ్‌పీసీఎల్
అవార్డు గ్రహీతలు: స్వచ్ఛత హి సేవ
మొదటి పురస్కారం-హెచ్‌పీసీఎల్, రెండో పురస్కారం-బీపీసీఎల్, మూడో పురస్కారం-ఐఓసీఎల్
***
(Release ID: 1680567)
Visitor Counter : 172