నీతి ఆయోగ్

“విజన్ 2035: భారత్ లో దూరదృష్టితో కూడిన ప్రజారోగ్య నిఘా” పేరిట శ్వేత పత్రం విడుదల

Posted On: 14 DEC 2020 1:28PM by PIB Hyderabad

“విజన్ 20235: దూరదృష్టితో కూడిన భారత్ లో ప్రజారోగ్య నిఘా” పేరుతో నీతి ఆయోగ్ సంస్థ ఈరోజు ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. అన్ని స్థాయిలలో ప్రజారోగ్యం విషయంలో సంసిద్ధతను పెంచటం, తగినట్టు స్పందించటానికి వీలుగా భారత ప్రజారోగ్య నిఘా వ్యవస్థను రూపుదిద్దటం దీని లక్ష్యం.

ప్రజలకు అనుకూలంగా ఉండే నిఘా వ్యవస్థ వలన వ్యక్తిగత ప్రైవసీ, గోప్యత సాధ్యమవుతాయి. క్లయింట్స్ ఇచ్చే సమాచారం ఆధారంగా ఇది పనిచేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డేటా పరస్పరం మార్చుకునే విధానం మెరుగుపడటం వలన వ్యాధి నిర్థారణ, నివారణ, నియంత్రణ సులభమవుతాయి.

అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న ప్రజారోగ్య అత్యవసర విషయాలలో ముందుండి చొరవ తీసుకోవటానికి ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా నాయకత్వ చొరవ చూపటానికి భారత్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ఈ శ్వేత పత్రాన్ని విడుదలచేశారు. నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్య) డాక్టర్ వినోద్ కె పాల్, సీఈవో అమితాభ్ కాంత, అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ సర్వాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయటంలో కొనసాగింపే ఈ “విజన్ 20235: దూరదృష్టితో కూడిన భారత్ లో ప్రజారోగ్య నిఘా”. ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితి రికార్డులను ఎలక్ట్రానిక్ రూపంలో నిర్వహించటం మీద ఇది దృష్టి సారిస్తుంది. నిఘాకు ఇదే ప్రాతిపదిక అవుతుంది.  ఆరోగ్య భద్రతలో అన్ని దశలలోను ప్రజారోగ్య నిఘా పాత్ర చాలా కీలకమవుతుంది. నిఘా అనేది చర్యకు అవసరమైన సమాచారం.

మానవులకు, జంతువులకు మధ్య పర్యావరణ పరంగా బంధం పెరుగుతున్న సమయం ఇది. ఇలాంటప్పుడు  వచ్చే సరికొత్త వ్యాధుల పట్ల ఉండాల్సిన అప్రమత్తతను కోవిడ్-19 సంక్షోభం నిరూపించింది. ఎంత త్వరగా దీని ఆనవాలు గుర్తిస్తే అంత సమర్థంగా వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉంటుందన్న సంగతి కూడా ఇప్పుడు బైటపడింది. ఆదిశలో ఉన్న ఈ డాక్యుమెంట్ ఎక్కడెక్కడ అవరోధాలు ఉన్నాయో కూడా గుర్తిస్తుంది. ప్రజానుకూల ప్రజారోగ్య వ్యవస్థలో వ్యక్తులు, సమూహం, ప్రజారోగ్య కేంద్రాలు, లేబరేటరీలు అన్నిటినీ సమన్వయం చేస్తూ వ్యక్తుల ప్రైవసీని, గోప్యతను పరిరక్షిస్తుంది.

భారత్ లో ప్రజారోగ్య నిఘాకు ఈ శ్వేత పత్రం చోదకశక్తిగా పనిచేసే  ఒక విజన్ డాక్యుమెంట్ గా ఉంటుంది. భారతదేశాన్ని ఈ రంగంలో అంతర్జాతీయ నాయకత్వ స్థానంలో నిలబెడుతుంది.

పూర్తి సమాచారం ఇక్కడ చూడవచ్చుhttps://niti.gov.in/sites/default/files/2020-12/PHS_13_dec_web.pdf

 

*****


(Release ID: 1680555) Visitor Counter : 280