వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఫిక్కి (FICCI) వార్షిక స‌దస్సు & 93వ ఎజిఎంను ఉద్దేశించి ప్ర‌సంగించిన పీయూష్ గోయల్‌

నాణ్య‌త ఉత్పాద‌క‌త కూడిన ఉత్ప‌త్తి ప్ర‌మాణం భార‌త్‌ను వాస్త‌వంగా పోటీప‌డ‌గ‌లిగేలా చేస్తుంది ః గోయ‌ల్‌

త‌న ఉన్న‌త‌మైన నాణ్య‌త‌ను ప్ర‌పంచానికి భార‌త్ బ్రాండ్ ప్ర‌ద‌ర్శించాలి

వ్య‌వ‌సాయ చ‌ట్టాల లాభాల గురించి మాట్లాడ‌వ‌ల‌సిందిగా ప‌రిశ్ర‌మ నాయ‌కుల‌కు, మేథావుల‌కు విజ్ఞ‌ప్తి

Posted On: 12 DEC 2020 2:48PM by PIB Hyderabad

 ఫిక్కి వార్షిక స‌మావేశం, 93వ వార్షిక సాధార‌ణ స‌మావేశాన్ని ఉద్దేశించి శ‌నివారం కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ప్ర‌సంగించారు. నాణ్య‌త‌, ఉత్పాద‌క‌తతో కూడిన భారీ వ‌స్తు త‌యారీ వివిధ రంగాల‌లో భార‌త్‌ను పోటీప‌డేలా చేయ‌గ‌ల‌గ‌డ‌మే కాక‌, ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ దిశ‌గా  పురోగ‌మించేందుకు తోడ్ప‌డుతూ నూత‌న భార‌త్ కు ముఖ్య‌క నిర్మాణ భూమిక పోషిస్తుంద‌న్నారు. మెరుగైన‌, ఉత్పాద‌క ప్ర‌మాణాన్ని మెరుగుప‌ర‌చుకోవ‌డ‌మే ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ అని ఆయ‌న చెప్పారు. 
మ‌నం అంత‌ర్జాతీయ స్థాయి వాణిజ్యం చేయ‌గ‌లిగి, ప్ర‌పంచ వాణిజ్యానికి భారీ స్థాయిలో దోహ‌దం చేసేందుకు మ‌‌న‌కు పోటీ, తులనాత్మ‌క ల‌బ్ధి ఉన్న రంగాల‌ను గుర్తిస్తామ‌ని, గోయ‌ల్ చెప్పారు. రానున్న సంవ‌త్స‌రాల‌లో టైర్ &ర‌బ్బ‌ర్ ప‌రిశ్ర‌మ వాతావ‌ర‌ణ వ్య‌వ‌స్థకు వాణిజ్యంలో గొప్ప నాయ‌క‌త్వం వ‌హించవ‌చ్చ‌న్నారు. ప్రైవేటు, ప్రభుత్వ పెట్టుబ‌డుల తోడ్పాటుతో ర‌బ్బ‌ర్ సాగును ప్రోత్స‌హిస్తామ‌ని, అలాగే టైర్ల ప‌రిశ్ర‌మ‌కు త‌గిన మ‌ద్ద‌తు ఇస్తామ‌ని తద్వారా అది అభివృద్ధి చెంది, వ‌ర్ధిల్లేందుకు సాయ‌ప‌డుతుంద‌న్నారు. రానున్న ప‌దేళ్ళ కాలంలో 200 ల‌క్ష‌ల కోట్ల విలువైన ఉత్పాద‌క‌త‌ను భార‌త్‌లో చేయ‌డం కోసం కార్యాచ‌ర‌ణ అజెండాను రూపొందించేందుకు  ప‌రిశ్ర‌మ నాయ‌కులు క‌లిసి ప‌ని చేస్తున్న 24 రంగాల‌ను గుర్తించ‌డం జ‌రిగింద‌ని,  ఆయ‌న వివ‌రించారు. ఇది  వివిధ రంగాల‌లో ల‌క్ష‌లాది ఉపాధి అవ‌కాశాల‌ను త‌ప్ప‌నిస‌రిగా గుర్తించ‌డ‌మే గాక‌, ఉత్ప‌త్తి స్థాయిని, నాణ్య‌త‌ను సృష్టిస్తుంద‌న్నారు.
న‌వీన భార‌త‌దేశానికి స్టార్ట‌ప్‌లు వెన్నుముక‌ల వంటివని వ‌ర్ణిస్తూ, స్టార్ట‌ప్‌లు, వాటి వాతావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లు ఆవిష్క‌ర‌ణ‌ను ప్రోత్స‌హించ‌డ‌మేగాక‌, నూత‌న‌, యువ వ్య‌వ‌స్థాప‌కులను బ‌లోపేతం చేయ‌డ‌మే కాక ప్రోత్స‌హిస్తోంద‌ని గోయ‌ల్ తెలిపారు. ఈ క్ర‌మంలో స్టార్ట‌ప్‌ల‌కు త‌గిన ఆర్థిక మ‌ద్ద‌తును, చేయూత‌ను, అవ‌కాశాల‌ను, మార్గ‌ద‌ర్శ‌క‌త్వాన్ని భార‌తీయ ప‌రిశ్ర‌మ‌లు స్టార్ట‌ప్‌లకు ఇవ్వాల‌ని, త‌ద్వారా వారు తొలి ద‌శ‌లోనే అతి త‌క్కువ అంచ‌నా విలువ‌ల‌తో త‌మ వాటాల‌ను విదేశీల‌కు అమ్ముకోకుండా వృద్ధి చెందేలా సాయ‌ప‌డాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.
స‌మ్మ‌తి భారాల‌ను త‌గ్గించ‌డం గురించి మాట్లాడుతూ, స‌మ్మ‌తి, ఆమోద ప్ర‌క్రియ‌ను స‌ర‌ళ‌త‌రం చేసేందుకు తోలి వాస్త‌వ‌మైన సింగిల్ విండో వ్య‌వ‌స్థ‌ను సృష్టించేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నామ‌ని గోయ‌ల్ చెప్పారు. స‌మ్మ‌తి ని ప‌రిస్థితిని నెర‌వేర్చ‌డానికి మ‌రింత స‌ర‌ళమైన ప్ర‌క్రియ‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌నుకుంటున్నామ‌ని, అదే స‌మ‌యంలో వివిధ మంత్రిత్వ శాఖ‌ల‌కు చెందిన మంత్రులంతా స‌మ్మ‌తి భారాన్ని త‌గ్గించే దిశ‌గా ప‌ని చేస్తున్నార‌న్నారు. 
ప్ర‌తిపాదిత బ్రాండ్ ఇండియా చొర‌వ గురించి మాట్లాడుతూ, ఈ  భావ‌న ప్ర‌కారం ప్ర‌భుత్వం, ప‌రిశ్ర‌మ ప‌ర‌స్ప‌ర భాగ‌స్వాములుగా ప‌ని చేస్తూ, మేకిన్ ఇండియానే కాక‌, మొత్తం బ్రాండ్ ఇండియాను అభివృద్ధి చేసేందుకు ప‌ని చేస్తామ‌న్నారు. మేం కూడా భార‌త్ ప్ర‌త్యేక ముద్ర వేసేలా చేయాల‌ని చూస్తున్నామ‌న్నారు,  ప్ర‌పంచానికి మ‌న నాయ‌క‌త్వ స్థితిని, నాణ్య‌త ప‌ట్ల నిబ‌ద్ధ‌త‌ను ప్ర‌ద‌ర్శించే స‌మ‌యం భార‌త్‌కు ఆస‌న్న‌మైంద‌న్నారు. ఏదైనా ఉత్ప‌త్తికి భార‌త్ ముద్ర ప‌డితే, అది ఉన్న‌త‌మైన నాన్‌య‌త క‌లిగి ఉంద‌ని అది రుజువు చేసుకోవాల‌న్నారు. బ్రాండ్ ఇండియా చొర‌వ కింద భార‌త్‌లోనూ, అంత‌ర్జాతీయంగానూ వినియోగ‌దారుల‌ను భార‌త్‌లో త‌యారు చేసిన ఉత్ప‌త్తుల గురించి చైత‌న్య‌ప‌రుస్తామ‌న్నారు. మేకిన్ ఇండియా ఉత్ప‌త్తుల‌ను స‌ర్టిఫై చేయ‌వ‌ల‌సిందిగా ప‌రిశ్ర‌మ‌లన్నింటినీ ప్రోత్స‌హిస్తున్నామ‌న్నారు. బ్రాండ్ ఇండియా సృష్టి చొర‌వ‌లో త‌మ మ‌ద్ద‌తును ఇచ్చిన ఫిక్కికి ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
త‌న దార్శ‌నిక‌త‌, నిరాడంబ‌ర‌త‌, గ‌త ప‌రిమితుల‌కు ఆవ‌ల ఆలోచించే సాహ‌సం, మార్పును ఆహ్వానించే స‌మ్మ‌తితో జాతిలో స్ఫూర్తి నింపేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అవిరామంగా ప‌ని చేస్తున్నార‌ని గోయ‌ల్ చెప్పారు. దేశం సౌభాగ్యవంతం కావాల‌ని, మ‌న స‌మాజంలో విస్త్ర‌త ల‌బ్ధి కోసం చ‌ట్టాలు చేయాల‌ని, వృద్ధి, ఆర్ధికాభివృద్ధి ఫ‌లాలు పిర‌మిడ్‌లో అట్ట‌డుగున వ్య‌క్తి కూడా చేరాల‌న్న విష‌యం ప‌ట్ల స్ప‌ష్ట‌మైన మ‌న‌సుతో ప్ర‌ధాని ఉన్నార‌ని తెలిపారు. 
రైతుల సంక్షేమానికి కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్తూ, దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతుల ల‌బ్ధి కోస‌మే ఈ చ‌ట్టాలు చేసినందున‌ఫిక్కితో అనుబంధం గ‌ల  వ్యాపార నాయ‌కుల‌ను, మేధావుల‌ను వ్య‌వ‌సాయ చ‌ట్టాల వ‌ల్ల ఒన‌గూడే ల‌బ్ధి గురించి మాట్లాడ‌వ‌ల‌సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు. పాత వ్య‌వ‌స్థ‌ల‌ను మార్చ‌కుండానే ఈ చ‌ట్టాలు రైతుల‌కు వ్యాపారం, వాణిజ్యానికి నూత‌న అవ‌కాశాల‌ను అందిస్తాయ‌న్నారు. ఇది గ్రామీణ భార‌తంలోకి మ‌రింత పెట్టుబ‌డిని తీసుకువ‌చ్చి, రైతుల ఆదాయాన్ని పెంచుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

***



(Release ID: 1680324) Visitor Counter : 75