సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఎంఈల నుంచి అధిక సేకరణతోపాటు నవంబరు వరకు వీటికి రూ .21000 కోట్లకు పైగా చెల్లించడానికి చేసిన సమిష్టి కృషిని కేంద్ర ఆర్థికమంత్రి ప్రశంసించారు.
ఎంఎస్ఎంఈ లను ఆర్ధికంగా మరింత బలపర్చడానికి ప్రభుత్వం దూకుడుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఎంఎస్ఎంఈ ల నుండి వస్తు సేకరణ , వీటికి చెల్లింపులు పెరుగుతున్నాయి.
ఎమ్ఎస్ఎంఈ రంగం ఎంతో అభివృద్ధి సాధిస్తోంది.
Posted On:
10 DEC 2020 3:35PM by PIB Hyderabad
ఎంఎస్ఎంఈలకు చెల్లింపులపై కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ సమీక్షించారు వీటి అభివృద్ధికి ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ చేసిన అద్భుతమైన కృషిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రశంసలు తెలిపారు. భారత ప్రధానమంత్రి దూరదృష్ట ప్రణాళికలో భాగంగా 2020 మేలో ఆర్థిక మంత్రి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించారు. ఎంఎస్ఎంఈ బకాయిలను 45 రోజుల్లో చెల్లించాలని కూడా అన్ని ప్రభుత్వశాఖలను ఆదేశించారు. 2020 మే నెల నుండి, ఈ బకాయిల చెల్లింపు కోసం భారత ప్రభుత్వం, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఎన్నో చర్యలు తీసుకుంది. సమిష్టి ప్రయత్నాలు జరిగాయి. ఎంఎస్ఎంఈలకు బకాయిల చెల్లించేలా సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (సిపిఎస్ఇ)లు , కేంద్ర ప్రభుత్వ సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫలితంగా, మే 2020 నుండి గత 7 నెలల్లో 21000 కోట్ల రూపాయలను ఎంఎస్ఎంఈలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు , సిపిఎస్ఇలు చెల్లించాయి. ఈ ఏడాది అక్టోబరులో 5100 కోట్ల రూపాయలకు పైగా విలువైన వస్తువులను వీటి నుంచి కొనుగోలు చేసి, 4100 కోట్ల రూపాయలను చెల్లించారు. 2020 నవంబర్‌కు మొదటి 10 రోజుల్లో వచ్చిన నివేదికల ప్రకారం, వస్తు సేకరణ విలువ దాదాపు 4700 కోట్ల రూపాయలు, బకాయిలు చెల్లింపు విలువ రూ. 4000 కోట్లు దాటుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ క్రింది పట్టిక వివరాలను అందిస్తుంది:
ఎంఎస్ఎంఈలకు మంత్రిత్వశాఖలు, సీపీఎస్ఈలు చెల్లించాల్సిన బకాయిలు
నెల లావాదేవీలు, బకాయిలు చెల్లింపు (రూ.కోట్లలో) నెలలో పెండింగ్ (రూ.కోట్లలో)
మే 2346.82 1785 65 560. 97
జూన్ 2550.82 1903.39 647.43.
జూలూ 4222.40 3354.01 968.41
ఆగస్టు 3809.42 2952.95 856.48
సెప్టెంబరు4760.52 3746 68 1013. 84
అక్టోబరు 5123.90 4102.29 1021.63
నవంబరు 4762.29 4001.96 760.37
మే నుంచి చెల్లించిన మొత్తం రూ.21,647 కోట్లు
ఎంఎస్ఎంఈ బకాయిల చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు , సీపీఎస్ఈ లకు ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ కార్యదర్శి చాలాసార్లు లేఖలు రాశారు. తరువాత వ్యక్తిగత చర్చలు , సంప్రదింపులు జరిగాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలకు పీఎంఓ , క్యాబినెట్ కార్యదర్శి నుండి ఎంతో మద్దతు లభించింది. పీఎంఓ అధికారులు సీపీఎస్ఈ లు , ప్రభుత్వ సంస్థలకు లేఖలు రాశారు. మొత్తం లావాదేవీలు, మొత్తం చెల్లింపులు , ప్రతి నెల చివరిలో పెండింగ్ బకాయిల వివరాలను నివేదించడానికి సిపిఎస్ఇలు , మంత్రిత్వ శాఖల కోసం ఆన్-లైన్ రిపోర్టింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు.
ఏడు నెలల నివేదిక (మే-నవంబర్, 2020) లోని వివరాలు ఇలా ఉన్నాయి
–ఎంఎస్ఎంఈ ల నుండి కేంద్ర ప్రభుత్వ సంస్థలు , సీపీఎస్ఈ లు కొనే వస్తువుల పరిమాణం పెరుగుతోంది. ఇది ఈ ఏడాది మే నాటికి దాదాపు 2.5 రెట్లు పెరిగింది;
– ఎంఎస్ఎంఈ లకు చెల్లింపులు కూడా దామాషా ప్రకారం పెరిగాయి;
–బకాయిల చెల్లింపుల పెండింగ్ బాగా తగ్గిపోయాయి.
–ఈ ఏడాది అక్టోబర్ కోసం తయారు చేసిన నివేదిక మే నుండి గరిష్ట లావాదేవీలను చూపించింది;
● అయితే, డిసెంబర్‌లో వచ్చిన నివేదికలు కేవలం గత నెల 10 రోజుల రిపోర్టింగ్ను మాత్రమే చూపుతాయి.
ఎంఎస్ఎంఈలకు తమ సహకారం అందించినందుకు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిత్వ శాఖలను, విభాగాలను , సిపిఎస్ఇలను అభినందించింది. వీరి మద్దతు సెప్టెంబర్ , అక్టోబర్ నెలల్లో ముఖ్యమైనది. ఎందుకంటే ఈ నగదు ద్వారా ఎంఎస్ఎంఈ లు వస్తువులు , సేవలను ఉత్పత్తి చేయవలసి ఉంది. వీటిని పండుగ సమయంలో విక్రయించవచ్చు. పండుగ కాలంలో ఎంఎస్ఎంఈలకు సహాయం చేయాలని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కార్పొరేట్ రంగాన్ని అభ్యర్థించింది ఎందుకంటే ఈ పండుగలలో సంపాదించిన ఆదాయంతో ఏడాది పొడవునా ఎంఎస్ఎంఈలను నడపవచ్చు. చాలా మంది ఎంఎస్ఎంఈ లు , గ్రామ పరిశ్రమలకు మునుపటి సంవత్సరం కంటే మెరుగైన వ్యాపారం చేయడానికి ఈ మద్దతు సహాయపడింది.
***
(Release ID: 1679907)
Visitor Counter : 213