రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
రహదారి మౌలిక సదుపాయాల రంగంలో టెక్నాలజీ సహకారంపై ఆస్ట్రియాతో మోర్త్ అవగాహన ఒప్పందం
Posted On:
09 DEC 2020 6:27PM by PIB Hyderabad
రహదారి మౌలిక సదుపాయాల రంగంలో సాంకేతిక సహకారానికి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) ఆస్ట్రియాకు చెందిన పర్యావరణ చర్యలు, పర్యావరణం, విద్యుత్, మొబిలిటీ, ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రహదారి రవాణా, రహదారి / రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణ మరియు పరిపాలన, రోడ్డు భద్రత మరియు ఇరు దేశాల మధ్య ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ రంగంలో ద్వైపాక్షికపు సహకారం కోసం సమర్థవంతమైన చట్రాన్ని రూపొందించడం ఈ అవగాహన ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేస్తుంది. దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాల్ని ప్రోత్సహిస్తుంది.
రెండు దేశాల మధ్య వాణిజ్య మరియు ప్రాంతీయ సమైక్యతను వృద్ధి చేస్తుంది. 1949 లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడినప్పటి నుండి భారతదేశం ఆస్ట్రియాతో మంచి దౌత్య సంబంధాలు కలిగి ఉంది. మేటి స్నేహపూర్వక ఆర్థిక మరియు దౌత్య సంబంధాల చరిత్రను పంచుకుంటాయి. రోడ్లపై ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్స్, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, టన్నెల్ మానిటరింగ్ సిస్టమ్, జియో మ్యాపింగ్ మరియు ల్యాండ్‌లైడ్ ప్రొటెక్షన్ కొలతలు వంటి రోడ్లు మరియు రహదారులకు సంబంధించి మేటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆస్ట్రియా కలిగి ఉంది. రహదారి రవాణాలో భారతదేశం-ఆస్ట్రియా ద్వైపాక్షిక సహకారం మెరుగైన రహదారి భద్రత మరియు ఈ రంగానికి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ అవకాశాల నుండి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ అవగాహన ఒప్పందంపై మోర్త్ అదనపు కార్యదర్శి శ్రీ కె.సి. గుప్తా, ఆస్ట్రియా రాయబారి బ్రిగిట్టే ఓపింగర్-వాల్చ్‌షోఫర్ సంతకం చేశారు.
****
(Release ID: 1679561)
Visitor Counter : 147