మంత్రిమండలి

కొచ్చి మెయిన్‌లాండ్‌, లక్షద్వీప్ దీవుల (కెఎల్ఐ ప్రాజెక్ట్) మధ్య జలాంతర్గామి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీని అందించడానికి క్యాబినెట్ ఆమోదం

Posted On: 09 DEC 2020 3:45PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ కొచ్చి మెయిన్‌లాండ్ మరియు లక్షద్వీప్ దీవుల మధ్య జలాంతర్గామి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీని అందించడానికి సంబంధించిన కేఎల్ఐ ప్రాజెక్ట్‌కు అనుమతినిచ్చింది. కొచ్చి మరియు లక్షద్వీప్ యొక్క 11 ద్వీపాల మధ్య పూర్తిస్థాయి జలాంతర్గామి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) ద్వారా ప్రత్యక్ష కమ్యూనికేషన్ లింక్‌ను అందించేందుకు ఈ ప్రాజెక్ట్ సంకల్పించింది. క‌వరత్తి, కల్పేని, అగతి, యామిని, ఆండ్రొత్, మినికాయ్, బంగారం, బిట్రా, చెట్లట్, కిళతాం & కద్మత్‌ల మ‌ధ్య క‌మ్యూనికేష‌న్ లింక్‌నకు ఇది దోహ‌దం చేస్తుంది.

ఆర్థిక అవ‌రోధాలు:

అమలు అంచనా వ్యయం ఐదు సంవ‌త్స‌రాల నిర్వహణ ఖర్చులతో క‌లుపుకొని సుమారు రూ. 1072 కోట్లు. ఈ ప్రాజెక్టుకు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నిధుల‌ను సమకూరుస్తుంది.

ప్రభావం:

టెలికాం మౌలిక సదుపాయాల వృద్ధి ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధితో ముడిపడి ఉందని స్పష్టమవుతోంది. ఉపాధి కల్పనలో టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ కీలకమైన‌ పాత్రను పోషిస్తుంది.

ప్రస్తుతం క్యాబినెట్ ఆమోదంతో‌ జలాంతర్గామి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ, అందించడం పెద్ద బ్యాండ్‌విడ్త్‌ను అందించడం ద్వారా లక్షద్వీప్ దీవులలో టెలికమ్యూనికేషన్ సదుపాయాన్ని బాగా మెరుగ‌వుతుంది. జలాంతర్గామి కనెక్టివిటీ ప్రాజెక్టు పౌరుల ఇంటి వద్దనే ఈ-గవర్నెన్స్ సేవలను అందించడం, మత్స్య సంపద, కొబ్బరి ఆధారిత పరిశ్రమలు మరియు అధిక విలువ కలిగిన పర్యాటకం, టెలి-విద్య పరంగా విద్యా అభివృద్ధి మరియు ఆరోగ్య సంరక్షణ పరంగా టెలిమెడిసిన్ సౌకర్యాల నిమిత్తం కీలకంగా నిలువ‌నుంది. ఇది వివిధ రాక‌ల‌ వ్యాపారాల స్థాపన, ఈ-కామ‌ర్స్‌

కార్యకలాపాలను పెంచడానికి, జ్ఞాన భాగస్వామ్యం కోసం విద్యా సంస్థలకు తగిన సహాయాన్ని అందించడానికి సహాయపడుతుంది. లక్షద్వీప్ దీవులు లాజిస్టిక్ సేవల కేంద్రంగా మారే అవకాశం ఉంది.

అమలు వ్యూహం & లక్ష్యాలు:

ప్రాజెక్ట్ అమ‌లు ఏజెన్సీగా భారత్ సంచార్ నిఘ‌మ్‌ లిమిటెడ్‌ను (బీఎస్ఎన్ఎల్) మరియు టెలి కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్‌ను (టీసీఐఎల్‌) ఈ ప్రాజెక్టుకు టెక్నిక‌ల్ క‌న్సెల్టెంట్‌గాను వ్య‌వ‌హ‌రించానున్నాయి. టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్‌కు టీసీఐఎల్‌ను స‌హ‌యం చేయ‌నుంది.  ప్రాజెక్ట్ కింద ఉన్న ఆస్తుల‌ యొక్క యాజమాన్యం డీఓటీ నిధుల స‌మీక‌ర‌ణ ఏజెన్సీ అయిన యుఎస్ఓఎఫ్ వ‌ద్ద ఉంటుంది. ఈ ప్రాజెక్టును మే 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

నేపథ్యం:

కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ అనేక ద్వీపాల స‌మూహంగా అరేబియా సముద్రంలో ఉంది. ఇది భారతదేశానికి ఎంతో వ్యూహాత్మక ప్రాముఖ్యత క‌లిగిన ప్రాంతం. సురక్షితమైన, దృఢ‌ మైన, నమ్మదగిన, సరసమైన టెలికాం సౌకర్యాలు ఈ ద్వీపాలలో నివసించే ప్రజలకు మరియు దేశం మొత్తానికి వ్యూహాత్మక కోణంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం లక్షద్వీప్‌కు టెలికాం కనెక్టివిటీని అందించే మాధ్యమం కేవ‌లం ఉపగ్రహాల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. ఇక్క‌డ బ్యాండ్‌విడ్త్ కేవ‌లం 1 జీబీపీఎస్‌కు మాత్ర‌మే పరిమితం చేయబడింది. డేటా సేవలను అందించడంలో బ్యాండ్‌విడ్త్ లేకపోవడం ఒక ప్రధాన అడ్డంకి. ఇది సమాజం యొక్క సమగ్ర వృద్ధికి ఈ-గవర్నెన్స్, ఈ-ఎడ్యుకేషన్, ఈ-బ్యాంకింగ్ మొదలైన వాటిని అందించడానికి ముందస్తు అవసరం. లక్షద్వీప్ దీవులలో టెలి-కమ్యూనికేషన్ సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, జలాంతర్గామి ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ల‌ను లక్షద్వీప్ దీవులకు వేయడానికి సంబంధించిన ప్రణాళిక కొంతకాలంగా పరిశీలనలో ఉంది. లక్షద్వీప్ దీవులకు అధిక బ్యాండ్‌విడ్త్ కమ్యూనికేషన్ సౌకర్యంతో ఈ-గవర్నెన్స్ సేవలను బలోపేతం చేయడం మరియు డిజిటల్ ఇండియా దృష్టిని సాధించడం అనే జాతీయ ల‌క్ష్యా సాధ‌నకు దోహ‌దం చేయ‌నుంది.

***(Release ID: 1679471) Visitor Counter : 24