మంత్రిమండలి
'పబ్లిక్ డేటా ఆఫీసుల' ద్వారా పబ్లిక్ వైఫై సేవలు అందించేందుకు, 'పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు' లైసెన్స్ రుసుము లేకుండా పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
Posted On:
09 DEC 2020 3:47PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా విస్తరించిన పబ్లిక్ డేటా ఆఫీసుల (పీడీవోలు) ద్వారా పబ్లిక్ వైఫై సేవలు అందించేందుకు, పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు (పీడీవోఏలు) పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసేలా కేంద్ర సాంకేతికత విభాగం తెచ్చిన ప్రతిపాదనకు, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పబ్లిక్ వైఫై నెట్‌వర్క్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవల విస్తరణను వేగవంతం చేసే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ఈ పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి లైసెన్స్ ఫీజు ఉండదు.
దేశంలో పబ్లిక్ వైఫై నెట్‌వర్కుల వృద్ధిని ఈ ప్రతిపాదన ప్రోత్సహిస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను విస్తరించడంతోపాటు, ఆదాయ, ఉపాధి వృద్ధిని, ప్రజా సాధికారతను పెంచుతుంది.
ముఖ్య లక్షణాలు:
ఈ "పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్"ను "పీఎం-వాణి"గా పిలుస్తారు. ఈ క్రింద తెలిపిన విధంగా, వివిధ వర్గాల ద్వారా పీఎం-వాణి నిర్వహణ సాగుతుంది.
-
పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీవో): వాణి వైఫై యాక్సెస్ పాయింట్లను ఇది ఏర్పాటు చేసి, నిర్వహిస్తుంది. చందాదారులకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తుంది.
-
పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్ (పీడీవోఏలు): ఇది పీడీవోల అగ్రిగేటర్. అధికారం, బాధ్యతలకు సంబంధించిన అంశాలను చూస్తుంది.
-
యాప్ ప్రొవైడర్: వినియోగదారుల నమోదుకు, దగ్గరలో ఉన్న వాణి వైఫై హాట్‌స్పాట్లను చూపేందుకు సాయపడేలా యాప్ రూపొందిస్తుంది. ఇంటర్నెట్ సేవను అందుకోవడానికి ఆ సమాచారాన్ని యాప్‌లో ప్రదర్శిస్తుంది.
-
సెంట్రల్ రిజిస్ట్రీ: యాప్ ప్రొవైడర్లు, పీడీవోఏలు, పీడీవోల వివరాలను ఇది నిర్వహిస్తుంది. కేంద్ర సాంకేతిక విభాగం దీనిని నిర్వహిస్తుంది.
ఉద్దేశాలు:
పీడీవోలు, పీడీవోఏలు, యాప్ ప్రొవైడర్ల నమోదు అవసరం లేకపోయినా, నమోదు రుసుము చెల్లించకుండా, సాంకేతికత విభాగం ఆన్‌లైన్ నమోదు పోర్టల్ (SARALSANCHAR; https://saralsanchar.gov.in) ద్వారా తమంతట తాము నమోదు చేసుకుంటారు. దరఖాస్తు చేసిన ఏడు రోజుల్లో ఆమోదం లభిస్తుంది.
స్నేహపూర్వక, సులభతర వ్యాపార ప్రయత్నాలకు మరింత అనుగుణంగా ఇది ఉంటుందని భావిస్తున్నారు. 4జీ మొబైల్ నెట్‌వర్క్‌లు అందుబాటులోలేని ప్రాంతాలు సహా దేశవ్యాప్తంగా, ఇంటర్నెట్ చందాదారుల సంఖ్యను కొవిడ్ పెంచింది. స్థిరమైన, అధిక వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను తప్పనిసరి చేసింది. పబ్లిక్ వైఫైల ఏర్పాటు ద్వారా దీనిని నెరవేర్చవచ్చు.
పబ్లిక్ వైఫైలు ఉపాధిని సృష్టించడం మాత్రమేగాక; చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తల ఖర్చు చేసే ఆదాయాలను పెంచుతుంది. తద్వారా జీడీపీ వృద్ధి చెందుతుంది.
డిజిటల్ ఇండియా దిశగా పడిన అడుగు, దాని పర్యవసానంగా వచ్చిన ప్రయోజనమే పబ్లిక్ వైఫై ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణ.
పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్‌లను ఉపయోగించుకుని బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి లైసెన్స్ రుసుము లేకపోవడం, దేశం నలుమూలలా బ్రాడ్‌బ్యాండ్ విస్తరణను ప్రోత్సహిస్తుంది. ఆదాయాలు, ఉద్యోగిత, నాణ్యమైన జీవనం, సులభతర వ్యాపారాలను బ్రాండ్‌బ్యాండ్ వినియోగం వృద్ధి చేస్తుంది.
****
(Release ID: 1679412)
Visitor Counter : 443
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada