ప్రధాన మంత్రి కార్యాలయం
డిసెంబర్ 7వ తేదీన ఆగ్రా మెట్రో ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించనున్న - ప్రధానమంత్రి
Posted On:
05 DEC 2020 5:30PM by PIB Hyderabad
ఆగ్రా మెట్రో ప్రాజెక్టు నిర్మాణ పనులను, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 డిసెంబర్, 7వ తేదీ ఉదయం 11 గంటల 30 నిముషాలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభిస్తారు. ఆగ్రాలోని 15వ బెటాలియన్ పి.ఎ.సి. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి - కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురీ; ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ తో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
ఆగ్రా మెట్రో ప్రాజెక్ట్ గురించి :
ఆగ్రా మెట్రో ప్రాజెక్ట్ రెండు మార్గాల్లో మొత్తం 29.4 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఈ మార్గాలు తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, సికంద్ర వంటి ప్రధాన పర్యాటక ప్రదేశాలతో పాటు రైల్వే స్టేషన్లు, బస్సు స్టాండ్లను కలుపుతాయి. ఈ ప్రాజెక్ట్ ఆగ్రా నగరంలోని 26 లక్షల జనాభాతో పాటు, ప్రతి సంవత్సరం ఆగ్రాను సందర్శించే 60 లక్షల మంది పర్యాటకుల ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది చారిత్రాత్మక నగరమైన ఆగ్రాకు పర్యావరణ అనుకూలమైన మాస్ రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థను అందిస్తుంది. 8,379.62 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం 5 సంవత్సరాలలో పూర్తవుతుంది.
గతంలో, 2019 మార్చి, 8వ తేదీన, ‘సి.సి.ఎస్. విమానాశ్రయం నుండి మున్షిపులియా’ వరకు మొత్తం 23 కిలోమీటర్ల పొడవైన ఉత్తర-దక్షిణ కారిడార్ లో లక్నో మెట్రో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడంతో పాటు ఆగ్రా మెట్రో ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు.
*****
(Release ID: 1678642)
Visitor Counter : 108
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam