వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
స్టేక్‌హొల్డర్లకు మంచి విలువనుతెచ్చిపెట్టేందుకు వ్యసాయ, ఇతర అనుబంధ రంగాల కార్యకలాపాలను సమీకృతం చేయడానికి అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసిన ఎపిఇడిఎ, నాబార్డ్
Posted On:
03 DEC 2020 2:59PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం ప్రకటించిన అగ్రి ఎక్స్‌పోర్ట్ పాలసీ కింద నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడానికి వ్యవసాయరంగం, దాని ఎగుమతులు పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకుకేందుకు వివిధ స్టేక్ హొల్డర్ల సామర్ధ్యాల పెంపునకు వృత్తిపరమైన, ప్రత్యేక నైపుణ్యాలు అందించేందుకు పలు సంస్థలతో కలసి సమన్వయంతో పనిచేసేందుకు ఎపిఇడిఎ ప్రధానంగా దృష్టిపెట్టింది. వ్యవసాయ ఎగుమతుల పాలసీని వ్యవసాయ ఎగుమతుల ఆధారిత ఉత్పత్తి, ఎగుమతుల ప్రోత్సాహం, రైతులకు మెరుగైన ధర రాబడి, ప్రభుత్వ విధానాలు,, ప్రభుత్వ కార్యకలాపాలతో అనుసంధానం చేయడంపై దృష్టిపెడుతూ రూపొందించడం జరిగింది. ఇది రైతు కేంద్రిత విధానాన్ని అనుసరిస్తుంది. మూలంలోనే మెరుగైన రాబడి ఆర్జించడానికి ,విలువ జోడింపుపై వాల్యూ చెయిన్ లో నష్టాలు తగ్గించడంపై దృష్టిపెడుతుంది.దేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల ఆధారిత వ్యవసాయ జోన్లలో ఆయా ఉత్పత్తులకు ప్రత్యేకంగా క్లస్టర్ల ఏర్పాటుకు వివిధ సరఫరా సైడ్ అంశాలు పరిశీలించడం, భూసార పోషకాల యాజమాన్యం, ఉన్నత ఉత్పాదకత, మార్కెట్ ఆధారిత వివిధ రకాల పంటలను చేపట్టడం, మంచి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వంటివి ఇందులో ఉన్నాయి.ఎపిఇడిఎ ఎఇపి అమలుకు నిరంతరం రాష్ట్రప్రభుత్వాలతో సంప్రదిస్తున్నది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ, నాగాలాండ్, తమిళనాడు, అస్సాం, పంజాబ్ , కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇతర రాష్ట్రాలు ఇలాంటి ప్రణాళికలు సిద్ధం చేయడంలో వివిధ దశలలో ఉన్నాయి. 28 రాష్ట్రాలు , 4 కేంద్ర పాలిత ప్రాంతాలు నోడల్ ఏజెన్సీలను నామినేట్ చేశాయి.21 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా ఏర్పాటుచేయబడ్డాయి. 20 క్లస్టర్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. అవి పంజాబ్‌లోని బంగాళాదుంప క్లస్టర్ జిల్లాలు, ఉత్తరప్రదేశ్‌లో రెండు వేర్వేరు జిల్లాలు, రాజస్థాన్‌లో ఇసబగోల్, ఆరంజ్, దానిమ్మ, ద్రాక్ష, మహారాష్ట్రలో అరటి (3 జిల్లాలు), తమిళనాడు, కేరళలలో అరటి,ఉత్తరప్రదేశ్‌లో మామిడి, యుపి,గుజరాత్‌లో పాల ఉత్పత్తులు, కర్ణాటకలో రోజ్ ఉల్లి, యుపిలో తాజా కూరగాయలు, మధ్యప్రదేశ్‌లో ఆరంజ్, గుజరాత్‌లో బంగాళాదుంప (రెండు జిల్లాలు) . స్టేక్ హోల్డర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు క్లస్టర్లలో రెండు రౌండ్ల సమావేశాలు నిర్వహించారు. దీనిపై చర్చలు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎపిఇడిఎ, నాబార్డ్ సంస్థలు సంబంధిత తమ కేంద్ర కార్యాలయాల మధ్య ఆన్‌లైన్ వర్చువల్ పద్ధతిలో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ నైపుణ్యాన్ని పరస్పరం కలసి పనిచేయడం ద్వారా , తమ కార్యకలాపాలను పరస్పరం అనుసంధానం చేయడం ద్వారా సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయిందాయి. దీనితో స్టేక్ హోల్డర్లకు మెరుగైన విలువ తీసుకురానున్నారు.
ఎపిఇడిఎ ఛైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు, నాబార్డ్ ఛైర్మన్ డాక్టర్ జి.ఆర్. చింతల ఈ కార్యక్రమంలొ పాల్గొని ప్రసంగించారు. ఎపిఇడిఎ, నాబార్డ్ సంయుక్తంగా పరస్పరం సహకరించుకోవలసిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఎం.ఒ.యుపై డాక్టర్ సుధాంశు, సెక్రటరీ ఎపిఇడిఎ, నీలయ్ డి కపూర్ ఛీఫ్ జనరల్ మేనేజర్, నాబార్డ్ సంతకాలు చేశారు. ఆయా సంస్థల గురించి, పరస్పర సహకారానికి సంబంధించిన ముఖ్యాంశాలు...
నాబార్డ్:
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డవలప్‌మెంట్ సంస్థను వ్యవసాయం, చిన్న తరహా, కుటీర పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, చేతివృత్తులు, గ్రామీణ ప్రాంతాలలోని ఇతర అనుబంధ వృత్తుల వారికి రుణాలు అందించే అభివృద్ధి బ్యాంకుగా ఏర్పాటు చేశారు. సమగ్ర గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాలు సుంసంపన్నమయ్యేలా దీనితో సంబంధం ఉన్న వివిధ రంగాలను ప్రోత్సహించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. నాబార్డు చట్టం 1981 వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలకు సంబంధించి వివిధ సంస్థలతో కలిసి పనిచేసేందుకు వీలు కల్పిస్తుంది. రైతులకు సహాయం చేసేందుకు నిర్దేశించిన వివిధ పథకాలను నాబార్డు అమలు చేస్తుండడమే కాకుండా ఈ సంస్థకు క్షేత్రస్థాయిలో రెగ్యులర్ా మార్గనిర్దేశం చేసేందుకు ,రైతులకు మద్దతు నిచ్చేందుకు వివిధ పథకాలు ఉన్నాయి.
వివిధ రంగాలలో సహకారం:
ఎపిఇడిఎ, నాబార్డ్ సంస్థలు కలసి పనిచేస్తూ వివిధ స్టేక్‌హోల్డర్ల సామర్ధ్యాల పెంపునకు కృషిచేస్తాయి.
ఎపిఇడిఎ, నాబార్డ్ సంస్థలు ఔట్ రీచ్ కార్యక్రమాలు, అవేర్‌నెస్ కార్యక్రమాలు, స్టేక్ హోల్డర్లకు వర్క్‌షాపులు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
భారత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా, రైతుల రాబడి రెట్టింపు చేసేందుకు చర్యలు.
నాబార్డ్, ఎపిఇడిఎ కు సంబంధించిన వివిధ పథకాలు, చర్యల ప్రయోజనాలను ఎప్.పి.ఒల అభివృద్ధికి విస్తరింప చేయడం.
సహకార సంఆలు, ఎఫ్.పి.ఒలకు ఎగుమతులు ప్రోత్సహించడానికి ఎపిఇడిఎ షెడ్యూల్డు ఉత్పత్తులకు పంట కోత అనంతరం యాజమాన్యానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది.
తమ కార్యకలాపాలను విస్తృతం చేయడానికి వివిధ రాష్ట్రాలలో సంయుక్తంగా క్లస్టర్లను గుర్తిస్తారు.
ఎపిఇడిఎ సంస్థ నాబార్డ్ సహాయం చేసిన ,ప్రోత్సహించిన ఎఫ్.పి.ఒల ఉత్పత్తుల ఎగుమతులకు వీలు కల్పిస్తుంది.
****
(Release ID: 1678624)
Visitor Counter : 193