జల శక్తి మంత్రిత్వ శాఖ

దేశంలోని 128 జ‌లాశ‌యాల‌లో ప్ర‌త్య‌క్ష నిల్వ స్థితి

Posted On: 04 DEC 2020 5:03PM by PIB Hyderabad

దేశంలోని  128 జ‌లాశ‌యాల‌‌లో ప్ర‌త్య‌క్ష నిల్వ స్థితిని ప్ర‌తివారం కేంద్ర నీటి క‌మిష‌న్ ప‌ర్య‌వేక్షిస్తోంది. మొత్తం ఈ జ‌లాశ‌యాల‌లో 44 జ‌లాశ‌యాల‌కు 60 మెగావాట్ల‌కు మించిన వ్య‌వ‌స్థాపిత సామ‌ర్ధ్యంతో జ‌ల‌శ‌క్తి ప్ర‌యోజ‌నం ఉంది.  ఈ 128 జ‌లాశ‌యాల మొత్తం ప్ర‌త్య‌క్ష నిల్వ సామ‌ర్ధ్యం 172.132 బిసిఎంగా ఉంది. ఇది దేశంలో సృష్టించార‌ని అచ‌నా వేస్తున్న మొత్తం ప్ర‌త్య‌క్ష నిల్వ సామ‌ర్ధ్య‌మైన 257.812 బిసిఎంలో 66.77%గా ఉంది. డిసెంబ‌ర్ 3, 2020న విడుద‌ల చేసిన జ‌లాశ‌య నిల్వ నివేదిక ప్ర‌కారం ఈ జ‌లాశ‌యాల‌లో అందుబాటులో ఉన్న నిల్వ స్థితి 136.866 బిసిఎంగా ఉంది. ఇది ఈ జ‌లాశ‌యాల మొత్తం ప్ర‌త్య‌క్ష నిల్వ సామ‌ర్ధ్యంలో 80%. కాగా, గ‌త ఏడాది ఈ జ‌లాశ‌యాల‌లో ఇదే కాలానికి అందుబాటులో ఉన్న నిల్వ స్థితి 146.024 మ‌బిసిఎం. గ‌త 10 ఏళ్ల స‌గ‌టు నిల్వ స్థితి 114.439బిఎసిం.క‌నుక‌, 3-12-2020 నివేదిక‌ల ప్ర‌కారం 128 జ‌లాశ‌యాల‌లో అందుబాటులో నిల్వ స్థితి గ‌త ఏడాదితో పోలిస్తే 94% కాగా, గ‌త ప‌ది ఏళ్ళ స‌గ‌టు క‌న్నా 120% ఎక్కువ సామ‌ర్ధ్యాన్ని క‌లిగి ఉన్నాయి.

ప్రాంతాల‌వారీగా నిల్వ స్థితి వివ‌రాలు దిగువ‌న ఇవ్వ‌డం జ‌రిగిందిః 

ఉత్త‌ర ప్రాంతంలో హిమాచల్ ప్ర‌దేశ్‌, పంజాబ్‌, రాజ‌స్థాన్ ఉన్నాయి. కేంద్ర జ‌ల క‌మిష‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో 8 జ‌లాశ‌యాలు మొత్తం 19.17 బిసిఎం నిల్వ స్థితిత‌తో ఉన్నాయి. జ‌లాశ‌య నిల్వ స్థితి నివేదిక‌, డిసెంబ‌ర్ 3, 2020 ప్ర‌కారం, ఈ జ‌లాశ‌యాల‌లో అందుబాటులో ఉన్న ప్ర‌త్య‌క్ష నిల్వ స్థితి 10.66 బిసిఎం. ఇది ఈ జ‌లాశ‌యాల మొత్తం ప్ర‌త్య‌క్ష నిల్వ స్థితిలో 56%. గ‌త ఏడాది ఇదే కాలం నిల్వ‌తో పోలిస్తే ఇది 69%  కాగా, గ‌త ప‌దేళ్ళ‌లో ఈ జ‌లాశ‌యాల స‌గ‌టు నిల్వ స్థితి సామ‌ర్ధ్యంతో పోలిస్తే 78% ‌. 
తూర్పు ప్రాంతంలో జార్ఖ‌డ్‌, ఒడిషా, ప‌శ్చిమ బెంగాల్‌, త్రిపుర‌, నాగాలాండ్ ఉన్నాయి. కేంద్ర జ‌ల‌వ‌న‌రుల క‌మిష‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ కింద 19,65 బిసిఎం నిల్వ స్థితి సామ‌ర్థ్యం క‌లిగిన‌19 జ‌లాశ‌యాలు ఉన్నాయి, జ‌లాశ‌య నిల్వ స్థితి నివేదిక‌, డిసెంబ‌ర్ 3, 2020 ప్ర‌కారం, ఈ జ‌లాశ‌యాల‌లో అందుబాటులో ఉన్న ప్ర‌త్య‌క్ష నిల్వ స్థితి 13.90 బిసిఎంగా ఉంది, ఇది ఈ జ‌లాశ‌యాల ప్ర‌త్య‌క్ష నిల్వ స్థితి సామ‌ర్థ్యంలో 71%. గ‌త ఏడాది ఇదే కాలంలో ఉన్న నిల్వ స్థితితో పోలిస్తే ఇది 78%. అలాగే, గ‌త ప‌ది ఏళ్ళ‌లో ఈ జ‌లాశ‌యాల స‌గ‌టు ప్ర‌త్య‌క్ష నిల్వ స్థితి క‌న్నా 72%. 
ప‌శ్చిమ ప్రాంతంలో గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర జ‌ల‌వ‌న‌రుల క‌మిష‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ కింద మొత్తం 35.24 బిసిఎం ప్ర‌త్య‌క్ష నిల్వ స్థితి సామ‌ర్థ్యంతో 42 జ‌లాశ‌యాలు ఉన్నాయి. జ‌లాశ‌య నిల్వ స్థితి నివేదిక‌, డిసెంబ‌ర్ 3, 2020 ప్ర‌కారం, ఈ జ‌లాశ‌యాల‌లో అందుబాటులో ఉన్న ప్ర‌త్య‌క్ష నిల్వ స్థితి 31.39% బిసిఎం, ఇది ఈ జ‌లాశ‌యాల మొత్తం ప్ర‌త్య‌క్ష నిల్వ స్థితి సామ‌ర్థ్యంలో 89%.  అలాగే, గ‌త ఏడాది ఇదే కాలంలో ఉన్న సామ‌ర్థ్యంతో పోలిస్తే ఇది 94% కాగా, గ‌త ప‌దేళ్ళ‌లో ఇదే కాలంలోని ఈ జ‌లాశ‌యాల ని స‌గ‌టు నిల్వ స్థితి సామ‌ర్థ్యంతో పోలిస్తే 66%గా ఉంది.
కేంద్ర ప్రాంతంలో ఉత్త‌ర ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, మ‌ధ్య ప్ర‌దేశ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర జ‌ల‌వ‌న‌రుల క‌మిటీ ప‌ర్య‌వేక్ష‌ణ కింద మొత్తం 45.27 బిసిఎం ప్ర‌త్య‌క్ష నిల్వ స్థితి సామ‌ర్ధ్యం క‌లిగిన 23 జ‌లాశ‌యాలు ఉన్నాయి. జ‌లాశ‌య నిల్వ స్థితి నివేదిక‌, డిసెంబ‌ర్ 3, 2020 ప్ర‌కారం,  జ‌లాశ‌యాల మొత్తం నిల్వ సామ‌ర్ధ్యంలో 83% క‌లిగి, మొత్తం నిల్వ‌స్థితి సామ‌ర్థ్యం 37.64 బిసిఎంగా ఉంది. గ‌త ఏడాది ఇదే కాలంలో ఉన్న నిల్వ స్థితితో పోలిస్తే 86%కాగా, గ‌త ప‌దేళ్ళ కాలంలో ఇదే కాలంలో ఈ జ‌లాశ‌యాల‌ ప్ర‌త్య‌క్ష నిల్వ సామ‌ర్థ్యంలో 70%గా ఉంది.
ద‌క్షిణ ప్రాంతంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, ఎపి& టిజి (రెండు రాష్ట్రాల‌లో 2 ఉమ్మ‌డి ప్రాజెక్టులు), క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాలు వ‌స్తాయి. కేంద్ర జ‌ల‌వ‌న‌రుల క‌మిష‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మొత్తం 52.81 బిసిఎం నిల్వ స్థితి సామ‌ర్థ్యం క‌లిగిన 36 జ‌లాశ‌యాలు ఉన్నాయి. జ‌లాశ‌య నిల్వ స్థితి నివేదిక‌, డిసెంబ‌ర్ 3, 2020 ప్ర‌కారం, ఈ జ‌లాశ‌యాల మొత్తం ప్ర‌త్య‌క్ష నిల్వ స్థితి సామ‌ర్థ్యంలో 82%మైన 43.28 బిసిఎం నిల్వ‌లు అందుబాటులో ఉన్నాయి. గ‌త ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 83%, గ‌త ప‌దేళ్ళ‌లో ఇదే కాలంలో ఈ జ‌లాశ‌యాల‌లో ప్ర‌త్య‌క్ష‌నిల్వ స్థితి సామ‌ర్థ్యంలో 61%గా ఉంది.

***



(Release ID: 1678471) Visitor Counter : 108