మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
న్యూడిల్లీలో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ .
జమ్ము కాశ్మీర్ , లెహ్,కార్గిల్ లలో త్వరలోనే వక్ఫ్ బోర్డుల ఏర్పాటు : కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి
Posted On:
04 DEC 2020 3:18PM by PIB Hyderabad
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ముక్తార్ అబ్బాస్ నక్వి ఈరోజు న్యూఢిల్లీలో మాట్లాడుతూ, జమ్ముకాశ్మీర్, లెహ్-కార్గిల్‌లలో వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వక్ఫ్ బోర్డుల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్టు ఆయన తెలిపారు.
న్యూఢిల్లీలో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం మాట్లాడుతూ ఆయన, స్వాతంత్ర్యానంతరం తొలిసారిగా జమ్ముకాశ్మీర్, లెహ్-కార్గిల్‌లలో వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుతోనే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు.
జమ్ము కాశ్మీర్, లెహ్-కార్గిల్‌లలోని వక్ఫ్ ఆస్తులను సక్రమంగా సమాజ సంక్షేమం కోసం ఉపయోగించేందుకు ఈ వక్ఫ్‌బోర్డులు ఉపయోగపడతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమ్ (పిఎంజెవికె) కింద జమ్ము కాశ్మీర్, లెహ్ కార్గిల్ వక్ఫ్ ఆస్తులలో సామాజిక ఆర్ధిక మౌలిక సదుపాయాల నిర్మాణానికి తగినంత ఆర్దిక సహాయం కేంద్ర ప్రభుత్వం అందించనుంది.
జమ్ము కాశ్మీర్, లెహ్ కార్గిల్‌లో వేలాది వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని, ఈ వక్ఫ్ ఆస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని ఆయన తెలిపారు. వక్ఫ్ ఆస్తుల డిజిటైజేషన్, జియో టాగింగ్, జిపిఎస్ మ్యాపింగ్ వంటి వాటిని ప్రారంభించామని, ఇందుకు సంబంధించిన పని త్వరలోనే పూర్తి అవుతుందని చెప్పారు.
పలు రాష్ట్రాలలో వక్ఫ్ మాఫియాలు వక్ఫ్ ఆస్తుల ఆక్రమణకు పాల్పడడం , దుర్వినియోగం చేస్తుండడాన్ని ఈరోజు జరిగిన సమావేశం తీవ్రంగా పరిగణించినట్టు శ్రీ నక్వీ చెప్పారు. సెంట్రల్ వక్ఫ్ బృందాలు ఇందుకు సంబంధించి రాష్ట్రాలను సందర్శించనున్నట్టు ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమ్ (పిఎంజెవికె) కింద జమ్ము కాశ్మీర్, లెహ్-కార్గిల్ ప్రాంతంలో వక్ఫ్ భూమిలో కనీస మౌలిక సదుపాయాల కల్పన ఉపాధి సంబంధిత నైపుణ్యాలను ఉద్దేశించిన కేంద్రాలు, కామన్ సర్వీసు సెంటర్ల ఏర్పాటు, హునార్ హబ్‌లు, సద్భావ్ మండపాలు, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లు, ఆస్పత్రులు, బాలికల హాస్టళ్లు, ఐటిఐ, పాలిటెక్నిక్‌లు, కళాశాలలు, పాఠశాలల నిర్మాణం వంటి వాటిని దేశంలోని ఇతర ప్రాంతాలలో చేపట్టినట్టుగానే చేపట్టడం జరుగుతుంది. ఈ మౌలిక సదుపాయాలు అవసరమైన వారికి నాణ్యమైన విద్యను అందిస్తాయని, ప్రత్యేకించి బాలికలకు విద్యను అందించడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదట సారిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ భూములలో ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమ్ కింద దేశంలోని వెనుకబడిన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలకు నోచుకోని ప్రాంతాలలో నూరు శాతం నిధులతో పాఠశాలల అభివృద్ధి , కాలేజీలు, ఐటిఐలు, పాలిటెక్నిక్‌లు, బాలికల హాస్టళ్లు, ఆస్పత్రులు, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లు సద్బావనా మండప్, హునార్ హబ్, కామన్ సర్వీస్ సెంటర్లు, ఉపాధి కల్పనకుఉపయోగపడే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.
ఇంతకు ముందు దేశంలో 90 జిల్లాలను మాత్రమే మైనారిటీల అభివృద్ధికి గుర్తించడం జరిగిందని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అభివృద్ధి కార్యక్రమాల జాబితాను 308 జిల్లాలకు, 870 బ్లాక్‌లకు 331 పట్టణాలకు విస్తరించడం జరిగిందని అన్నారు.
దేశంలో 6 లక్షలా 64 వేల రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని చెప్పారు. అన్ని వక్ఫ్ ఆస్తుల డిజిటైజేషన్ పూర్తి అయింది. జియో ట్యాగింగ్, వక్ఫ్ ఆస్తుల జిపిఎస్ మ్యాపింగ్ వంటివి యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. 32 రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు.
గత ఆరు సంవత్సరాలలో శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాజిక ఆర్ధిక విద్యా పరమైన ఉపాధి సంబంధిత మౌలిక సదుపాయాలను దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టులలో 1523 కొత్త పాఠశాల భవనాలు, 22,877 అదనపు తరగతి గదులు, 646 హాస్టళ్లు, 163 రెసిడెన్షియల్ పాఠశాలలు, 9213 స్మార్ట్ క్లాస్ రూమ్‌లు, (కేంద్రీయ విద్యాలయాలతో సహా), 32 కాలేజీలు, 95 ఐటిఐలు, 13 పాలిటెక్నిక్‌లు, 6 నవోదయ విద్యాలయాలు, 403 మల్టీపర్పస్ కమ్యూనిటీ సెంటర్ సద్భావనా మండపాలు, 574 మార్కెట్ షెడ్లు, 2842 టాయిలెట్ సదుపాయాలు, నీటి సదుపాయాలు, 140 కామన్ సర్వీస్ సెంటర్లు, 22 వర్కింగ్ ఉ మన్ హాస్టళ్లు,1926 హెల్త్ ప్రాజెక్టులు, 5 ఆస్పత్రులు, 8 హునార్ హబ్‌లు, 14 వివిధ క్రీడా ఫెసిలిటీలు, 6014 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.
***
(Release ID: 1678350)
Visitor Counter : 182