యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
బ్రిక్స్ యువ సదస్సునుద్దేశించి కేంద్ర క్రీడ, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ప్రసంగం. కోవిడ్ -19 సమయంలో భారతీయ యువ వాలంటీర్లు అందించిన సేవలను ప్రశంసించిన కేంద్ర మంత్రి.
Posted On:
02 DEC 2020 5:39PM by PIB Hyderabad
బ్రిక్స్ దేశాలకు చెందిన ఆరవ యువ సదస్సును, బ్రిక్స్ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాలశాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజుజు ప్రసంగించారు. విర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కరనో మహమ్మారిని పారద్రోలడంలో ప్రపంచవ్యాప్తంగా యువతీయువకులు పోషిస్తున్న పాత్ర, ప్రాధాన్యతల గురించి ఆయన మాట్లాడారు.
ఇలాంటి పరిస్థితుల్లో భారతీయు యువతీ యువకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొని , అనేక అవాంతరాలను జయించి తమ ప్రాంతాల్లోని ప్రజలకు అండగా నిలిచారని కేంద్ర మంత్రి ప్రశంసించారు. భారతదేశంలో పదిలక్షలకు పైగా వాలంటీర్లు ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేసే కార్యక్రమాల్లో నేరుగా పాల్గొని సేవలందించారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మహమ్మారి తదనంతర పరిస్థితుల్లోను వారి సేవలు కొనసాగుతున్నాయని అన్నారు.
నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ( ఎన్ వై కె ఎస్), జాతీయ సేవా పథకం ( ఎన్ ఎస్ ఎస్ ) భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కు చెందిన యువతీయువకులు ముందు వరసలో నిలిచి కోవిడ్ 19పై పోరాటంలో పాల్గొన్నారని ఆయన అన్నారు. అనేక పౌర సంస్థలతో కలిసి తమ తమ ప్రాంతాల్లోని వృద్ధులకు, పేదవారికి సేవలందించారని తెలిపారు. భారతీయ వాలంటీర్ల సేవలకు అన్ని వైపులనుంచి ప్రశంసలు లభించాయని వివరించారు.
స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు సంబంధించి పెట్టుకున్న ఉమ్మడి లక్ష్యాలను బలోపేతం చేయడానికిగాను బ్రిక్స్ దేశాల శక్తియుక్తులను ఉపయోగించాల్సిన ఆవశ్యకత గురించి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ రిజిజు తన ప్రసంగంలో తెలిపారు. సేవా తత్పరతద్వారా శాంతి, అభివృద్ధిని సాధించాలని అన్నారు. ఆరోగ్యరంగ విద్య, సాంస్కృతిక, కళా రంగాల్లోను, వాణిజ్యం ఇతర రంగాల్లోను బ్రిక్స్ దేశాలు దృఢంగా ఐకమత్యంగా నిలిచి సవాళ్లను ఎదుర్కొవాలని, ఆయా రంగాల్లోని ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవాలని కేంద్రమంత్రి పేర్కొన్నారు. స్వచ్ఛ సేవారంగానికి సంబంధించిన దృఢమైన మౌలిక సదుపాయాల వ్యవస్థలను తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి మంత్రి వివరించారు. బ్రిక్స్ దేశాలు ముందడుగు వేయడానికి ఇది కీలకమని అన్నారు.
బ్రిక్స్ దేశాల సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చూపుతున్న నిబద్దత, ఆయన ఆదర్శాల ప్రకారం ముందుకు పోవడానికిగాను దేశం నిబద్దతతో పని చేస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాలకోసం, ప్రజలకు సేవ చేయడానికిగాను యువత సేవలను ఉపయోగించుకోవడంలో భారతదేశం నిబద్దతతో పని చేస్తోందని మరో సారి కేంద్రమంత్రి చాటారు.
***
(Release ID: 1677884)
Visitor Counter : 219