ఆర్థిక మంత్రిత్వ శాఖ
పశ్చిమ బెంగాల్లో ప్రజా ఆర్థిక సంస్కరణల డిజిటల్ వేదికల అభివృద్ధి కోసం 50 మిలియన్ డాలర్ల రుణ పత్రాలపై సంతకాలు చేసిన ఆసియా అభివృద్ధి బాంకు(ఎడిబి) మరియు భారత్
Posted On:
02 DEC 2020 4:50PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆర్థిక యాజమాన్య ప్రక్రియలు మరియు విత్త సంబంధిత పొదుపు మరింత మెరుగుపరచడం కోసం, తెలియపరచబడిన నిర్ణయాలను ప్రోత్సహించడంలో మరియు సంబంధిత సేవలను మరింత మెరుగ్గా అందజేయడం కోసం విధాన పరమైన రుణ పత్రాలపై ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఎడిబి) భారత ప్రభుత్వం సంతకాలను చేశాయి.
సంబంధిత రుణ పత్రాలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆర్థిక యాజమాన్య పెట్టుబడి కార్యక్రమం కోసం భారత ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభా గానికి అదనపు కార్యదర్శి డా. సి. ఎస్. మహాపాత్ర మరియు ఎడిబి తరఫున ఎడిబి ఇండియా రెసిడెంట్ మిషన్ సంచాలకులు శ్రీ. టకియో కోనిషి సంతకాలు చేసారు.
రాష్ట్రం యొక్క ఆర్థిక మరియు సమాచార విధానాన్ని సమన్వయ పరచడం ద్వారా ప్రభుత్వ సేవలను మెరుగు పరచడానికి మరియు విత్త సంబంధిత పొదుపును పెంచడం తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిపుష్టిని పెంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని డా. మహాపాత్ర అన్నారు. శ్రీ కోనిషి మాట్లాడుతూ ఇ-గవర్నమెంట్ వేదికలు మరియు ఈ కార్యక్రమం రెండూ కలిసి పనిచేయడం ద్వారా పింఛనులు మరియు భవిష్య నిధి, లింగాధారంగా విభజించబడిన సమాచారం, పన్ను చెల్లింపులు మరియు రెవన్యూ వసూళ్ళ వంటి సామాజిక లబ్దికి చెందిన అంశాలకు రక్షణ లభిస్తుంది.
సమగ్ర ఆర్థిక యాజమాన్య పద్దతి(ఐఎఫ్ఎంఎస్)లోని క్రొత్త మాడ్యూల్ సహాయంతో అభివృద్ధి ప్రాజెక్టుల పనితీరును మరింత మెరుగ్గా సమీక్షించవచ్చును. ప్రజలకు-ప్రభుత్వానికి మధ్యన నమ్మకమైన వారధి కోసం ప్రభుత్వాధికారులు మరింత సమర్థవంతంగా పనిచేయుట కోసం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరియు గ్రామీణ స్థానిక సంస్థల మధ్యన సరైన సమాచార ప్రసారం కోసం ప్రజల వినతులను పరిష్కరించే వెబ్ సంబంధిత విధానం ఏర్పాటు చేసే సమయంలో , విత్త సంబంధిత మరియు ప్రభుత్వ ఆర్థిక విధానాల కేంద్రాన్ని ఏర్పాటుచేయబడుతుంది.
ఈ రుణం 2012 మరియు 2017లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ ఆర్థిక యాజమాన్య సంస్కరణలకు సహాయకారిగా, ఎడిబి యొక్క గత విధానపరమైన కార్యక్రమాలకు అనుగుణంగా ఉంటుంది. ఐఎఫ్ఎంఎస్ ను అభివృద్ధి పరిచి అమలు పరచడంలో సహకరించడం, ఇ-గవర్నెన్స్ పద్దతి ద్వారా మెరుగుపరచబడిన రెవెన్యూ పాలనా విధానం, ఖర్చు సక్రమం వ్యవస్థీకరణకు తీసుకున్న చర్యలు మరియు సేవల రంగంలో ప్రైవేటు వారి యొక్క ప్రమేయాన్ని ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమాలు సహకరిస్తాయి. సామర్థ్యం పెచుకోవడం, ఐఎఫ్ఎంఎస్ సంస్కరణలను సమీక్షించడం, సంస్కరణలు చేపట్టిన ప్రాంతాల్లో సామాజిక మరియు లింగ సమానత్వాన్ని మరింత బలోపేతం చేయడం కోసం 350,000 డాలర్ల అనుబంధిత రుణం ప్రతిపాదించబడింది.
ఆసియా మరియు పసిఫిక్ దేశాల్లో పేదరికాన్ని నిర్మూలించి ప్రజలు శేయస్సుతో సంఘటితంగా సుస్థిర అభివృద్ధి సాధించే లక్ష్యంతో 1996లో స్థాపించబడిన ఏడిబి పనిచేస్తోంది. 68 మంది సభ్యులు గల ఈ బ్యాంకులో 49 మంది ఈ రెండు ప్రాంతాలకు చెందినవారే.
***
(Release ID: 1677837)
Visitor Counter : 225