భారత పోటీ ప్రోత్సాహక సంఘం
శ్రీకాళహస్తి పైప్స్ విలీనానికి సిసిఐ ఆమోదముద్ర
Posted On:
01 DEC 2020 1:10PM by PIB Hyderabad
ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్ (ఇ సి ఎల్) లో శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ (ఎస్ పి ఎల్) ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. విలీనం కావటానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదముద్ర వేసింది. కాంపిటిషన్ చట్టం, 2002 లోని సెక్షన్ 31(1) కింద ఈ విలీనానికి సిసిఐ ఈరోజు ఆమోదం తెలియజేసింది.
ఇసిఎల్ భారత్ లో ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇది ఎలక్ట్రో స్టీల్ కంపెనీల గ్రూప్ కు హోల్డింగ్ కంపెనీ. ప్రధానంగా ఇది డక్టైల్ ఐరన్ పైపులు, డక్టైల్ ఐరన్ ఫిటింగ్స్, పోత ఇనుము పైపుల తయారీ, సరఫరాలో నిమగ్నమై ఉండే సంస్థ. ఎస్ పి ఎల్ అనేది కూడా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇది ఎలక్ట్రో స్టీల్ గ్రూప్ లో భాగం. డక్తైల్ ఐరన్ పైప్ ల తయారీ, పంపిణీలో నిమగమై ఉండే కంపెనీ.
ఇప్పుడు ప్రతిపాదించిన ఇ సి ఎల్ తో ఎస్ పి ఎల్, విలీనం వల్ల ఎస్ పి ఎల్ అనే కంపెనీ పూర్తిగా రద్దవుతుంది. ఇసిఎల్ అనే కంపెనీ మాత్రమే మనుగడలో ఉంటుంది.
సవివరమైన సిసిఐ ఆదేశాలు త్వరలో వెలువడతాయి.
***
(Release ID: 1677358)
Visitor Counter : 138