ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు పాత ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఇండియన్ రెడ్ క్రాస్‌సొసైటీతో కలిసి మాస్కులు, సబ్బులు పంచిపెట్టారు
మనం కోవిడ్‌పై పోరాటంలో త్వరలోనే 11 నెలలు పూర్తి చేసుకోబోతున్నాం. మనం పోరాటం మొదలు పెట్టినప్పటి నుంచి మన పెద్ద ఆయుధం మాస్కు, శానిటైజర్.
Posted On:
30 NOV 2020 1:45PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సిఎస్) ఛైర్మన్ డాక్టర్‌హర్షవర్దన్ ఈరోజు పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మాస్కులు, సబ్బులు పంచారు. మాస్కు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ డాక్టర్ హర్షవర్ధన్,“ మనం కోవిడ్ పై పోరాటంలో త్వరలోనే 11 నెలలు పూర్తి చేయబోతున్నాం.అప్పటినుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం అనుసరిస్తూ, ఇతరులు అనుసరించాల్సిందిగా కోరుతున్న అత్యంత ముఖ్యమైన మౌలిక సూత్రం పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం, కోవిడ్‌పై పోరాటంలో మన అత్యంత ముఖ్యమైన ఆయుధం మాస్కు, శానిటైజర్”
కార్యక్రమానికి హాజరైన ప్రతిఒక్కరూ మాస్కుధరించి ఉండడం పట్ల డాక్ఠర్‌హర్షవర్ధన్ అభినందించారు. “ మాస్క్, సబ్బు పంపిణీ వెనుక ఒక పెద్ద సందేశం ఉందని, దీని లక్ష్యం ఈ సందేశాన్ని మరింత ముందుకు తీసుకుపోవడమని ఆయన అన్నారు. ప్రభుత్వం వివిధ మార్గాలు, వివిధ కార్యకలాపాల ద్వారా కోవిడ్ వ్యతిరేక పోరాటంలో ముఖ్యభాగమైన శానిటైజర్ వాడడం మాస్కుధరించడం, రెండు గజాల దూరం పాటించడం సందేశాన్ని ముందుకు తీసుకుపోతున్నదని చెప్పారు. కూలీలు, టాక్సీయూనియన్లు త్రిచక్రవాహన యూనియన్లు ఈవిషయంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించనున్నాయని ఆయన అన్నారు.
ఇండియాలో కోవిడ్ పరిస్థితి గురించి మాట్లాడుతూ డాక్టర్ హర్ష వర్ధన్, కోవిడ్ పారామీటర్లలో సాధించిన ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే ఇండియాలో అత్యంత ఎక్కువ కోవిడ్ రికవరీలు ఉ న్నాయని ఆయన అన్నారు. 2020 జనవరిలో ఒకే ఒక ల్యాబ్ ఉ న్నదశ నుంచి ప్రస్తుతం మనంకు 2,165 ల్యాబ్‌లు ఉన్నాయన్నారు. రోజూ మిలియన్ మంది ప్రజలకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికి 14 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్నారు. ఇదంతా ప్రభుత్వ నిరంతర కృషి, పట్టుదల మన కరోనాపై పోరాటయోధుల కృషి కి నిదర్శనమన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీజీ మార్గనిర్దేశనంలో ఇండియా మాస్కులు, పిపిఇ కిట్లు, వెంటిలేటర్ల తయారీలో స్వావలంబన సాధించింది. 10 లక్షలకు పైగా పిపిఇ కిట్లు రోజూ ఇండియాలో తయారౌతున్నాయి. ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు వాక్సిన్ పరిశోధనలో కీలక భూమిక పోషిస్లున్నారు.ఇది సకాలంలో అందుబాటులోకి వస్తుంది అని ఆయన అన్నారు.
దో గజ్ కీ దూరి పద్ధతిని పాటించాల్సిందిగా డాక్టర్ హర్షవర్ధన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక చిన్న నిర్లక్ష్యం,పొరపాటు తో తీవ్ర సమస్యలు ఏర్పడతాయి. ప్రపంచంలో మనదేశంలో మరణాల రేటు తక్కువ ఉన్నప్పటికీ, ఒక్కరు వ్యాధికి గురై మరణించినా అది వారి మిత్రులు, కుటుంబానికి ఎంతో నష్టం.ఇది నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ చేస్తున్న విజ్ఞప్తి . ఈ సందేశాన్ని మీరు వీలైనంత ఎక్కువ మందికి వ్యాప్తి చేయండి అని ఆయన అన్నారు.
ఐఆర్‌సిఎస్ సెక్రటరీ జనరల్ ఆర్..కె.జైన్, ఢిల్లీ డి.ఆర్.ఎం ఎస్.సి. జైన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(Release ID: 1677197)
Visitor Counter : 168