రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే మార్గ విద్యుదీకరణకు మరింత ఊతం
అజ్మీర్ -ఢిల్లీ మధ్యగల క్లిష్టమైన దిఘావర-బండికుయి రైల్వే మార్గం విద్యుదీకరణ పూర్తి
ఎన్‌సిఆర్ ప్రాంతం డీజిల్ ఇంజిన్ రహితం దిశగా కీలక అడుగు
నేషనల్ కేపిటల్ ప్రాంతాన్ని ఇది పరిశుభ్రమైన, హరిత పర్యావరణానికి దోహదం చేయనుంది.
కేంద్ర రైల్వే, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖమంత్రి శ్రీపియూష్
గోయల్ కొత్తగా విద్యుదీకరణ చేసిన వాయవ్య రైల్వేలోని ధిఘావర- బండికుయి సెక్షన్‌ను ప్రారంభించారు. కొత్తగా విద్యుదీకరణ చేసిన మార్గంలో జెండా ఊపి తొలిరైలును ప్రారంభించారు.
భారతీయ రైల్వే డిసెంబర్ 2023లోగా బ్రాడ్‌గేజ్ నెట్‌వర్క్ విద్యుదీకరణను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.
66 శాతం బ్రాడ్‌గేజ్ మార్గం ఇప్పటికే విద్యుదీకరణ పూర్తి అయింది.
18,065 కిలోమీటర్ల విద్యుదీకరణతో రైల్వే 2014-2020 మధ్య 2009-14 మధ్యకాలంతో పోలిస్తే 371 శాతం విద్యుదీకరణను పెద్ద ఎత్తున పూర్తి చేసింది.
20203 డిసెంబర్ నాటికి 28143 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌విద్యుదీకరణను లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే
ఇప్పటికే 41,500 కి
Posted On:
29 NOV 2020 6:23PM by PIB Hyderabad
వాయవ్య రైల్వేలో కొత్తగా విద్యుదీకరణ పూర్తి చేసుకున్న దిఘావర- బందికుయి మార్గాన్ని కేంద్ర రైల్వే, వాణిజ్యం. పరిశ్రమలు, ఆహార,ప్రజాపంపిణీ శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జండా ఊ పి ఈ మార్గంలో తొలి రైలును ఆయన ప్రారంభించారు. దిఘావర రైల్వే స్టేష|న్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేవారు. ప్రజా ప్రతినిధులు, సీనియర్ రైల్వే అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రైల్వే, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్, ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజని, ఈ ప్రత్యేక దినం గురునానక్‌జయంతి కంటే ముందే వచ్చిందని ఆయన అన్నారు . ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో , రైల్వే అద్భుతమైన వేగం, నాణ్యతతో దశలవారీగా ముందుకు సాగుతున్నదని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, సమష్టి కృషి, టీమ్‌వర్క్, ప్రేరణతో ఇది గొప్ప విజయాలను సాధిస్తున్నదని అన్నారు.
రైల్వే పనుల గురించి ప్రత్యకంగా ప్రస్తావిస్తూ శ్రీ గోయల్, రాజస్థాన్‌లోని కోట-ముంబాయి మార్గంలో 35 సంవత్సరాల క్రితం విద్యుదీకరణ పనులు జరిగాయని కానీ ఆ తర్వాత ఎవరూ దీనిపై దృష్టిపెట్టలేదన్నారు. రైల్వేలో దీనిపై దృష్టిపెట్టి మొత్తం భారతదేశంలో రైల్వే లైన్‌నెట్ వర్క్‌ను విద్యుదీకరించడంపై టార్గెట్‌ను నిర్ణయించినట్టు తెలిపారు.రాజస్థాన్‌గురించి ప్రస్తావిస్తూ, 2009-14 వరకు ఈ ప్రాంతంలో ఒక్క కిలోమీటర్ కూడా విద్యుదీకరణ జరగలేదని, 2020 సెప్టెంబర్ వరకు 1433 కిలోమీటర్ల రైలుమార్గం గత ఐదు సంవత్సరాలలో విద్యుదీకరణను పూర్తి చేసుకున్నదన్నారు. అంటే ప్రతి సంవత్సరం సుమారు 240 కిలోమీటర్ల విద్యుదీకరణను పూర్తి చేసుకున్నదన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆలోచనలో మార్పు వచ్చిందని, మనం పనిచేసే తీరులోనూ మార్పు కనిపిస్తోందని అన్నారు. ఈరోజు ఈ మార్గం విద్యుదీకరణతో రెవారినుంచి అజ్మీర్ వరకు విద్యుదీకరణ పూర్తి అయినట్టు అయిందని, ఇక త్వరలోనే ఢిల్లీనుంచి అజ్మీర్‌కు విద్యుత్‌తో నడిచే రైళ్లు మొదలౌతాయని ఆయన అన్నారు. ఈ రైళ్లు మొదలైన తర్వాత డీజిల్ రైళ్లు నిలిచిపోతాయన్నారు. ఇది కాలుష్యాన్ని తొలగిస్తుందని, అలాగే ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని అన్నారు. విద్యుత్‌తో నడిచే రైళ్లు దేశీయంగా స్వావలంబిత భారత్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో నడుస్తాయన్నారు. ఇది పెద్ద ఎత్తున నిధులను ఆదాచేయనున్నదన్నారు. దీనితోపాటు రైళ్ల సగటు వేగం పెరగనున్నదని, పరిశ్రమలు అభివృద్ధి, వ్యవసాయ ఆధారత వ్యాపారం, గ్రామాల ప్రగతి, రైతుల ప్రగతి సాధ్యం కానున్నదన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కు కిసాన్ రైలును నడపనున్నట్టు మంత్రి తెలిపారు.ప్రభుత్వం రైతుల ప్రగతికి కట్టుబడి ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాల్సిందిగా గోయల్‌విజ్ఞప్తి చేశారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రతను పాటించడం వంటి వాటిని తప్పకుండా పాటించాలన్నారు.
రైలు మార్గ విద్యుదీకరణను సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ (సిఒఆర్ి), ప్రయాగ్‌రాజ్ చేపడుతుంది. ఢిల్లీ సరాయి రొహిల్లా- మదార్ (అజ్మీర్) సెక్షన్ ను సిఒఆర్ ఇ మంజూరు చేసి, రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టు జైపూర్‌కు బదలాయించింది. ఢిల్లీ సరాయ్ రొహిల్లా- మదార్(అజ్మీర్) మార్గంలో 23,418 ఫౌండేషన్లు , 26 స్విచింగ్ స్టేషన్లు, 6 ట్రాక్షన్‌సబ్ స్టేషన్లు , 7 ఒహెచ్ఇ డిపోలు ఏర్పాటు చేశారు.
***
(Release ID: 1677105)
Visitor Counter : 154