రక్షణ మంత్రిత్వ శాఖ
ఎజిమలాలోని ఇండియన్ నావల్ అకాడమీలో ఆటమన్ టర్మ్- 2020 పాసింగ్ అవుట్ పరేడ్
Posted On:
28 NOV 2020 5:06PM by PIB Hyderabad
ఎజిమలాలోని ఇండియన్ నావల్ అకాడమీలో ఈ రోజు (నవంబరు 28వ తేదీన) 'ఆటమన్ టర్మ్- 2020' పాసింగ్ అవుట్ పరేడ్ (పీఓపీ) అద్భుతంగా జరిగింది. మొత్తం 164 మంది ట్రైనీలు తమ శిక్షణ పూర్తిచేసుకున్న అధికారులు పీఓపీలో పాలుపంచుకున్నారు. మిడ్‌షిప్‌మెన్ (99వ ఐఎన్ఏసీ, ఐఎన్ఏసీ-ఎన్‌డీఏ), భారత నేవీకి చెందిన క్యాడెట్లు (30వ నేవల్ ఓరియంటేషన్ కోర్స్ ఎక్స్‌టెండెడ్) మరియు శ్రీలంక నావికాదళానికి చెందిన ఇద్దరు అంతర్జాతీయ ట్రైనీలు కూడా ఈ శిక్షణను పూర్తి చేసుకొని పీఓపీలో పాలుపంచుకున్నారు. పీఓపీ కవాతును జనరల్ మనోజ్ ముకుంద్ నారావణే, పీవీఎస్ఎమ్, ఏవీఎస్ఎమ్, ఎస్ఎమ్, వీఎస్ఎమ్, ఏడీసీ, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సమీక్షించారు. పరేడ్ ఉత్సవ సమీక్ష పూర్తయిన తరువాత శిక్షణలో మేటి ప్రతిభ కనబరిచిన మిడ్‌షిప్‌మెన్ మరియు క్యాడెట్లకు పతకాలను ప్రదానం చేశారు. వైస్ అడ్మిరల్ ఎం.ఎ. హంపిహోలి, ఏడీఎస్ఎమ్, ఎన్ఎమ్, కమాండెంట్, ఐఎన్ఏ ఈ కార్యక్రమానికి నిర్వహణ అధికారిగా వ్యవహరించారు. భారత నావల్ అకాడమీ బీటెక్ కోర్సు ‘ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్’ మిడ్‌షిప్‌మెన్ శ్రీ అంకుష్ ద్వివేదికి లభించింది. నావల్ ఓరియంటేషన్ కోర్సు (ఎక్స్‌టెండెడ్) ‘చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ గోల్డ్ మెడల్’ క్యాడెట్ సెడ్రిక్ సిరిల్‌కు లభించింది.
ఇతర పతకాలను గెలుచుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి: -
ఐఎన్ఏసీ బీటెక్ యొక్క సీఎన్ఎస్ రజత పతకం -మిడ్‌షిప్‌మెన్ హర్షిల్ కెర్ని, ఐఎన్ఏసీ బీటెక్ యొక్క ఎఫ్ఓసీ-ఇన్-సీ దక్షిణ కాంస్య పతకం - మిడ్‌షిప్‌మెన్ జెసిన్ అలెక్స్, ఎన్ఓసీ (ఎక్స్‌టెండెడ్)కు సంబంధించి ఎఫ్ఓసీ-ఇన్-సీ దక్షిణ రజత పతకం - సబ్ లెఫ్టినెంట్ శుభ్రత్ జైన్, ఎన్ఓసీ (ఎక్స్‌టెండెడ్) సంబంధించి కమాండెంట్ ఐఎన్ఏ కాంస్య పతకాన్ని సబ్ లెఫ్టినెంట్ కుశాల్ యాదవ్,
శిక్షణలో విజయవంతంగా నిలిచి ట్రైనీలు తమ మెరిసే కత్తులు మరియు రైఫిల్స్‌తో స్లో మార్చి నిర్వహిస్తూ వందనం సమర్పించి అకాడమీ క్వార్టర్‌డెక్ దాటి వెళ్లారు. ‘అవుల్డ్‌లాంగ్ సైనే’ యొక్క సాంప్రదాయ గమనికల మేరకు
ఈ పరేడ్ నిర్వహించారు. ఇండియన్ నావల్ అకాడమీలో వారి చివరి అడుగుగా
శిక్షణ పొందిన అధికారులు ‘అంతిమ్ పాద్’ను నిర్వహించారు. ఈ పరేడ్‌లో వారు సహోద్యోగులు మరియు సహచరులకు గౌరవవందనంగా ప్రపంచవ్యాప్తంగా సాయుధ దళాలు నిర్వహిస్తున్న మాదిరిగా పదునైన వీడ్కోలును పలికారు.
జనరల్ మనోజ్ ముకుంద్ నారావణే, పీవీఎస్ఎమ్, ఏవీఎస్ఎమ్, ఎస్ఎమ్, వీఎస్ఎమ్, ఏడీసీ, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పరేడ్‌లో పాల్గొన్న క్యాడెట్‌లను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. వారు జరిపిన స్మార్ట్ డ్రిల్ మరియు కవాతు కదలికలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన విధి నిర్వహణ,
ధైర్యం వంటి ప్రధాన విలువలను గురించి నొక్కి చెప్పాడు. దేశ యువకులను చక్కని యువ అధికారులుగా మలచుకున్నందుకు సమీక్షా అధికారిని ఐఎన్ఏలో బోధకులను అభినందించారు. సమీక్షా అధికారి మరియు ఇతర ప్రముఖులు కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసినందుకు పాసింగ్ అవుట్ ట్రైనీల్ని అభినందించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు ప్రత్యేక రంగాలలో వారి శిక్షణను మరింత పటిష్టం చేయడానికి.. వివిధ నావికాదళ నౌకలు మరియు సంస్థలకు వెళ్లనున్నారు. కోవిడ్-19 సమయంలో 800 మంది క్యాడెట్లకు శిక్షణ ఇవ్వడం మరియు ఐఎన్ఏ వద్ద ఆటమన్ టర్మ్ విజయవంతంగా ముగించడానికి అకాడమీ ఏర్పాటు చేసి పాటించిన కఠినమైన ముందు జాగ్రత్తలు ఎంతగానో దోహదం చేశాయి.
***
(Release ID: 1676957)
Visitor Counter : 163