ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడు ముఖ్యమంత్రితో సంభాషించిన - ప్రధానమంత్రి
తుఫాను బాధితుల కోసం ఎక్స్-గ్రేషియా ఆర్ధిక సహాయాన్ని ప్రకటించిన - ప్రధానమంత్రి
Posted On:
27 NOV 2020 9:59PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎడప్పాడి కె. పళనిస్వామి తో మాట్లాడి, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. రక్షణ, సహాయక చర్యలకు సహకరించడానికి కేంద్ర బృందాలను తమిళనాడుకు పంపుతున్నారు.
ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయినవారికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, మరణించిన వ్యక్తులు ఒక్కరికీ రెండు లక్షల రూపాయల చొప్పున వారి సమీప బంధువులకు, అదేవిధంగా గాయపడినవారికి, ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున, ఎక్స్-గ్రేషియాగా, పి.ఎమ్.ఎన్.ఆర్.ఎఫ్. నుండి ఆర్ధిక సహాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు.
*****
(Release ID: 1676634)
Visitor Counter : 109
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam