రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ద్విచక్ర వాహనదారుల హెల్మెట్ల బీఐఎస్ ప్రమాణాల సవరణ
Posted On:
27 NOV 2020 4:32PM by PIB Hyderabad
కేంద్ర ఉపరితల రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నెల 26వ తేదీన ‘ద్విచక్ర వాహనాలదారుల హెల్మెట్ మోటారు వాహనాల (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2020’ ఎస్.ఒ.4252(ఈ)ని జారీ చేసింది. ద్విచక్ర వాహన చోదకుల రక్షణతో కూడిన హెల్మెట్లకు తప్పనిసరి బీఐఎస్ ధ్రువీకరణ మరియు
నాణ్యత నియంత్రణ ఆర్డర్ ఈ ప్రచురణ కింద చేర్చబడ్డాయి. దేశంలోని వివిధ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా.. తేలికపాటి హెల్మెట్లను పరిగణనలోకి తీసుకోవటానికి మరియు శిరస్త్రాణాలు ధరించడానికి వీలుగా పౌరులలో సమ్మతిని నిర్ధారించడానికి రహదారి భద్రతపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. ప్రత్యేక కమిటీలో వివిధ రంగాలకు చెందిన పలువురు నిపుణులు ఉన్నారు. ఎయిమ్స్ నుండి నిపుణులు మరియు బీఐఎస్ నుండి కూడా నిపుణులు ఇందులో ఉన్నారు. వివరణాత్మక విశ్లేషణ తర్వాత.. మార్చి 2018లో కమిటీ దాని నివేదికలో భాగంగా తేలిక హెల్మెట్‌లను సిఫార్సు చేసింది మంత్రిత్వ శాఖ ఈ నివేదికను అంగీకరించింది. ఈ కమిటీ సిఫారసుల ప్రకారం, బీఐఎస్ ప్రమాణాలను సవరించింది. దీని ద్వారా తేలికైన హెల్మెట్లు తయారు చేసేలా చూడాలని భావిస్తున్నారు. భారతీయ మార్కెట్లలో మంచి పోటీతో మరియు అనేక హెల్మెట్ తయారీదారులు ఉన్నారు. ఈ తాజా సవరణలు నాణ్యమైన మరియు తేలికపాటి హెల్మెట్ల డిమాండ్ పెంచడంతో పాటు వారి మధ్య పోటీకి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ప్రతియేటా దేశంలో తయారవుతున్న మొత్తం ద్విచక్ర వాహనాల సంఖ్య దాదాపు 1.7 కోట్లకు చేరువలో ఉంటోంది. క్యూసీవో అంటే బీఐఎస్ సర్టిఫికేట్ పొందిన ద్విచక్ర వాహన హెల్మెట్లను మాత్రమే దేశంలో ద్విచక్ర వాహనాల కోసం తయారు చేసి విక్రయిస్తున్నారు. దేశంలో తక్కువ నాణ్యత గల ద్విచక్ర వాహన హెల్మెట్ల అమ్మకాలను నివారించడంలో ఇది సహాయపడుతుంది. ఇది ద్విచక్ర వాహన ప్రమాదాలలో చిక్కుకున్న పౌరులను ప్రాణాంతక గాయాల నుండి రక్షించడంలోనూ సహాయపడుతుంది.
***
(Release ID: 1676624)
Visitor Counter : 258