పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

పర్యావరణ పరిరక్షణ మరియు జీవవైవిధ్య పరిరక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం, ఫిన్లాండ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

వాతావరణ మార్పుల రంగంలో నిజమైన సహకారం కోసం అవగాహన ఒప్పందం ప్రపంచానికి సానుకూల సంకేతాన్ని పంపుతుంది: శ్రీ ప్రకాష్ జవదేకర్

Posted On: 26 NOV 2020 3:07PM by PIB Hyderabad

పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి భారత్, ఫిన్లాండ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్-ఫిన్నిష్ భాగస్వామ్యం, మద్దతును మరింత ముందుకు తీసుకురావడానికి, వాయు, నీటి కాలుష్య నివారణ, వ్యర్థ పదార్థాల నిర్వహణ; వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, తక్కువ-కార్బన్ పరిష్కారాలు, అడవులతో సహా సహజ వనరుల స్థిరమైన నిర్వహణ; వాతావరణ మార్పు; సముద్ర, తీర వనరుల పరిరక్షణ; మొదలైన రంగాలలో ఉత్తమ పద్ధతులను మార్పిడి చేయడానికి ఎంఓయూ ఒక వేదికగా నిలుస్తుంది. 

ఈ అవగాహన ఒప్పందంపై భారత వైపు నుంచి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జావదేకర్, ఫిన్నిష్ ప్రభుత్వం నుండి ఆ దేశ పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రి శ్రీమతి క్రిస్టా మిక్కోనెన్ సంతకం చేశారు.

 

ఈ కార్యక్రమంలో శ్రీ జవదేకర్ మాట్లాడుతూ పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులు చేసే అవకాశాన్నికూడా ఎంఓయు అందిస్తుంది అన్నారు. "పారిస్ ఒప్పందం ప్రకారం చేసిన కట్టుబాట్ల నెరవేర్పుపై మరింత దగ్గరగా పనిచేయడానికి ఈ అవగాహన ఒప్పందం ఖచ్చితంగా మాకు కట్టుబడి ఉంటుంది" అని పర్యావరణ మంత్రి చెప్పారు. 2020 నాటికి ఏదైతే 2005 నాటి జిడిపి ఉద్గార తీవ్రత 21% ఉందో, ఆ స్థాయికి తగ్గించే స్వచ్ఛంద లక్ష్యాన్ని భారత్ సాధించిందని, 2030 లక్ష్య సంవత్సరానికి ముందే 35% తగ్గింపును సాధించాలని శ్రీ జవదేకర్ తెలియజేశారు.

పారిస్ ఒప్పందం ప్రకారం సమర్పించిన, జాతీయంగా నిర్ణయించిన సహకారాల్లో భాగంగా, భారత్ మూడు పరిమాణాత్మక వాతావరణ మార్పు లక్ష్యాలను తీసుకుంది. అవి, 2005 స్థాయి నుండి 2030 నాటికి స్థూల జాతీయోత్పత్తి ఉద్గార తీవ్రతను 33 నుండి 35 శాతం మేర తగ్గించడం, 2030 నాటికి శిలాజ రహిత ఇంధన-ఆధారిత ఇంధన వనరుల నుండి 40 శాతం సంచిత విద్యుత్ శక్తిని వ్యవస్థాపిత సామర్థ్యాన్ని సాధించడం, 2030 నాటికి అదనపు అటవీ మరియు చెట్ల కవర్ ద్వారా 2.5- 3 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమానం అదనపు కార్బన్ సింక్‌ను సృష్టించడం.

ఈ అవగాహన సాంకేతిక, శాస్త్రీయ మరియు నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి సంబంధించి సమానత్వం, పరస్పర ప్రయోజనం ఆధారంగా పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని అభివృద్ధి చేస్తుంది.

 

***



(Release ID: 1676364) Visitor Counter : 236