సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇ-సంకలనాన్ని ఆవిష్కరించిన ప్రకాష్ జావదేకర్
Posted On:
26 NOV 2020 6:28PM by PIB Hyderabad
రాజ్యాంగం, ప్రాథమిక హక్కుల, ప్రాథమిక విధులపై వ్యాసాల ఇ- సంకలనాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ గురువారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేడు ఆవిష్కరించిన సంకలనం చాలా ముఖ్యమైన పత్రమని, ఈ చొరవ తీసుకున్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను మంత్రి అభినందించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) అందించిన వ్యాసాలు ప్రముఖల కలం నుంచి జాలువారినవని, సంబంధిత విషయాంశానికి ఇవి ఏక కేంద్ర ప్రమాణంగా ఉంటాయని చెప్పారు.
రాజ్యాంగం దేశంలోనే అతిపెద్ద మతపర గ్రంథమన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలను మంత్రి గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగం దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ఆలోచన ప్రధానమంత్రిదని ఆయన చెప్పారు.
రాజ్యాంగం అసమానమైన పత్రమని, ప్రజలందరి హక్కులను సమానంఆ ఇందులో పొందు పరిచి, సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయమనే వ్యవస్థను ఉనికిలోకి తెచ్చిందని, రాజ్యాంగ ప్రాముఖ్యతను జావదేకర్ నొక్కి చెప్పారు.
ఈ పుస్తకాన్ని దిగువన ఇచ్చిన లింక్ ద్వారా చదవవచ్చుః
https://static.pib.gov.in/WriteReadData/ebooklat/Flip-Book/constfiles/index.html
ఇ-సంకలనం గురించిః
న్యాయమూర్తులు, పారిశ్రామిక వేత్తలు, కళాకారులు సహా పలు రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు రచించిన 32 వ్యాసాలు ఈ ఇ-బుక్‌లో ఉన్నాయి. ఇందులో ప్రముఖ వ్యాసకర్తలు ఆనంద్ మహీంద్ర, అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్, సోనాల్ మాన్‌సింగ్. తొలుత కాఫీ టేబుల్ బుక్‌గా దీన్ని విడుదల చేయాలనుకున్నప్పటికీ, విస్త్రత స్థాయిలో దీన్ని అందుబాటులో ఉంచడం కోసం ఇ- సంకలనంగా విడుదల చేశారు. ఈ సంకలనం ప్రధానంగా రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులతో పాటుగా, జాతి సమగ్రతను సంరక్షించడం కోసం, ప్రజల ఉన్నతి కోసం రాజ్యాంగం పోషించిన భారీ పాత్రపై దృష్టి పెట్టింది.
****
(Release ID: 1676254)