రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ భద్రత మురియు వ్యక్తుల పాత్ర ప్రాముఖ్యతను వివరించిన జనరల్ వి.కె సింగ్
Posted On:
26 NOV 2020 1:47PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ సహాయమంత్రి జనరల్ వి.కె. సింగ్ జాతీయ భద్రతలో వ్యక్తుల పాత్ర యొక్క ప్రాముఖ్యతను వివరించారు. దేశ భద్రతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఏ విధంగా ఉంటుందన్న దానిపై మాట్లాడారు. జాతీయ భద్రత అంటే కేవలం రక్షణ సిబ్బంది బాధ్యత మాత్రమే అని భావిస్తాం. కానీ జాతీయ భద్రత విస్తృత అర్థాన్ని కలిగి ఉంది.
నిన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపిఎ) లో ‘నేషనల్ సెక్యూరిటీ డైలాగ్’ పై ప్రసంగించిన మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ఎక్సోరెటెడ్ మార్పుకు నాంది పలికాలని సభికులకు సూచించారు. సంపూర్ణ జాతీయ భద్రతను సాధించడానికి మన ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విడివిడిగా ఉంటూ మనం జాతీయ భద్రతను సాధించలేమని బాహ్య భద్రత, అంతర్గత భద్రత, ఇంధన భద్రత, సైబర్ భద్రత వంటి అన్ని భద్రతా విషయాలతో కూడిన సమగ్ర విధానం ఇది అని తెలిపారు.
భద్రతా అంశాలైన రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు, సైబర్ అంతరిక్ష భద్రత మరియు సాంకేతిక పరిజ్ఞానంపై స్వావలంబనను సాధించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణ మరియు నైపుణ్యం గల విధానం గురించి కేంద్రమంత్రి వివరించారు. ఆత్మనిర్బర్ భారత్ పై ఆయన ఉద్ఘాటించారు. రక్షణ పరికరాలతో పాటు ఇతర రంగాల్లో స్వదేశీ భారత్ లేదా స్వయం సమృద్ధి భారత్ అని తెలిపారు.
ఈ సమావేశానికి ఐఐపిఎ అధ్యాపకులు, సీనియర్ సిబ్బంది హాజరయ్యారు. 46 వ అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామిన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (APPPA)-(సాయుధ దళాలతో పాటు అఖిల భారత మరియు సెంట్రల్ సర్వీసెస్‌కు చెందిన సీనియర్ అధికారుల కోసం రూపొందించిన 10 నెలల కార్యక్రమం) తో పాటు ఐఐపీఎ యొక్క ప్రాంతీయ మరియు స్థానిక శాఖల సభ్యులు ఆన్‌లైన్ విధానంలో కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐఐపిఎలోని మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలకు జనరల్ వి కె సింగ్ పూలమాలలు వేశారు.
***
(Release ID: 1676132)
Visitor Counter : 155