రాష్ట్రప‌తి స‌చివాల‌యం

గురు తేజ్‌ బహదూర్ ‘బ‌లిదాన‌ దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రప‌తి సందేశం

Posted On: 23 NOV 2020 5:51PM by PIB Hyderabad

గురు తేజ్‌ బహదూర్ ‘బ‌లిదాన‌ దినోత్సవం’ సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ తన సందేశం అందించారు. "గురు తేజ్ ‌బహదూర్ గారి బలిదాన దినోత్సవం సందర్భంగా.. నేను ఆయనకు నా వినయపూర్వకమైన నివాళి అర్పిస్తున్నాను. సిక్కు సమాజానికి చెందిన తొమ్మిదవ గురువు శ్రీ తేజ్‌ బహదూర్ గారు ప్రజా విశ్వాసం, నమ్మకం మరియు హక్కులను పరిరక్షించడానికి అత్యున్నత త్యాగం చేశారు. కాబట్టి, తోటి పౌరులు ఆయ‌న్ని'హింద్ డి చాదర్' అని ప్రేమతో, గౌరవంగా పిలుస్తారు. ఆయన అపూర్వ త్యాగం,  మానవత్వం నిజమైన సేవ కోసం మనమందరం ఐక్యంగా ఉండటానికి ప్రేరేపిస్తుంది. గురు తేజ్ బహదూర్ బోధనలు మరియు అతని కృషి మనందరిలో ప్రేమ మరియు దేశభక్తి యొక్క స్ఫూర్తిని వ్యాప్తి చేస్తుంది. ఈ పవిత్ర రోజున, మన ఆలోచనల నుండి హింస, సంకుచితత్వము, ద్వేషాన్ని దూరం చేసుకుందాం. ఇతరులకు నిస్వార్థ సేవ కోసం మ‌నల్ని మ‌నం అంకితం చేసుకుందాము మరియు ప్రేమ, సామరస్యం మరియు కరుణ వంటి మానవ విలువలను ప్రోత్సహిద్దాము”. అని అన్నారు.

రాష్ట్రప‌తి సందేశాన్ని హిందీలో వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

***(Release ID: 1675227) Visitor Counter : 156