గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 243 నగరాలలో సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్ ప్రారంభించిన శ్రీ హర్దీప్ సింగ్ పూరి

ప్రమాదకర మురుగునీటి కాల్వలు మరియు సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచే సవాలు

యంత్రాలతో శుభ్రం చేయడానికి ప్రోత్సాహం

2021 మే నెలలో నగరాల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో అంచనా మరియు స్వాతంత్య్ర దినోత్సవంనాడు ఫలితాల ప్రకటన

వరల్డ్ టాయిలెట్ డే నిర్వహణ

Posted On: 19 NOV 2020 3:58PM by PIB Hyderabad

  ప్రజల ఆరోగ్యరక్షణ మరియు పరిశుభ్రత దృష్ట్యా అనివార్యమైన పరిస్థితులలో మినహా ఎవ్వరు కూడా మురుగునీటి కాల్వలోకి గాని,  సెప్టిక్ ట్యాంకులోకి గాని దిగకుండా చూసేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖను స్వతంత్రంగా నిర్వహిస్తున్న సహాయ మంత్రి శ్రీ  హర్దీప్ సింగ్ పూరి  అన్నారు.  న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక వెబినార్ లో సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్ ను ప్రారంభిస్తూ  మురుగునీటి కాల్వలు మరియు సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచే ప్రమాదకర పని కారణంగా ఏ ఒక్కరు మరణించకుండా చూసే లక్ష్యంతో ప్రారంభిస్తున్న సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్ ఒక మైలు రాయి వంటిదని అన్నారు.   స్వచ్ఛ భారత్ మిషన్ - పట్టణ (ఎస్ బి ఎం - యు)  కార్యక్రమం మౌలికంగా పారిశుధ్య కార్మికుల భద్రత మరియు గౌరవానికి ప్రాధాన్యమిస్తుందని,  ఇది  పారిశుధ్య కార్మికుల భద్రతకు మరియు గౌరవానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న గౌరవనీయ ప్రధానమంత్రి భావనకు అనుగుణంగా ఉందని ఆయన అన్నారు.  

వరల్డ్ టాయిలెట్ డే  సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సముచితంగా ఉంది. 'ప్రమాదకర ప్రక్షాళన'ను నిరోధించి మురుగునీటి కాల్వలు, సెప్టిక్ ట్యాంకులను యాంత్రికంగా శుభ్రం చేయడాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం.  చాక్షుష రీతిలో సాగిన ఈ కార్యక్రమంలో  రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలు, మిషన్ రాష్ట్ర డైరెక్టర్లు మరియు ఇతర రాష్ట్ర /కేంద్రపాలిత మరియు నగరపాలక సీనియర్ అధికారులు  కలసికట్టుగా  243 నగరాల తరపున అన్ని నగరాలలో 2021 ఏప్రిల్ 30 నాటికి అన్ని మురుగునీటి కాల్వలు మరియు సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసే పని యాంత్రీకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.  అంతేకాక్  వాటిని పరిశుభ్రం చేసే క్రమంలో ఎలాంటి మరణాలు సంభవించకుండా చూస్తామని వారు వాగ్దానం చేశారు.  సామాజిక న్యాయం మంత్రిత్వ శాఖ,   త్రాగునీరు మరియు పారిశుద్ధ్యం శాఖ,  పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్యం శాఖ సెక్రెటరీలు వెబినార్ లో పాల్గొన్నారు.   ప్రక్షాళన ప్రక్రియను  యాంత్రీకరించే పనికి తమ మంత్రిత్వ శాఖలు ఏ విధంగా తోడ్పడుతున్నాయో వారు వివరించారు.  

ఈ సందర్బంగా శ్రీ పూరి  మాట్లాడుతూ  గతంలో నగరాలలో పౌరులు  స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తమ సొంత పనిగా భావించి విజయవంతం చేశారని,  ఇప్పుడు కూడా మురుగునీటి కాల్వలు,  ట్యాంకులను శుభ్రం చేసే పాకీ పనివారు,  స్వచ్ఛతా కమెండోల మరణాలు సంభవించకుండా ప్రతి ఒక్కరూ నిఘావేసి ఉండాలని,  బాధ్యతగా వ్యవహరించి ఎవరి ప్రాణాలు పోకుండా చూడాలని అన్నారు.  

కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్  రూపరేఖలువివరించారు.  ఈ కార్యక్రమం అమలయ్యే 243 నగరాలలో పరిస్థితిని  2021 మే నెలలో  ఒక స్వతంత్ర సంస్థ  అంచనా వేస్తుంది.  ఫలితాలను 2021 ఆగస్టు 15వ తేదీన ప్రకటిస్తారు.  నగరాలను జనాభా ప్రాతిపదికన 10 లక్షలు, 3-10 లక్షలు,  3 లక్షల వరకు మూడు వర్గాలుగా విభజించి బహుమతి మొత్తం రూ. 52 కోట్లను పంచుతారు.  

కార్యక్రమం ద్వితీయార్ధంలో జరిగిన చర్చాగోష్టిలో  ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సూరత్, హైదరాబాద్,  లూథియానాల ప్రతినిధులు పాల్గొన్నారు.

2014లో ప్రారంభించినప్పటి నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ - యు ఎంతో ప్రగతిని సాధించింది.   పట్టణ  ప్రాంతాలలోని 4337 స్థానిక సంస్థలు బహిరంగ మల విసర్జన నుంచి విముక్తి పొందాయి.  ఘన వ్యర్ధాల నిర్వహణలో కూడా ప్రగతి జరిగింది. పట్టణ  ప్రాంతాలలోని 97%  వార్డులలో 100% చెత్త సేకరించడం జరుగుతోంది.  ఉత్పత్తయిన చెత్తలో 67%  ప్రాసెస్ చేయడం జరుగుతోంది.  చెత్త లేని నగరాలలో  మొత్తం  ఆరు నగరాలకు 5 స్టార్,  86 నగరాలకు 3 స్టార్  ,  64 నగరాలకు 1 స్టార్ రేటింగ్ లభించింది.  

****



(Release ID: 1674925) Visitor Counter : 316