రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

అండమాన్‌ సముద్రంలో త్రైపాక్షిక నావికాదళ విన్యాసాలు 'సిట్‌మెక్స్‌-20'

Posted On: 22 NOV 2020 10:14AM by PIB Hyderabad

రెండో దఫా సిట్‌మెక్స్‌-20 త్రైపాక్షిక విన్యాసాలు శని, ఆదివారాల్లో అండమాన్‌ సముద్రంలో జరిగాయి. భారత్‌, సింగపూర్‌, థాయిలాండ్‌ నౌకాదళాలు ఇందులో పాల్గొన్నాయి. దేశీయంగా రూపొందించిన చిన్నపాటి యుద్ధనౌకలు కామోర్త, కార్ముక్‌ సహా భారత నౌకలు ఇందులో పాల్గొన్నాయి.

    మొదటి దఫా సిట్‌మెక్స్‌ విన్యాసాలను గతేడాది సెప్టెంబర్‌లో పోర్ట్‌ బ్లెయిర్‌ జలాల్లో భారత్‌ నిర్వహించింది. మూడు దేశాల మధ్య పరస్పర సహాయసహకారాలు, ఉత్తమ సాధనలను పెంపొందించుకోవడానికి ఏటా దీనిని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరిగిన విన్యాసాలకు సింగపూర్‌ నౌకాదళం అతిథ్యమిచ్చింది.

    సింగపూర్‌ తరపున 'ఇంటర్పిడ్'‌, ల్యాండింగ్‌ షిప్‌ట్యాక్‌ 'ఎండెవర్‌' యుద్ధనౌకలు విన్యాసాల్లో పాల్గొనగా, థాయ్‌లాండ్‌ తరపున 'క్రాబురీ' యుద్ధనౌక తరలివచ్చింది.

    కొవిడ్‌ దృష్ట్యా 'నాన్‌ కాంటాక్ట్, ఎట్‌ సీ ఓన్లీ' విధానంలో సిట్‌మెక్స్‌ విన్యాసాలు సాగాయి. ఈ మూడు సముద్ర సరిహద్దు దేశాల మధ్య సముద్ర రంగంలో పెరుగుతున్న సమన్వయం, సహకారాన్ని నౌకాదళ విన్యాసాలు చాటి చెప్పాయి. ఉపరితల యుద్ధ విన్యాసాలు, ఆయుధ కాల్పులు సహా వివిధ రకాల విన్యాసాలను ఈ రెండు రోజులపాటు సైనికులు రోజులు ప్రదర్శించారు.

    మూడు మిత్రదేశాల మధ్య సహాయసహకారాల వృద్ధితోపాటు; పరస్పర విశ్వాసాల పెంపు, ఈ ప్రాంత సముద్ర రంగ భద్రత పెంచేలా అవగాహన, విధానాలను వృద్ధి చేయడం సిట్‌మెక్స్‌ లక్ష్యం.

***


(Release ID: 1674887) Visitor Counter : 275