కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
వినూత్న కార్మక సంస్కరణల అమలుకు వృత్తి సంబంధ రక్షణ, ఆరోగ్య, పని పరిస్థితుల కోడ్ 2020 కింద ముసాయిదా నియమాలను నోటిఫై చేసిన కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ
సంరక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితులను మెరుగుపరచి, ప్రక్రియలను సరళీకృతం చేయడం ముసాయిదా నియమాల లక్ష్యం.
Posted On:
20 NOV 2020 3:21PM by PIB Hyderabad
కేంద్ర కార్మిక, మంత్రిత్వ శాఖ వృత్తి సంబంధ రక్షణ, ఆరోగ్య, పని పరిస్థితుల కోడ్ 2020 కింద భాగస్వాములందరి నుంచి ముసాయిదా నియమాలపై సూచనలను, అభ్యంతరాలను ఆహ్వానిస్తూ 19.11.2020న నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ముసాయిదా నియమాలను నోటిఫై చేసిన తేదీ నుంచి 45 రోజుల లోపు ఈ అభ్యంతరాలను, సూచనలను సమర్పించవలసి ఉంటుంది.
2.వృత్తి సంబంధ రక్షణ, ఆరోగ్య, పని పరిస్థితుల కోడ్ 2020కు సంబంధించి రక్షణ, ఆరోగ్యం, డాక్ కార్మికులు, నిర్మాణ లేక నిర్మాణ కార్మికులు, గనుల కార్మికులు, అంతర్ రాష్ట్ర వలస కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, వర్కింగ్ జర్నలిస్టులు, ఆడియో- విజువల్ కార్మికులు,అమ్మకాల ప్రమొషన్ ఉద్యోగులకు సంబంధించి ఈ ముసాయిదా నియమాలకు సంబంధించిన అంశాల కార్యాచరణను రూపొందించాయి. ముసాయిదా నియమాలలోని ముఖ్యాంశాలుః
1. ప్రతి సంస్థలోని ఉద్యోగికి హోదా, నైపుణ్యం వర్గం, ఉన్నత వేతనాన్ని/ ఉన్నత హోదా తదితరాలను అందుకునేందుకు మార్గానికి సంబంధించి నిర్దేశిత ఫార్మాట్‌లో నియామక పత్రాన్ని ఈ నియమాలు అమలులోకి వచ్చిన మూడు నెలలలోపు అందించాలి. నూతన నిబంధనల ప్రకారం, నియామక పత్రాన్ని ఇవ్వకుండా ఏ సంస్థా కూడా ఉద్యోగిని నియమించడానికి వీలు లేదు.
బి.) ప్రతి పరిశ్రమ, ఓడరేవు, గని, నిర్మాణం లేక నిర్మాణ పని చేస్తూ, 45 ఏళ్ళు దాటిన ఉద్యోగికి యజమాని ప్రతి ఏడాది ఉచితంగా ఆరోగ్య పరీక్షలను నిర్వహింపచేయాలి.
సి.) అంతర్ రాష్ట్ర వలస కార్మికులకు తమ గ్రామాలకు వెళ్ళి రావడానికి ఏడాదికి ఒకసారి ప్రయాణ అలవెన్్సను కల్పిస్తూ నియమాలలో అవకాశం ఇచ్చింది. దానికి తోడుగా వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు టాల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటును కూడా నిర్దేశించింది.
డి.) సంస్థకు సంబంధించి ఏక ఎలక్ట్రానిక్ నమోదు, లైసెన్స్, వార్షిక సమగ్ర రిటర్్నకు సదుపాయం.
ఇ.) ప్రస్తుతం పని క్రమం ఆధారంగా ఒక రాష్ట్రానికి మించి కాంట్రాక్టు కార్మికులను సరఫరా చేసే కాంట్రాక్టరుకు ఐదేళ్ళపాటు అఖిల్ భారత ఏక లైసెన్్సను ఇస్తున్నారు.
ఎఫ్.) సంస్థలోని కీలక కార్యకలాపానికి సంబంధించి కాంట్రాక్టు కార్మికులను నియమించడాన్ని నిషేధిస్తూ, కీలక, అంత కీలకం కాని కార్యకలాపాలకు సంబంధించిన వర్గీకరణను వృత్తి సంబంధ రక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్, 2020లో నియమాలను రూపొందించారు.
జి.) కాంట్రాక్టు కార్మికులకు వేతనాల చెల్లింపుకు సంబంధించి ఎ) వేతన కాలాన్ని కాంట్రాక్టరు నిర్ణయిస్తాడు, ఏ వేతన కాలం కూడా నెలను మించరాదు. బి) సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా నియమితులైన లేక కాంట్రాక్టర్ నియమించిన కార్మికులకు సంబంధించిన వేతనాలు వేతన కాలం చివరి రోజు నుంచి ఏడు రోజులలోపు చెల్లించవలసి ఉంటుంది. సి) వేతనాలను బ్యాంకు బదలాయింపులు లేక ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో మాత్రమే చెల్లించాలి.
హెచ్.) ఐదు వందలు లేక అంతకు మించి ఉద్యోగులను నియమించుకునే ప్రతి సంస్థలోనూ సంరక్షణ కమిటీల ఏర్పాటు తప్పనిసరి. ఇది ఉద్యోగులు తమ వృత్తి సంబంధ రక్షణ, ఆరోగ్య విషయాలు, నియమాలకు సంబంధించిన ఆందోళనలను తెలియచేసే అవకాశాన్ని కల్పించేందుకు సంరక్షణ కమిటీల ఏర్పాటు విధులను రూపొందించారు.
ఐ.) అన్ని సంస్థలలోని అన్ని రకాల పనులలో నిమగ్నమయ్యే మహిళా ఉద్యోగుల రక్షణకు సంబంధించి నియమాలను రూపొందించడం జరిగింది. వారికి, వారి ఆమోదం లేకుండా ఉదయం 6 గంటలకు ముందు, సాయంత్రం 7 గంటల తర్వాత పని ఇవ్వకూడదు.
జె.) ఏరోజైనా ఓవర్‌టైమ్‌ను గణించేటప్పుడు, 15 నుంచి 30 నిమిషాల మధ్య కాలాన్ని 30 నిమిషాలుగా పరిగణించాలి. ప్రస్తుతం 30 నిమిషాలకన్నా తక్కువ కాలాన్ని ఓవర్‌టైంగా పరిగణించడంలేదు.
కె.) గనుల నిబంధనలను సరళీకృతం చేసి, వృత్తి సంబంధ రక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితుల నియమాలతో జోడించడం జరిగింది.
ఎల్.) సంస్థలలో వృత్తి సంబంధ రక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితుల నియమాలను మెరుగుపరిచి, ప్రక్రియలను, ప్రోటోకాళ్ళను సరళీకృతం చేసేందుకు, ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా రిజిస్టర్లను నిర్వహించేందుకు, రికార్డులు, రిటర్న్్సను సమర్పించే సౌకర్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో ముసాయిదా నియమాలు రూపొందించడం జరిగింది. తద్వారా సురక్షితమైన, ఆరోగ్యకరమైన, మంచి పని పరిస్థితులను కల్పించాలన్నది ఈ నియమాల ఆశయం.
***
(Release ID: 1674468)
Visitor Counter : 205