వ్యవసాయ మంత్రిత్వ శాఖ

సూక్ష్మ నీటిపారుదల నిధి నుంచి వడ్డీ లేని రుణం విడుదల

Posted On: 20 NOV 2020 11:46AM by PIB Hyderabad

నాబర్డ్‌ వద్ద రూ.5 వేల కోట్ల మూలధనంతో 2019-20లో సూక్ష్మ నీటిపారుదల నిధి (ఎంఐఎఫ్‌) ఏర్పాటైంది. ప్రత్యేక, సృజనాత్మక ప్రాజెక్టుల ద్వారా సూక్ష్మ నీటిపారుదల సాగును విస్తరించేందుకు, సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలకు ప్రోత్సాహకాలు అందించేందుకు వడ్డీ లేని రుణాలను రాష్ట్రాలకు అందుబాటులోకి తేవడం ఈ నిధి ఉద్దేశం. 'పీఎంకేఎస్‌వై-పర్‌ డ్రాప్‌ మోర్‌ క్రాప్‌' ద్వారా అందే లబ్ధికి అదనంగా ఈ ప్రోత్సాహకాలిచ్చి రైతులను ప్రోత్సహించడానికి ఈ నిధిని ఏర్పాటు చేశారు.

    వివిధ రాష్ట్రాలకు రూ.3971.31 కోట్ల రుణాలిచ్చేందుకు ఎంఐఎఫ్‌ క్రియాశీల కమిటీ అనుమతించింది. ఇందులో గుజరాత్‌కు రూ.764.13 కోట్లు, తమిళనాడుకు రూ.1357.93 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.616.13 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.276.55 కోట్లు, హర్యానాకు రూ.790.94 కోట్లు, పంజాబ్‌కు రూ.150 కోట్లు, ఉత్తరాఖండ్‌కు రూ.15.63 కోట్లను ఇస్తున్నారు.

    దీంతోపాటు హర్యానా, తమిళనాడు, గుజరాత్‌కు రూ.659.70 కోట్ల రుణాన్ని నాబార్డ్‌ విడుదల చేసింది. దీంతో, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన రూ.616.13 కోట్లు, తమిళనాడుకు ఇచ్చిన రూ.937.47 కోట్లు, హర్యానాకు ఇచ్చిన రూ.21.57 కోట్లు, గుజరాత్‌కు ఇచ్చిన రూ.179.43 కోట్లతో కలిపి నాబార్డ్‌ ఇప్పటివరకు ఇచ్చిన రుణ మొత్తం రూ.1754.60 కోట్లకు చేరింది.

***(Release ID: 1674402) Visitor Counter : 181