ప్రధాన మంత్రి కార్యాలయం

రుపే కార్డు రెండవ దశ ప్రారంభోత్సవ వర్చువల్ కార్యక్రమం భూటాన్ లో జరుగుతుంది

Posted On: 19 NOV 2020 7:41PM by PIB Hyderabad

2020 నవంబర్, 20వ తేదీన భూటాన్ లో జరిగే వర్చువల్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు భూటాన్ ప్రధాన మంత్రి డాక్టర్ లోటే థెరింగ్ సంయుక్తంగా, రుపే కార్డు రెండవ దశను ప్రారంభించనున్నారు.

భారత ప్రధానమంత్రి భూటాన్ లో అధికార పర్యటన సందర్భంగా, 2019 ఆగష్టు లో భారత, భూటాన్ ప్రధానమంత్రులు సంయుక్తంగా ఈ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించారు.  భూటాన్ ‌లో రుపే కార్డుల మొదటి దశ అమలులో భాగంగా భారతదేశం నుండి వచ్చిన సందర్శకులు భూటాన్ అంతటా ఎ.టి.ఎమ్. లు మరియు పాయింట్ ఆఫ్ సేల్ (పి.ఓ.ఎస్.లు) కేంద్రాలను వినియోగించుకోడానికి వీలు కలిగింది. కాగా,  ఇప్పుడు రెండవ దశలో,  భూటాన్ కు చెందిన కార్డుదారులు భారతదేశంలో రుపే నెట్‌వర్క్ ‌ను వినియోగించుకోడానికి వీలు కలుగుతుంది.   

భారత, భూటాన్ దేశాలు ఒక ప్రత్యేక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయి. పరస్పర అవగాహన, గౌరవంతో ముడిపడిన భాగస్వామ్య సాంస్కృతిక వారసత్వం, ప్రజల మధ్య పటిష్టమైన పరస్పర సంబంధాలతో బలోపేతం చేయబడ్డాయి.

 

*****(Release ID: 1674268) Visitor Counter : 230