గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

ఆధునీకరణ తర్వాత అందుబాటులోకి వచ్చిన 'కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ' వెబ్‌సైట్‌

Posted On: 18 NOV 2020 5:49PM by PIB Hyderabad

'కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ'కు చెందన జాతీయ గణాంకాల కార్యాలయం, మరింత మెరుగైన పనితనం, సమాచార సౌలభ్యంతో తన వెబ్‌సైట్‌ను ఆధునీకరించింది. ఆధునీకరించిన వెబ్‌సైట్‌ బుధవారం (18.11.2020‌) నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. mospi.gov.in ద్వారా ఈ వెబ్‌సైట్‌ను ప్రజలు చూడవచ్చు.

    వినియోగదారులకు సమీకృత డిజిటల్‌ అనుభవాలను అందించేలా ఆధునిక పోర్టల్‌ అభివృద్ధి సాంకేతికతతో వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు. డీఏఆర్‌పీజీ, ఎన్‌ఐసీ ప్రకటించిన జీఐజీడబ్ల్యూ మార్గదర్శకాల ప్రకారం పునరుద్ధరణ జరిగింది. ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి సమర్థవంతంగా సమాచార మార్పిడి జరిగేలా, 'సెంట్రల్‌ బ్యానర్‌ పబ్లిషింగ్‌ స్కీమ్‌' (సీబీపీఎస్‌)కు అనుగుణంగా వెబ్‌సైట్‌ను మార్చారు.

    వినియోగదారుల్లో అయోమయానికి తావులేకుండా, అంశాలన్నింటినీ స్పష్టంగా గుర్తించేలా, దృశ్య సమాహారంగా, స్నేహపూర్వకంగా ఉండేలా వెబ్‌సైట్‌ను మార్చారు. దీనిని మొబైల్‌ ఫోన్‌లో కూడా చూడవచ్చు. వినియోగదారులకు ఉత్తమ ఫలితాలు అందించేలా "శోధన" అంశాన్ని మెరుగుపరిచారు. సులభమైన నావిగేషన్‌తో, సమాచార లింకులను చక్కగా అర్ధం చేసుకునేలా నిర్మించారు. మొత్తంగా; కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వ్యవస్థను, అధికారుల వివరాలను వెబ్‌సైట్‌లో కొత్తగా పొందుపరిచారు.

    వెబ్‌సైట్‌ను సందర్శించేవారు వారి అనుభవాన్ని వ్యక్తం చేయవచ్చు. తాము ఇంకా కోరుకునే అంశాన్ని "పబ్లిక్‌ పార్టిసిపేషన్‌"లో నమోదు చేయవచ్చు. "షేర్‌ బటన్‌" ద్వారా వెబ్‌సైట్‌లోని సమాచార లింకులను సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరికైనా పంపవచ్చు.

    వెబ్‌సైట్‌ కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు, పాత వెబ్‌సైట్‌ లింక్‌ కొత్త వెబ్‌సైట్‌లో ఆరు నెలలపాటు అందుబాటులో ఉంటుంది. పాత వెబ్‌సైట్‌ను mospi.nic.in ద్వారా కూడా సందర్శించవచ్చు.

సూచన:     1. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ http://www.mospi.gov.in లోనూ ఈ పత్రిక సమాచారం అందుబాటులో ఉంటుంది. 
    2. http://mospi.gov.in/hi ద్వారా ఈ పత్రిక ప్రకటనను హిందీలోనూ చూడవచ్చు.

***
 


(Release ID: 1673886) Visitor Counter : 115