పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కాలబురిగి నుంచి హిండాన్‌కు నేరుగా తొలి విమాన సర్వీసు ప్రారంభం
ఇప్పటివరకు 295 మార్గాలు 53 విమానాశ్రయాలు ఇప్పటివరకూ ఉడాన్ కింద తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.
Posted On:
18 NOV 2020 1:46PM by PIB Hyderabad
ఆర్‌సిఎస్-ఉడాన్( ప్రాంతీయ అనుసంధానత పథకం) కింద కర్ణాటకలోని కాలబురగి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ హిండన్ విమానాశ్రయానికి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించారు. ఉడాన్ పథకం కంఇద దేశంలో మెరుగైన అనుసంధానత కల్పించేందుకు ఎం.ఒ.సి.ఎ, ఎఎఐల నిబద్ధత కృషితో ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో పౌరవిమానయాన మంత్రిత్వశాఖ (ఎం.ఒ.సి.ఎ), ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ)కు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇప్పటివరకూ 295 మార్గాలు, 53 విమానానాశ్రయాలు, 5 హెలిపోర్టులు, 2 వాటర్ ఎయిరొడ్రోమ్‌లు ఉడాన్ పథకం కింద కార్యరూపం దాల్చాయి.
విమానయాన సంస్థ స్టార్ ఎయిర్‌కు కాలబురగి-హిండ్ మార్గాన్ని ఆర్‌సిఎస్-ఉడాన్ -3 బిడ్డింగ్ ప్రక్రియ కింద గత ఏడాది కేటాయించారు. ఈ విమానయాన సంస్థ వారానికి మూడు విమానాలను ఈ మార్గంలో నడుపుతుంది. ఇది 50 సీట్లు కలిగిన ఎంబ్రేర్ -145 లక్సరీ ఎయిర్ క్రాఫ్ట్. ప్రస్తుతం ఇది ఉడాన్ కింద 15 మార్గాలను కవర్ చేస్తుంది. కాలబురగి-హిండాన్ మార్గంతో కలిసి స్టార్ ఎయిర్‌కు ఆర్‌సిఎస్ -ఉడాన్ కింద 16 మార్గాలు లభించినట్టు అవుతుంది.
న్యూఢిల్లీకి 30 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న విమానాశ్రయం హిండాన్ విమానాశ్రయం. ఇది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందినది. దీని భూమిని కొత్త సివిల్ ఎన్‌క్లేవ్ అభివృద్ధికి ఎఎఐ కి కేటాయించారు. ఉడాన్ పథకం కింద పౌర విమానాలకు ఈ ఎయిర్ బేస్‌ను వాడుకునేందుకు ఐఎఎఫ్ అనుమతి మంజూరు చేసింది. అలాగే, కాలబురగి విమానాశ్రయం , కాలబురగి నగరానికి 13.8 కిలో మీటర్ల దూరంలో ఉంది.ఇది కూడా ఉడాన్ కింద కార్యరూపంలోకి వచ్చింది. దీనివల్ల దేశంలో టైర్ 2 , టైర్ 3 నగరాలకు అనుసంధానతకు ఊతం లభిస్తుంది.కాలబురగి సంస్కృతికి పేరెన్నికగన్న ప్రాంతం. పర్యాటక ప్రాంతాలకు ఇది ముఖద్వారం. బుద్ధవిహార్, శరణ బసవేశ్వర ఆలయం, ఖ్వాజా బండ నవాజ్ దర్గా, గుల్బర్గా కోట వంటి పర్యాటక కేంద్రాలను ఇది న్యూఢిల్లీతో విమాన సర్వీసుల ద్వారా తొలిసారిగా కలుపుతోంది. ఇది ఈ ప్రాంత వాణిజ్య, పర్యాటకానికి చోదకశక్తిగా ఉపయోగపడుతుంది.
ఇప్పటివరకూ ప్రజలు కాలబురగి నుంచి హిండాన్ వెళ్లడానికి నేరుగా విమాన సర్వీసులు లేక ప్రజలు రోడ్డు మార్గం ద్వారా లేదక రైలు లో ప్రయాణించాల్సి వచ్చేది. 1600 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 25 గంటలకు పైగా సమయం పట్టేది. ప్రస్తుతం వారు నేరుగా విమానసర్వీసును ఉపయోగించుకుని ఈ దూరాన్ని కేవలం 2 గంటల 20 నిమిషాలలో వెళ్లవచ్చు. ఇది వ్యక్తిగత పనులకు, వృత్తిపరమైన కార్యకలాపాలు పూర్తిచేసుకోవడానికి ఇది అనువుగా ఉంటుంది. బిజాపూర్, షోలాపూర్, ఉస్మానాబాద్, లాతూర్,యాద్గిర్, రంగారెడ్డి , మెదక్ కాలబురగి-హిండాన్ మార్గం విమాన కార్యకలాపాల ద్వారా నేరుగా ప్రయోజనం పొందుతాయి.
***
(Release ID: 1673789)
Visitor Counter : 229